MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Dacoit 3 days Collections: ఇండస్ట్రీకి షాకిస్తోన్న అడవిశేష్‌, డెకాయిట్‌ 3 రోజుల కలెక్షన్లు.. అసలు పరీక్ష ఏంటంటే?

Dacoit 3 days Collections: ఇండస్ట్రీకి షాకిస్తోన్న అడవిశేష్‌, డెకాయిట్‌ 3 రోజుల కలెక్షన్లు.. అసలు పరీక్ష ఏంటంటే?

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన `డెకాయిట్‌` మూవీ మొదటి వారంలో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి ఊహించిన విధంగా వసూళ్లు వస్తుండటం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 13 2026, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డెకాయిట్‌ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

డెకాయిట్‌ మూవీ కలెక్షన్లు

అడవి శేష్‌ మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఆయన నటించిన `డెకాయిట్‌` మూవీ బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా ఆడియెన్స్ సినిమాని చూసేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో డీసెంట్‌ కలెక్షన్లతో ప్రారంభమైన ఈ మూవీ అదే జోరు చూపిస్తుంది. సాధారణంగా సినిమా బాగా లేకపోతే రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోతాయి. కానీ ఈ చిత్రానికి మాత్రం కలెక్షన్లు డ్రాప్‌ కాలేదు. మొదటిరోజుకి సమానంగా వస్తున్నాయి. మూడు రోజులు అదే స్థాయిలో కలెక్షన్లని రాబట్టడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డెకాయిట్‌ ఇండస్ట్రీ నుంచి పాజిటివ్‌ టాక్‌
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్‌ ఇండస్ట్రీ నుంచి పాజిటివ్‌ టాక్‌

అడవి శేష్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా `డెకాయిట్‌` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. శానిల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీని సుప్రియా, సునీల్‌ నారంగ్‌ నిర్మించారు. ఈ సినిమాతో మొదటిసారి సోలో నిర్మాతగా మారింది సుప్రియ. ఆమె సొంతంగా ఎస్ఎస్‌ ప్రొడక్షన్‌ ని కూడా స్టార్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఇందులో అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్‌ సపోర్ట్ వచ్చింది. అది వసూళ్లలోనూ కనిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు రావడం విశేషం.

34
డెకాయిట్‌ మూడు రోజుల కలెక్షన్లు
Image Credit : X/@AnnapurnaStdios

డెకాయిట్‌ మూడు రోజుల కలెక్షన్లు

`డెకాయిట్‌` మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఇది మొదటి వీకెండ్‌లో రూ.40కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. నార్త్ అమెరికాలోనే దీనికి 9లక్షల డాలర్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ రూ.8కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలో రూ.28కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11.65కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రముఖ సాక్నిల్క్ వెబ్‌ సైట్‌ ప్రకారం ఇది ఇండియాలో రూ.19.86కోట్ల నెట్‌ వసూళ్లని రాబట్టినట్టు సమాచారం. ఆల్మోస్ట్ ఈ సైట్‌ కలెక్షన్లు, సినిమా టీమ్‌ ప్రకటించిన వసూళ్లు దగ్గరగా ఉన్నాయి. అంతే మూవీ నిజంగానే మంచి కలెక్షన్లని రాబడుతుందని చెప్పొచ్చు. అయితే మూడు రోజుల్లో సత్తా చాటిన ఈ మూవీకి అసలు పరీక్ష సోమవారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. హిట్టా, ఫట్టా అనేది తేలనుంది.

44
డెకాయిట్‌ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే
Image Credit : Asianet News

డెకాయిట్‌ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే

`డెకాయిట్‌` మూవీకి మొత్తంగా రూ.62కోట్ల బడ్జెట్‌ అయినట్టు సమాచారం. ఇక దీనికి థియేట్రికల్‌గా రూ.32కోట్ల వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో రూ.19కోట్లకు సేల్‌ కాగా, మిగిలిన ఇండియాలో రూ.5కోట్లు, ఓవర్సీస్‌లో ఆరు కోట్లకు అమ్ముడు పోయింది. అయితే ఓవర్సీస్‌లో ఈ మూవీ ఈ ఈవెండ్‌తోనే బ్రేక్‌ ఈవెన్‌ అయినట్టు సమాచారం. ఇక ఓవరాల్‌గా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.33కోట్ల షేర్‌ రావాలి. రూ.65కోట్ల గ్రాస్‌ రావాల్సి ఉంది. ఇంకా రూ.25 కోట్ల గ్రాస్‌ వస్తే సినిమా థియేట్రికల్‌గా సేఫ్‌ అవుతుందని చెప్పొచ్చు. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పటికే టేబుల్‌ ప్రాఫిట్‌లో ఉన్నారు. రిలీజ్‌కి ముందే బిజినెస్‌ రూపంలో వారికి డబ్బులు వచ్చాయని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Rajasekhar: హీరోయిన్ నుంచి పెళ్లి ప్రపోజల్, ఆమెని చేసుకుని ఉంటే రాజశేఖర్ లైఫ్ ఎలా ఉండేది..కూతుళ్లు ముఖం మీదే
Recommended image2
Upasana: రామ్‌ చరణ్‌ ఆమెతో కనిపించాడంటే ఇక అంతే, మొత్తం రచ్చ రచ్చ.. ఉపాసనలో జెలసీ పీక్‌ లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved