అభిమానులకు అక్కినేని కోడలు సూపర్ గుడ్‌న్యూస్.. పెళ్లైన ఇన్ని రోజులకు..!
Sobhita Dhulipala: టాలీవుడ్ నటి శోభిత దూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేనివారి ఇంట కోడలుగా అడుగుపెట్టిన శోభిత.. ఇప్పుడు అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ అందించింది. ఆ వివరాలు ఇలా..

తెలుగమ్మాయి శోభిత..
శోభిత దూళిపాళ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఈ చిన్నది తెలుగమ్మాయే అయినప్పటికీ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఇటు టాలీవుడ్‌లో అడపాదడపా మూవీస్‌తో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
నాగచైతన్యతో లవ్, పెళ్లి..
2022వ సంవత్సరం నుంచి అక్కినేని నాగచైతన్యతో డేటింగ్‌లో ఉన్న హీరోయిన్ శోభిత.. రెండేళ్ళ తర్వాత ఆగష్టు 8, 2024న అతడితో నిశ్చితార్థం చేసుకుంది. ఆపై వీరిద్దరూ డిసెంబర్ 4, 2024న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒకటయ్యారు. అయితే పెళ్లై ఒక సంవత్సరం అవుతున్నప్పటికీ కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.
గుడ్ న్యూస్ చెప్పిన శోభిత..
పెళ్లైన ఏడాది తర్వాత గుడ్ న్యూస్ చెప్పింది అక్కినేని కోడలు. తన కొత్త సినిమాను ప్రకటించింది శోభిత. ఈ సినిమాకు 'చీకటిలో' అనే టైటిల్ ఫిక్స్ కాగా.. ఇది డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.
పోస్టర్ వైరల్..
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది శోభిత దూళిపాళ. ఇందులో శోభిత రేడియో జాకీలా కనిపిస్తుండగా.. ఆపై వెనుక ఇన్వెస్టిగేషన్ సెటప్ ఉంది. దీంతో ఇది థ్రిల్లర్ జోనర్ అని అభిమానులు అంటున్నారు.
సినిమాలు, ఆపై వెబ్ సిరీస్‌లు..
మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లతో శోభిత దూళిపాళ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గూడచారి, ఘోస్ట్ స్టోరీస్, కురుప్, మేజర్ లాంటి హిట్ చిత్రాలతో తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది శోభిత దూళిపాళ.

