- Home
- Entertainment
- మంగపతిగా దుమ్మురేపిన శివాజీ ఇప్పుడు `దండోరా` వేస్తున్నాడు, ఆయన పాత్ర ఎలా ఉండబోతుందంటే?
మంగపతిగా దుమ్మురేపిన శివాజీ ఇప్పుడు `దండోరా` వేస్తున్నాడు, ఆయన పాత్ర ఎలా ఉండబోతుందంటే?
Sivaji: హీరో శివాజీ ఒకప్పుడు కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. కామెడీ హీరోగా ఎదిగాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. పాజిటివ్ రోల్స్, నెగటివ్ రోల్స్ ఇలా పాత్ర ఏదైనా రక్తికట్టిస్తూ అలరించారు. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే, హీరోగా బిజీగా ఉన్న టైమ్‌లోనే ఆయన మూవీస్ నుంచి తప్పుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ అక్కడ సక్సెస్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ షోలో మెరిశారు. అదరగొట్టారు. నెమ్మదిగా సినిమాల స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల `కోర్ట్` మూవీలో మంగపతిగా దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు `దండోరా` వేయబోతున్నారు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం.

sivaji
Sivaji: ఒకప్పుడు కామెడీ చిత్రాల హీరోగా ఆకట్టుకున్న శివాజీ ఇప్పుడు తనలోని 2.0 చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే `కోర్ట్` మూవీతో విశ్వరూపం చూపించాడు. తనకు బలమైన పాత్రలు పడితే ఎలా రెచ్చిపోతాడో చూపించాడు. `కోర్ట్` మూవీలో తనది కీలక పాత్ర అయినా, సినిమా విడుదలయ్యాక శివాజీనే అసలు హీరో అయిపోయారు. ఆయనకే ఎక్కువ పేరు వచ్చింది.
sivaji
సెకండ్ ఇన్సింగ్స్ లో సెలక్టీవ్‌గా వెళ్తున్న శివాజీ ఇప్పటికే `నైంటీస్‌ః మిడిల్ క్లాస్ బయోపిక్`, `కోర్ట్` సినిమాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా రెండు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో మూవీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. `దండోరా` చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టారు.
sivaji
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఇప్పుడు `దండోరా` అనే సినిమాని నిర్మిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించారు. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్‌లో విలక్షణ నటుడు శివాజీ పాల్గొంటున్నారు. ఇందులో ఆయనది బలమైన పాత్ర అని టీమ్ తెలిపింది.
sivaji
`దండోరా` సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ బీట్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని `దండోరా` సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు.
ఇందులో శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో వెల్లడించనున్నట్టు టీమ్ తెలిపింది.
read more: పెళ్లైయ్యాక కూడా శ్రీదేవి, హేమా మాలిని, జయప్రదలతో ఎఫైర్ నడిపించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
also read: ఎన్టీఆర్‌ని కోరిక తీర్చమని అడిగా, అలా ఎలా చేశానో అర్థం కాలేదు.. జయమాలిని షాకింగ్ కామెంట్