- Home
- Entertainment
- Siri, Srihan Business :ప్రియుడు శ్రీహాన్ తో కలిసి కొత్త బిజినెస్ పెట్టబోతున్న సిరి హనుమంత్
Siri, Srihan Business :ప్రియుడు శ్రీహాన్ తో కలిసి కొత్త బిజినెస్ పెట్టబోతున్న సిరి హనుమంత్
Siri Hanumanth New Business with Srihan : ప్రియుడు శ్రీహాన్ తో కలిసి కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది సోషల్ మీడియా సెలబ్రిటీ సిరి హనుమంత్. ఇంతకీ ఆమె చేయబోయే బిజినెస్ ఏంటో తెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Siri Hanumanth New Business with Srihan : సోషల్ మీడియాల వల్ల సెలబ్రిటీలుగా మారినవారు చాలామంది ఉన్నారు. ఇలా స్టార్స్ గా మారి.. సినిమాల్లో, సిరీస్ లలో, సినిమాల్లో అవకాశాలు సాధించినవారు కూడా చాలామంది ఉన్నవారు. అలాంటివారిలో సిరి హనుమంత్ కూడా ఒకరు. అంతే కాదు తానలాగే సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన శ్రీహాన్ ను ఆమె ప్రేమించింది. అతనితో కలిసి లివింగ్ రిలేషన్ లో కూడా ఉంది.
Also Read: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు గుర్తుపట్టకుండా మారిపోయిన స్టార్స్ ఎవరు..?
srihan, siri
అంతే కాదు ఈఇద్దరు స్టార్లు చెరో సీజన్ లో బిగ్ బాస్ తెలుగు లోకి వెళ్ళి సందడి చేశారు. ఎవరికి వారు తాము స్పెషల్ అనిపించుకున్నారు. అలా ఇద్దరు చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత వీరి పాపులారిటీ ఇంకాస్త పెరిగింది. ఇద్దరికి అవకాశాలు కూడా పెరిగిపోయాయి. చాలా సిరీస్ లలో వీళ్ళు నటించిమెప్పించారు. ఇక సిరి హనుమంత్ అయితే షారుఖ్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ మూవీ కూడా చేసింది.
Also Read: రజినీకాంత్ సల్మాన్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇలా ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్స్.. పెళ్ళి మాత్రం చేసుకోలేదు. త్వరలో వీళ్ళ పెళ్ళి జరుగుతుంది అని వార్తలు వస్తున్న టైమ్ లో.. వీరు ఆర్ధికంగా సెటిల్ అయిన తరువాత పెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇద్దరు కలిసి ఓ కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేశారట. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో తెలుసా.. బ్యూటీ క్లీనిక్. అవును వీరిద్దరు బ్యూటీ క్లీనిక్ ఓపెన్ చేశారు.
Also Read:ఎన్టీఆర్,పవన్, వెంకటేష్, బాలయ్య అయిపోయారు రామ్ చరణ్ మొదలెట్టాడు, RC16 కోసం చరణ్ ప్రయోగం.
అది కూడా హైదరాబాద్ లో కాదు.. వైజాగ్ లో. వీరి సొంత ప్రాంతం అయిన వైజాగ్ లో కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేశారు జంట. దీనికి సబంధించిన ప్రతీ అప్ డేట్ ను వారు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనే పేరుతో ఈ బిజినెస్ స్థాపిస్తున్నారు. ఫిబ్రవరి 2న వైజాగ్ లో గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు. ఈ ఓపెనింగ్ కి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి రెగ్యులర్ గా తన మేకప్ క్లినిక్ గురించి అప్డేట్స్ ఇస్తుంది సిరి హన్మంత్.
అంతే కాదు తన క్లీనిక్ లో మేకప్ ఈవెంట్ మాత్రమే కాకుండా...బ్యూటీ క్లీనిక్ కు కూడా పెట్టిందట. స్కిన్, హెయిర్ కు కి సంబంధించిన పలు ట్రీట్మెంట్స్ కూడా ఆహె స్టార్ట్ చేస్తోంది. మంచి డాక్టర్స్ తో పాటు.. ఈ క్లినిక్ ద్వారా చామందికి జాబ్స్ కూడా ఇస్తున్నా అంటోంది. ప్రస్తుతం విశాఖపట్నంలోనే స్టార్ట్ చేస్తున్న ఈ క్లీనిక్ ను.. త్వరలో విజయవాడలో కూడా ఓపెన్ చేయాలని ట్రై చేస్తోంది.
బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులను ఈ ఇద్దరు స్టార్స్ ఇలా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి.. ఆర్ధికంగా నిలబడ్డ తరువాత పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారట. ఓ పక్క సినిమాలు, సిరీస్ లు, యూట్యూబ్ తో బిజీగానే ఉంటూ మరో పక్క బిజినెస్ కూడా మొదలుపెట్టి దూసుకుపోతుంది సిరి.