- Home
- Entertainment
- Bigg Boss వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Bigg Boss వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu : బిగ్ బాస్ షోలో పాల్గొంటం వల్ల లాభమా..? నష్టమా? ఈ షో వల్ల ఎంత మంది పాపులారిటీ పెంచుకున్నారో తెలియదు కానీ.. ఓ నటి మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లి చాలా నష్టపోయాను అంటోంది.

బిగ్ బాస్ వల్ల లాభమా నష్టమా..?
బిగ్ బాస్ రియాల్టీషో వల్ల సెలబ్రెటీ కంటెస్టెంట్స్ కు లాభమా.. ? నష్టమా... ? బిగ్ బాస్ వల్ల ఎంత మందికి అవకాశాలు పెరిగాయి? ఎంత మంది ఇండస్ట్రీలో నిలబడ్డారు. టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత అసలు ఫీల్డ్ లో కనిపించకుండా పోయారు. అవకాశాలు తగ్గినవారు కూడా ఉన్నారు. కొంత మంది మాత్రం ఇండస్ట్రీలో కొనసాగుతూ... వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని .. పాపులారిటీని పెంచుకుంటూ వచ్చారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత చాలా మంది కంటెస్టెంట్స్ ఈ షోపై నెగెటీవ్ కామెంట్స్ చేయడం తెలిసిందే. తాజాగా మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరామె. ఏంటా కామెంట్స్.?
బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ప్రయత్నాలు
బిగ్ బాస్ లోకి వెళ్లడానికి చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సెలబ్రెటీలు కూడా కొంత మంది ఆసక్తిగా అవకాశాల కోసం ఎదురు చూస్తుతంటారు. అయితే కొంతమంది మాత్రం బిగ్ బాస్‌పై నెగెటీవ్ కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వారిలో నటి కరాటే కళ్యాణి ఒకరు. ఎన్నో సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి, బిగ్ బాస్‌లో కూడా పాల్గొన్నారు. అయితే అక్కడ ఆమె ఎక్కువకాలం ఉండలేకపోయారు. చాలా త్వరగా ఎలిమినేట్ అయ్యి భయటకు వచ్చారు.
బిగ్ బాస్ వల్ల చాలా నష్టపోయా..
ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు కరాటే కళ్యాణి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన బిగ్ బాస్ అనుభవాల గురించి మాట్లాడిన కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది.కళ్యాణి మాట్లాడుతూ, “నేను బిగ్ బాస్‌లోకి వెళ్లడం వల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ. అక్కడ నాకు వచ్చిన గుర్తింపుకంటే రెండింతలు నష్టపోయాను. ఆ షో అగ్రిమెంట్ కారణంగా నాకు రావాల్సిన అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు లేవు, అవకాశాలు లేవు. దానికి ప్రధాన కారణం నేను బిగ్ బాస్‌లో పాల్గొనడమే” అని అన్నారు.
ఆ విషయంలో చాలా బాధపడ్డాను
“బిగ్ బాస్‌లోకి వస్తే సినిమాలో అవకాశాలు ఇస్తామని అన్నారు. కానీ బయటకు వచ్చాక ఎవరు పట్టించుకోలేదు. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. బిగ్ బాస్ వల్ల అసలు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. అని కళ్యాణి కామెంట్ చేశారు''. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చివరి దశలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
ప్రస్తుతం బిగ్ బస్ తెలుగు సీజన్ 9 సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ షోలో ఎండ్ స్టేజ్ లో ఉంది. చివరి వారం చాలా ఉత్కంఠకరపోరు నడుస్తోంది. విన్నర్ ఎవరు అన్న విషయంలో ఇప్పటికే రకరకాల వెర్షన్లు బయటకు వచ్చాయి. కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠకర పోరులో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ , పవన్, సంజన టాప్ 5 లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

