- Home
- Entertainment
- పెళ్లైయ్యాక కూడా శ్రీదేవి, హేమా మాలిని, జయప్రదలతో ఎఫైర్ నడిపించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పెళ్లైయ్యాక కూడా శ్రీదేవి, హేమా మాలిని, జయప్రదలతో ఎఫైర్ నడిపించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Jeetendra: బాలీవుడ్ నటుడు జితేంద్ర ఇండియన్ సినిమాని ప్రభావితం చేసి హీరోల్లో ఒకరు. బాలీవుడ్‌ని శాషించిన నటుల్లో ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ చిత్రాలతో బాలీవుడ్ ని విజయపథాన నడిపించారు. కంటెంట్ చిత్రాలతోపాటు కమర్షియల్ మూవీస్ చేసి మెప్పించారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న జితేంద్ర నేడు సోమవారం తన 83వ పుట్టిన రోజుని జరుపుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మ్యారేజ్ లైఫ్, లవ్ ఎఫైర్స్ గురించి తెలుసుకుందాం. పెళ్లి అయిన తర్వాత ఆయన ఎవరెవరితో ఎఫైర్లు నడిపించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.

Jeetendra
Jeetendra జంపింగ్ జాక్ గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు జీతేంద్రకు 83 ఏళ్లు నిండాయి. 1942 ఏప్రిల్ 7న అమృత్‌సర్‌లో జన్మించిన జీతేంద్ర 1974లో శోభను వివాహం చేసుకున్నాడు. కానీ 14 సంవత్సరాల వయసులో జీతేంద్ర మొదటిసారి చూసిన అమ్మాయి శోభ అని మీకు తెలుసా. ఆమెని వివాహం చేసుకున్నాక జీతేంద్ర అసలు ఎఫైర్లు నడిపించారు. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో రిలేషన్‌లో ఉన్నారట.
Jeetendra
జితేంద్ర అసలు పేరు రవి కపూర్. అతనికి 14 సంవత్సరాల వయసులో శోభను మొదటిసారి మెరైన్ డ్రైవ్‌లో చూసి ఆమెను ప్రేమించడం ప్రారంభించాడు. అయితే, శోభ కాలేజీలో ఉన్నప్పుడు జీతేంద్ర బాలీవుడ్ స్టార్ గా రాణిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ వికసించింది.
శోభ ఎయిర్ హోస్టెస్ అయ్యి బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సమయంలో, ఆమె భారతదేశానికి వచ్చినప్పుడల్లా, జీతేంద్ర ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినేది. కానీ ఏదో మాయ మాటలు చెప్పి శోభని ఒప్పించాడు జీతేంద్ర. ఆమెను లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్తాడు.
Jeetendra
జితేంద్ర ఇతర హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిస్తున్నాడనే వార్తలు వినిపించినప్పటికీ ఆయన శోభను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారి వివాహానికి 1973 ఏప్రిల్ 13 తేదీని ఖరారు చేశారు.
కానీ ఈ సమయంలో జీతేంద్ర తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు, అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. దీంతో పెళ్లికి రెండు గంటల ముందే ఆగిపోయింది. శోభ పెళ్లి చేసుకోవడానికి అప్పటికే తన ఉద్యోగాన్ని వదిలేసింది. అటువంటి పరిస్థితిలో సంబంధం తెగిపోయినప్పుడు, ఆమెతో రిలేషన్ కూడా బ్రేక్ అయినట్టే.
Jeetendra
జీతేంద్ర కెరీర్ దిగజారిన తర్వాత జీతేంద్ర, శోభల రిలేషన్‌లో సమస్యలు మరింత పెరిగాయి. అతని సినిమాలు వరుసగా పరాజయం పాలవడం ప్రారంభించాయి. ఆ తర్వాత 1974లో జీతేంద్ర చిత్రం 'బిదాయి' రిలీజ్ డేట్ వచ్చింది.
ఈ సినిమా విడుదలకు ముందు, ఈ మూవీ హిట్ అయితే తాను పెళ్లి చేసుకుంటానని శోభకు మాట ఇచ్చాడు జీతేంద్ర. 1974 అక్టోబర్ 9న విడుదలైన 'బిదాయి' సూపర్ హిట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం 1974 అక్టోబర్ 31న శోభను వివాహం చేసుకున్నాడు.
Jeetendra
1974 అక్టోబర్ 31న, శోభతో తన వివాహం గురించి జీతేంద్ర తన తల్లిదండ్రులకు చెప్పాడట. అయితే వాళ్లు కొన్నాళ్లు వెయిట్ చేయమని చెప్పారట. కానీ జీతేంద్ర తన మ్యారేజ్‌ని వాయిదా వేయడానికి ఒప్పుకోలేదు.
ఎట్టకేలకు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సమయంలో శోభ తల్లి జపాన్‌లో ఉండటం వల్ల ఈ వివాహానికి హాజరు కాలేకపోయింది. జీతేంద్ర, శోభ దంపతులకు ఏక్తా కపూర్, తుషార్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.
Jeetendra
హేమ మాలిని, జీతేంద్ర ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. అదే సమయంలో, అతను మరొకరితో ప్రేమలో కూడా ఉన్నాడు. హేమ మాలిని ధర్మేంద్రతో ప్రేమ వ్యవహారం నడుపుతుండగా, జీతేంద్ర శోభతో డేటింగ్ చేస్తున్నాడు. కానీ ధర్మేంద్ర హేమ మాలినికి కట్టుబడి ఉండకపోయినా, జీతేంద్ర, శోభ మధ్య సంబంధం కూడా ఒడిదుడుకుల మధ్య సాగుతోంది.
జీవితంలోని ఈ గందరగోళంతో బాధపడుతూ, జీతేంద్ర హేమ మాలినిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారిద్దరూ వివాహ వేదిక వద్ద ఉన్నప్పుడు, తాగిన మత్తులో ఉన్న ధర్మేంద్ర అక్కడికి చేరుకుని గొడవ సృష్టించాడు. ఈ విధంగా, జీతేంద్ర, హేమల వివాహం వాయిదా పడింది.
Jeetendra
జీతేంద్ర ఒకప్పుడు సౌత్‌లోనూ సినిమాలు చేశారు. ఆ టైమ్‌లో ఆయన శ్రీదేవిని కలిశాడు. బాలీవుడ్‌లో ఆఫర్ల కోసం శ్రీదేవిని ముంబైకి తీసుకువచ్చాడు. ఇద్దరూ అనేక చిత్రాలలో కలిసి నటించారు. దీంతో రూమర్లు స్టార్ట్ అయ్యాయి.
ఆ సమయానికి జితేంద్రకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీదేవితో రిలేషన్ ముగించకపోతే, తాను ఇల్లు వదిలి వెళ్లిపోతానని భార్య శోభ జీతేంద్రకు అల్టిమేటం ఇచ్చింది. చివరికి జీతేంద్ర శ్రీదేవితో తన స్నేహాన్ని తెంచుకుని పెళ్లి బంధాన్ని కాపాడుకున్నాడు.
Jeetendra
జీతేంద్ర జయప్రదతో చాలా సినిమాలకు పనిచేశాడు. శ్రీదేవి లాగే జయప్రద కూడా దక్షిణాది నుంచి వచ్చింది. జీతేంద్రనే ఆమెను బాలీవుడ్‌లో ప్రమోట్ చేశాడు. జీతేంద్ర జయప్రదను బాలీవుడ్ కు తీసుకువచ్చి, శ్రీదేవినే కాదు తాను ఎవరినైనా స్టార్ ను చేయగలనని చెప్పాడని తెలిసింది.
కొన్ని నివేదికల ప్రకారం జయప్రద జీతేంద్రను పిచ్చిగా ప్రేమించిందని, కానీ ఆమె విషయంలో జీతేంద్రనే సీరియస్‌గా తీసుకోలేదని, దీంతో వీరి బంధం బ్రేకప్ కి దారితీసిందని సమాచారం. ఇలా పెళ్లయ్యాక కూడా జీతేంద్ర ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్ నడిపించడం విశేషం.
read more: అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ని షాకిచ్చిన రామ్ చరణ్.. `పెద్ది` ఫస్ట్ షాట్ సరికొత్త రికార్డు
also read: `బిగ్ బాస్ తెలుగు 8` విన్నర్ నిఖిల్ ఆస్తులు ఎంతో తెలుసా? కోటీశ్వరుడిని చేసిన ఒకే ఒక్క షో