- Home
- Entertainment
- శోభన్ బాబు పిసినారి కాదు, 60 కుటుంబాలకు ఆయన ఏం చేశారో తెలుసా? సోగ్గాడు స్వయంగా వెల్లడించిన విషయాలు
శోభన్ బాబు పిసినారి కాదు, 60 కుటుంబాలకు ఆయన ఏం చేశారో తెలుసా? సోగ్గాడు స్వయంగా వెల్లడించిన విషయాలు
టాలీవుడ్ లో ఒకప్పటి అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు. ఇండస్ట్రీలో చాలామంది ఆయన్ను పిసినారి అనేవారు. డబ్బులు ఖర్చు పెట్టడు, ఎవరికీ రూపాయి కూడా ఇవ్వడు అని విమర్శించేవారు. కానీ శోభన్ బాబు చేసిన గుప్త దానాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

టాలీవుడ్ అందాల నటుడు
ఆ కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరో అంటు ముందుగా శోభన్ బాబు పేరు వినిపించేది. ఆయన గ్లామర్ ఎలా ఉండేదంటే.. సోగ్గాడు అందగాడు అన్న బిరుదులు వచ్చేవాయి. శోభన్ బాబును కొంతమంది పిచ్చిగా ప్రేమించేవారు. ఒక సారి అవుడ్ డోర్ షూటింగ్ లో ఒక మహిళ.. సడెగా వచ్చి ఆయనకు ముద్దు పెట్టేసిందట. ఆ రోజుల్లో శోభన్ బాబు ఫాలోయింగ్ ఆ రేంజ్ లో ఉండేది. అంతే కాదు శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్ గా కూడా ఉండేవారు. శోభన్ బాబు ఎక్కువగా ఖర్చు పెట్టరు. దాంతో ఆయనకు పిసినారి అన్న పేరు కూడా ఉండేది.
శోభన్ బాబు ఆర్ధిక క్రమశిక్షణ.
శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. షూటింగ్ లో తనపని తాను చూసుకునేవారు. ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు. తన షాట్ అయిపోయిన తరువాత నెక్ట్స్ షూట్ గ్యాప్ లో ఓ పక్కకు కూర్చుని బుక్స్ చదువుకునేవారు. ఎవరైనా డబ్బు అడిగితే ఇచ్చేవారు కాదు, తనకు రావలసిన డబ్బును రూపాయి కూడా వదలకుండా తీసుకునేవారు. డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు శోభన్ బాబు. ఇతరుల డబ్బుపై ఆశపడే అలవాటు లేదు, తన డబ్బు ఎవరికీ ఇచ్చే అలవాటు లేదు సోగ్గాడికి. దాంతో చాలామంది ఆయన ఆర్ధిక క్రమశిక్షణకు పీనాసి అన్న పేరు పెట్టారు.
క్లారిటీ ఇచ్చిన శోభన్ బాబు..
ఇండస్ట్రీలో అందరు తనను పీనాసి అనడంపై శోభన్ బాబు ఓసందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. '' అందరు నన్ను పిసినారి అంటున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఓ మాట అంటుండేవారు. నా అభిమానులందరికి తలా ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తే.. ఆతరువాత ఆ రూపాయి నేను అందరిని అడుక్కోవలసి వస్తుంది.. అని అనేవారు. అందుకే నేను అపాత్రదానం చేయను. అర్ధం లేని చోట ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసం. అవసరం ఉన్న చోట మాత్రమే నేను ఖర్చు చేస్తాను. అది నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు. నన్ను నమ్ముకున్న 60 కుటుంబాలను దృష్టిలో పెట్టుకునినేను జాగ్రత్తగా ఉంటాను. ఆ 60 కుటుంబాలకు నేను ఎంత చేశాను, ఏం చేశాను, ఎంత మంది నావల్ల చదవుకుంటున్నారు, మంచి పోజిషన్ లో ఉన్నారు అనేది నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దానం చేసి చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎన్ని అన్నా.. నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు'' అని శోభన్ బాబు అన్నారు.
శోభన్ బాబు 10000 కోట్ల ఆస్తులు..?
శోభన్ బాబు డబ్బును వృధా చేసేవారు కాదు. ఆయన సంపాధించిన సొమ్మ అంతా బిజినెస్ లో పెట్టారు. ప్రతీ పైసా ఆయన భూమిపై పెట్టారు. చెన్నైలో సగం భూములు ఆయనవే. దాదాపు 10 వేల కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారట శోభన్ బాబు. ఆయన హీరోగా ఎంత స్టార్ డమ్ చూసినా.. తన ఫ్యామిలీని మాత్రం ఇండస్ట్రీలోకి రానివ్వలేదు అందాల నటుడు. తన దగ్గర పనిచేసేవారిని చాలా బాగా చూసుకునేవారు శోభన్ బాబు. పనివారి కుటుంబాలక కావల్సిన ఆర్ధిక అవసరాలు శోభన్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. వారి పిల్లలను కూడా ఆయన చదివించేవారు. శోభన్ బాబు గుప్తదానాల గురించి మరో హీరో కృష్ణం రాజు ఓ సందర్భంలో గొప్పగా చెప్పారు.
రామారావును మించి శోభన్ బాబు డిమాండ్
1976 లో శోభన్ బాబు హీరోగా మంచి ఫామ్ లోకి వచ్చారు. వరుస సినిమాలు చేస్తున్న టైమ్ లో ఆయనకు డిమాండ్ పెరిగింది. దాంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచారు అందాల నటుడు. ఇక పొగరుబోతు సినిమా కోసం నిర్మాత శోభన్ బాబును సంప్రదిస్తే.. లక్ష యాబై వేలు రెమ్యునరేషన్ అడిగారట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటికీ రామారావు లాంటి స్టార్ హీరో లక్ష రూపాయలకు మించి తీసుకోవాడం లేదు. అదే విషయాన్ని నిర్మాతలు శోభన్ బాబుతో చెపితే.. లేదు ఆయన టైమ్ అయిపోయింది.. నాకు వరుస హిట్లు ఉన్నాయి.. నా రెమ్యునరేషన్ ఇంతే అని తేల్చేశారట. రెమ్యునరేషన్ విషయంలో శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు అని నిర్మాత ప్రసాద్ ఒక సందర్భంలో అన్నారు. పొగరుబోతు సినిమా శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా తెరకెక్కింది. 1976 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి.. యావరేజ్ గా నిలిచింది.

