MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?

Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?

నటుడు, దర్శకుడు, నిర్మాతగా దూసుకెళ్తున్న లోకేష్ కనగరాజ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు, రెమ్యూనరేషన్, కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 14 2026, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Lokesh Kanagaraj Net worth
Image Credit : X

Lokesh Kanagaraj Net worth

కోయంబత్తూరు నుంచి కోలీవుడ్‌కు దొరికిన ఆణిముత్యం లోకేష్ కనగరాజ్. ఈయన కోయంబత్తూరు దగ్గర్లోని కినతుకడవు ప్రాంతానికి చెందినవారు. అక్కడే కాలేజీ చదువు పూర్తి చేసి, ఓ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. కమల్ హాసన్ వల్లే ఆయనకు సినిమాపై ఆసక్తి పెరిగింది. కమల్ వీరాభిమాని అయిన లోకేష్, ఆయన సినిమాలేవీ మిస్ చేసేవారు కాదట. సినిమాల్లో ఏదైనా సాధించాలనే పట్టుదలతో, బ్యాంకు ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
'మానగరం' సినిమాతో
Image Credit : Lokesh Kanagaraj/ Instagram

'మానగరం' సినిమాతో

ఆయన తీసిన ఓ షార్ట్ ఫిల్మ్‌ను కార్తీక్ సుబ్బరాజ్ చూశారు. దాన్ని తన 'అవియల్' అనే ఆంథాలజీ సినిమాలో విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో, తన దగ్గరున్న 'మానగరం' కథను నిర్మాత ఎస్.ఆర్. ప్రభుకు చెప్పి ఓకే చేయించుకున్నారు. ఆ సినిమాతో లోకేష్ అదరగొట్టారు. సినిమా రిలీజయ్యాక, 'ఎవరీ డైరెక్టర్, ఇంత అద్భుతంగా తీశాడు' అని అందరూ అనుకున్నారు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో, తన తర్వాతి సినిమాను కార్తీతో తీశారు.
36
'ఖైదీ' బ్లాక్‌బస్టర్ హిట్
Image Credit : instagram

'ఖైదీ' బ్లాక్‌బస్టర్ హిట్

పాటలు లేని సినిమాలను జనం చూడరనే ఒక అపోహ ఉండేది. దాన్ని 'ఖైదీ' సినిమా బద్దలు కొట్టింది. ఆ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టింది. 'ఖైదీ' బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో, తర్వాతి సినిమానే విజయ్‌తో 'మాస్టర్' తీశారు. పూర్తిగా కమర్షియల్ జోన్‌లో తీసిన ఈ సినిమాలోనూ లోకేష్ తన మ్యాజిక్ చూపించి, 'మాస్టర్'ను ఒక మాస్టర్‌పీస్‌గా మార్చారు. ఈ సినిమా లోకేష్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

46
'మాస్టర్' విజయం తర్వాత..
Image Credit : instagram

'మాస్టర్' విజయం తర్వాత..

'మాస్టర్' విజయం తర్వాత, లోకేష్ ఆరాధ్య దైవం కమల్ హాసన్ నుంచి పిలుపు వచ్చింది. కమల్ చెప్పిన ఒక వన్‌లైన్‌ను, పక్కా మాస్ యాక్షన్ స్క్రిప్ట్‌గా మార్చి తన అభిమాన హీరోను తెరపై సెలబ్రేట్ చేసుకున్నారు లోకేష్. ఈ సినిమాతో 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్' (LCU)ను సృష్టించి, యావత్ భారత సినీ పరిశ్రమను తనవైపు తిప్పుకున్నారు. 'విక్రమ్' పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టింది. కమల్ హాసన్‌కు కూడా ఇది అదిరిపోయే కమ్‌బ్యాక్ చిత్రంగా నిలిచింది.
56
 'డీసీ మూవీ'తో హీరోగా..
Image Credit : X

'డీసీ మూవీ'తో హీరోగా..

ఆ తర్వాత విజయ్, రజినీకాంత్‌లతో సినిమాలు తీసే అవకాశం దక్కించుకున్నారు. ఆ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపాయి. ఇలా డైరెక్టర్‌గా జెండా పాతిన లోకేష్ కనగరాజ్, ఇప్పుడు 'డీసీ మూవీ'తో హీరోగా అవతారం ఎత్తారు. ఇది కాకుండా, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. అలాగే 'ఖైదీ 2', 'విక్రమ్ 2' చిత్రాలు కూడా లోకేష్ లైనప్‌లో ఉన్నాయి.
66
 40వ పుట్టినరోజు
Image Credit : instagram

40వ పుట్టినరోజు

ఈ నేపథ్యంలో, ఆయన నేడు తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల విలువకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం ప్రకారం, ఆయన ఆస్తి విలువ సుమారు రూ.80 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఒక సినిమాకు దర్శకత్వం వహించడానికి రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా, హీరోగా నటించబోయే సినిమాకు ఆయనకు రూ.30 కోట్ల వరకు పారితోషికం అందిందట. ఈయన దగ్గర లెక్సస్, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Recommended image3
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Related Stories
Recommended image1
Ustaad Trailer: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రివ్యూ.. వాడు నీకు భయపడలేదా, ఎవడికీ భయపడలేదా ?
Recommended image2
ఎట్టకేలకు పెళ్ళికి రెడీ అవుతున్న అనుష్క శెట్టి.. వరుడు ఎవరో తెలుసా, 44 ఏళ్ళ వయసులో ఇది పెద్ద ట్విస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved