డిసెంబర్ 5 నుంచి లాక్‌డౌన్ కన్ఫర్మ్... కానీ అంతకుముందు ఒక సర్‌ప్రైజ్ ఏంటంటే?
డిసెంబర్ 5 నుంచి లాక్‌డౌన్ అనే ప్రకటన ఇటీవల విడుదల కాగా, ఇప్పుడు దానికి సంబంధించిన మరో అద్భుతమైన అప్‌డేట్ విడుదలై వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ లాక్ డౌన్ రచ్చ ఏంటి?

లాక్‌డౌన్ కు అంతర్జాతీయ గుర్తింపు
కరోనా సమయంలో లాక్‌డౌన్ అనే పదం బాగా ప్రాచుర్యం పొందింది. కానీ గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్ గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి. దానికి ప్రధాన కారణం ఒక సినిమా. లాక్‌డౌన్ పేరుతోనే తమిళంలో ఒక అద్భుతమైన థ్రిల్లర్ సినిమా రూపొందింది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీమ్, ఇప్పుడు ఈ సినిమాకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు గురించి ఒక ప్రకటన విడుదల చేసింది.
గోవాలో లాక్‌డౌన్ ప్రదర్శన
లాక్‌డౌన్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే, గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబోతున్నారు. గాలా ప్రీమియర్ విభాగంలో ఈ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గోవాలో నవంబర్ 20న ఘనంగా ప్రారంభమైంది. ఇందులో మొదటి చిత్రంగా శివకార్తికేయన్ నటించిన అమరన్ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు శివకార్తికేయన్, సాయి పల్లవి, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, అమరన్ నిర్మాత కమల్ హాసన్ హాజరయ్యారు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా
అమరన్ తర్వాత మరో తమిళ చిత్రం లాక్‌డౌన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికవడంతో, చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ లాక్‌డౌన్ సినిమాకు ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహించారు. ఎన్.ఆర్.రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించగా, కె.ఎ.శక్తివేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి సాబు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
డిసెంబర్ 5న రిలీజ్ కు లాక్‌డౌన్ మూవీ
లాక్‌డౌన్ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు ఈ ఏడాది ఈ సినిమా చాలా స్పెషల్ గా మారింది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్శించింది సినిమా. దానికి ప్రధాన కారణం ఆమె హిట్ సినిమాలు. 2025లో తమిళంలో అనుపమ పరమేశ్వరన్ డ్రాగన్, బైసన్ అనే రెండు చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక డిసెంబర్ 5న విడుదల కానున్న లాక్‌డౌన్ సినిమా కూడా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

