మహేష్ విషయంలో నా తప్పేం లేదు.! కానీ.. అప్పుడే సంచలన నిర్ణయం తీసుకున్నా..
Director Teja: గతంలో డైరెక్టర్ తేజ.. మహేష్ బాబు దత్తత గ్రామంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

నా తప్పేం లేకుండానే..
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్.. అప్పట్లో ఓ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు దత్తత గ్రామంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరు వక్రీకరించారని ఆ సమయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఈ విషయాన్ని చెబుతూ ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు.
నేను చెప్పింది ఇదే..
ఆ సమయంలో తేజ ఇలా అన్నారు. మహేష్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకోవడంపై, 'నిజంగా ఫుల్ హార్టెడ్‌గా చేసి ఉంటే గనక హ్యాట్స్ ఆఫ్ టూ హిమ్' అని దర్శకుడు తేజ చెప్పారు. అయితే ఆయన చెప్పిన మాటలను కొందరు వక్రీకరించారు. 'మామూలుగా ఎక్కువ మంది ఇలాంటివన్నీ చేసేది ఇన్‌కమ్ టాక్స్ కోసం చేస్తూ ఉంటారు' అన్న తన వ్యాఖ్యను మాత్రమే హైలైట్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను చెప్పిన అసలు విషయాన్ని పక్కన పెట్టి, వివాదాస్పద అంశాన్ని మాత్రమే ప్రచారం చేశారు.
అప్పుడే కీలక నిర్ణయం
ఈ ఘటనతో తాను అప్పుడే ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని దర్శకుడు తేజ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ప్రచురిస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తే తప్ప ఇకపై ఇంటర్వ్యూలు ఇవ్వనని కుండబద్దలు కొట్టారు. 'ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ. ఇంక ఇవ్వను. నెక్స్ట్ సినిమా రిలీజ్‌కి కూడా ఇవ్వను' అని అప్పుడు తేజ అన్నారు.
ఆర్జీవీతో వార్తలు అన్నీ..
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడాకుల కేసులో తేజ మధ్యవర్తిత్వం వహించారన్న వార్తలను ఆయన ఖండించారు. రామ్ గోపాల్ వర్మ 'వన్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ ఇండస్ట్రీ' అని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని తేజ పేర్కొన్నారు. అలాగే ఆయన సినిమాల్లోని లెక్చరర్ నెగటివ్ పాత్రలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
కొందరు తప్పు చేసేవారు ఉంటారు..
సమాజంలో అందరు లెక్చరర్లు మంచివాళ్లే అని గ్యారెంటీ ఇవ్వలేమని దర్శకుడు తేజ అన్నారు. కొందరు తప్పు చేసేవారు ఉంటారని, వారిని తాను సినిమాల్లో చూపిస్తానని తేజ వివరించారు. కూతురితో అసభ్యంగా ప్రవర్తించే తండ్రులు కూడా సమాజంలో ఉంటారని, అలాంటి వాస్తవాలను సినిమాల్లో చూపించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం సినిమాను ఉదాహరణగా చూపుతూ, 16-17 ఏళ్ల అమ్మాయి గర్భవతి కావడం లాంటి వాస్తవాలను తెరపై చూపినప్పుడు కేసులు పెట్టారని, కానీ సమాజంలో ఇలాంటివి అనేకం జరుగుతున్నాయని తేజ అన్నారు.

