- Home
- Entertainment
- Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో
Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో
Varun Sandesh: వరుణ్ సందేశ్, వితికా షేరు ఇద్దరూ చక్కటి జంట. పెళ్లయి పదేళ్లు అవుతున్న ఇంకా పిల్లలు లేరు. వరుణ్ సందేశ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఏడాది కచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు.

పిల్లలు ఎందుకు లేరో చెప్పేసిన వరుణ్
హ్యాపీ డేస్ సినిమాతో వరుణ్ సందేశ్ ఎంతోమందికి ఇష్టమైన హీరో అయిపోయారు. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అమెరికాలో పుట్టి పెరిగిన వరుణ్ సందేశ్ సినిమాల కోసమే హైదరాబాదులో వచ్చి సెటిల్ అయ్యారు. ‘పడ్డానండి ప్రేమలో మరి’ అనే సినిమాను వితికా షేరుతో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి వివాహమై 9 ఏళ్ళు అవుతున్నా... పిల్లలు లేకపోవడంతో వీరికి ఎక్కువగా అదే ప్రశ్న ఎదురవుతోంది. దీనిపై వరుణ్ సందేశ్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
వరుణ్ వితిక లవ్ స్టోరీ
ముందుగా తమ లవ్ స్టోరీ అని చెప్పారు వరుణ్ సందేశ్. పడ్డానండి ప్రేమలో మరి సినిమా చేస్తున్నప్పుడు వితికతో పెద్దగా పరిచయం లేదని చెప్పారు. ఒక సీన్లో వితికను ఎత్తుకొని పరిగెడుతూ పట్టు తప్పి కింద పడిపోయానని అప్పుడు ఇద్దరికీ దెబ్బలు తగిలాయని చెప్పారు. వతికకు అప్పటికే నడుమునొప్పి సమస్య ఉండడంతో తాను చాలా బాధపడ్డానని, ఆమెతో మాట్లాడేందుకు డైరెక్టర్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినట్టు చెప్పారు. అలా ఇద్దరి మాటలు కలిసాయని, ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకోవడం మొదలు పెట్టామని వివరించారు. తర్వాత తన ఫ్యామిలీ లేనప్పుడు తన తలకి ఒకసారి దెబ్బ తగిలిందని చెప్పుకొచ్చారు వరుణ్ సందేశ్. ఆ సమయంలో వితిక చాలా జాగ్రత్తగా చూసుకుందని, ఆమె ప్రవర్తన తనకు చాలా నచ్చిందని చెప్పారు.
మిస్ క్యారేజీ అవ్వడంతో
వితికను ‘డేట్ చేద్దామా’ అని తానే మొదటిగా అడిగానని చెప్పాడు వరుణ్ సందేశ్. దానికి వితికా డేటింగ్ అవి తనకు నచ్చదని పెళ్లి చేసుకుందామంటే చెప్పు ఓకే అంటానని సమాధానం ఇచ్చిందని అన్నారు. దానితో తాను కూడా పెళ్లికి ఓకే చెప్పేసానని అన్నారు వరుణ్. పెద్దల అంగీకారంతో తమ పెళ్లి అయినట్టు చెప్పారు. అయితే ఏడేళ్ల క్రితం అనుకోకుండా వితికకు ఒక మిస్ క్యారేజీ అయ్యిందని దాంతో ఆమె చాలా బాధపడిందని, దాని నుంచి తేరుకోవడానికి ఎక్కువ సమయమే పట్టిందని చెప్పారు. ఆ తర్వాత యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ మొదలుపెట్టి వితిక చాలా బిజీ అయిపోయినట్టు వివరించారు. యూట్యూబ్లో సక్సెస్ అవడంతో కేవలం తన డబ్బులతోనే ఒక ఇల్లు కొనాలనే ప్లాన్ చేసుకుందని, ఆ ప్లాన్ మొన్నే పూర్తయిందని వివరించారు. పూర్తిగా వితిక సంపాదించిన డబ్బులతోనే తాను ఒక ఇంటిని కట్టామని చెప్పారు. తమకు అంతకుముందే సొంత ఇల్లు ఉన్నా... వితికకు తన సొంత డబ్బుతో ఇల్లు కొనాలని ఉండేదని చెప్పారు.
వితిక కల తీరిపోయంది
వితికకు ఉన్న కోరిక తీరిపోయిందని ఇక మిగిలింది పిల్లలేనని చెప్పుకొచ్చారు వరుణ్ సందేశ్. కచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామని, పిల్లల కోసం ప్లానింగ్ చేస్తామని అన్నారు. పెళ్లయి తొమ్మిదేళ్లు దాటడంతో ఎంతోమంది పిల్లలు ఎప్పుడు అని అడిగి అడిగి విసిగిపోయారని చివరకు అడగడమే మానేసారని ఫన్నీగా చెప్పారు వరుణ్. వితికకు ఉన్న కల తీరిపోయింది కాబట్టి ఇక పిల్లల ప్లానింగ్ చేసుకుంటామని క్లారిటీ ఇచ్చేశాడు వరుణ్.

