- Home
- Entertainment
- Rajinikanth, Salman combo: రజినీకాంత్ సల్మాన్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా?
Rajinikanth, Salman combo: రజినీకాంత్ సల్మాన్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా?
Rajinikanth and Salman Khan Mega Budget Multi Starrer: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తెరెక్కబోతోందట. ఇంతకీ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో తెలుసా..?

Atlee movie with Rajinikanth and Salman Khan:ఈమధ్య సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బాలీవుడ్ కు అనుబంధం మరింతగా పెరిగిపోయింది. సౌత్ సినిమాలన్నా, సౌత్ డైరెక్టర్లు అన్నా బాలీవుడ్ స్టార్స్ కుమేకర్స్ కు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. దాంతో మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అంతే కాదు మన సినిమాల్లో నటించడానికి కూడా వారు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇక బాలీవుడ్ సౌత్ కాంబినేషన్ లో బోలెడ్ మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఈక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ - సల్మాన్ ఖాన్ కాంబోలో సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది ఇంతకీ ఈసినిమాకు దర్శకుడు ఎవరంటే..?
Atlee Kumar
ఇప్పటికేచాలామంది స్టార్లు మల్టీ స్టారర్ సినిమాలు చేశారు.అందులోనే సౌత్ యాక్టర్లు ,డైరెక్టర్లతో కలిసి పనిచేయడానికి బాలీవుడ్ స్టార్స్ఎదరు చూస్తున్నారు.అందులో సందీప్ రెడ్డి వంగా, అట్లీ లాంటి దర్శకుడు బాలీవుడ్లో ఇప్పటికే తమ సత్తా చాటుకున్నారు. ఇక అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సినిమా అయితే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సంచలనంగా మారింది. దాంతో అట్లీతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Kamalhaasan and atlee
ఈక్రమంలో జవాన్ తరువాత అట్లి కూడా చాలాజాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తొందరపడి సినిమాలు అనౌన్స్ చేయడంలేదు. సో అట్లీ త్వరలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. అయితేఈసినిమా కోసం ముందు గా సల్మాన్ ఖాన్ ను అనుకున్నాడట. అట్లీ. సల్మాన్ తో కో ఆర్టిస్ట్ గా తమిళ్ నుంచి స్టార్ హీరోను తీసుకోవాలి అనేది అతనిఆలోచన. ముందుగాకమల్ హాసన్ కోసం చూశాడట. కాని అతను ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. తలైవాను ఒప్పించాడని టాక్.
అట్లీ త్వరలో షారుఖ్ తో జవాన్ 2 చేయాలని అనుకున్నాడట. కాని ఆ ప్రాజెక్ట్ కు కంటేముందు సల్మాన్ ఖాన్ తో మల్టీ స్టారర్ కంప్లీట్ చేయాలి అనేది అతని టార్గెట్. ఇందుకోసం కథ కూడా రెడీ చేసుకున్నాడట అట్లీ. భారీ బడ్జెట్ ను కూడా పోగేశాడట. సల్మాన్ ఖాన్, రజినీకాంత్ కూడా రెడీగా ఉన్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడమే తరువాయి అంటున్నారు.
సల్మాన్ ఖాన్ కొన్ని సినిమాల్లో క్యామియోలు చేశాడు. ఇక రజినీకాంత్ కూడా ఈ మధ్య మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పాన్ ఇండియా లెవల్‌లో మల్టీస్టార్ సినిమా చేస్తే ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈ న్యూస్ లో నిజం ఎంత అనేతి తెలియాలి అంటే.. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే కాని తెలియదు.