- Home
- Entertainment
- Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు
Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గత పాతికేళ్లలో ఎన్ని చిత్రాల్లో నటించారు ? వాటిలో విజయాలు ఎన్ని, అతి పెద్ద విజయం ఏది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అఖండ 2 తో బాలయ్య
రెడీ డిసెంబర్ 5న రిలీజ్ కావలసిన బాలకృష్ణ అఖండ 2 చిత్రం వాయిదా పడింది. నిర్మాతలు ఆర్థిక సమస్యలు, వివాదాలని అధికమించి డిసెంబర్ 12న గ్రాండ్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 11న అంటే మరికొన్ని గంటల్లోనే అఖండ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అఖండ 2 ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. దీనితో బాలకృష్ణ గత చిత్రాలకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. గత 25 ఏళ్లలో బాలకృష్ణ నటించిన సినిమాలు ఎన్ని ? సాధించిన విజయాలు ఎన్ని ? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
21వ శతాబ్దాన్ని ఘనంగా ప్రారంభించిన బాలయ్య
2001 ఏడాది బాలయ్యకి మెమొరబుల్ ఇయర్. ఆ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ నరసింహ నాయుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నరసింహ నాయుడు చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి పోటీగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలు వచ్చినప్పటికీ బాలయ్య విజయం సాధించారు.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ బాలయ్య
నరసింహ నాయుడు తర్వాత బాలకృష్ణకి కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. ఫ్యాక్షన్ సినిమాలు తనకి బాగా వర్కౌట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో బాలయ్య వరుసగా అవే సినిమాలు చేశారు. దీనితో అభిమానుల కి బోర్ కొట్టేసింది. సీమ సింహం, పలనాటి బ్రహ్మనాయుడు లాంటి చిత్రాలు ట్రోలింగ్ కి గురయ్యాయి. మధ్యలో లక్ష్మీ నరసింహ మాత్రమే హిట్ అయింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు బాలయ్యకి హిట్ లేదు. ఎట్టకేలకు బోయపాటి దర్శకత్వంలో నటించిన సింహా చిత్రంతో బాలయ్య హిట్ కొట్టారు.
హిస్టారికల్ హిట్
బోయపాటి దర్శకత్వంలో నటించిన ప్రతిసారీ బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నారు. సింహా తర్వాత బాలయ్యకి మరో హిట్ లెజెండ్ తో దక్కింది. ఆ తర్వాత తన 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణితో బాలయ్య హిస్టారికల్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. జైసింహా అనే చిత్రంతో బాలకృష్ణకి మరో కమర్షియల్ హిట్ దక్కింది.
అఖండ నుంచి దుసుకుపోతున్న బాలయ్య
బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇది. ఆ తర్వాత వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో బాలయ్య వరుస సూపర్ హిట్స్ అందుకున్నారు. ఓవరాల్ గా బాలయ్య గత 25 ఏళ్లలో 32 సినిమాల్లో నటించి 10 హిట్లు అందుకున్నారు. వీటిలో బాక్సాఫీస్ లెక్కలు పక్కన పెట్టి బిగ్గెస్ట్ హిట్ గా పరిగణించాల్సి వస్తే అది నరసింహ నాయుడు చిత్రమే. ఎందుకంటే అది ఇండస్ట్రీ హిట్.

