MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Tamanna Regret: ప్రభాస్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన తమన్నా.. ఎప్పుడూ బాధపడేది ఈ విషయంలోనే

Tamanna Regret: ప్రభాస్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన తమన్నా.. ఎప్పుడూ బాధపడేది ఈ విషయంలోనే

తమన్నా ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. తెలుగులో చాలా వరకు తగ్గించింది. అయితే ప్రభాస్‌తో సినిమాకి నో చెప్పిందట. తన బాధని వ్యక్తం చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 13 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రభాస్‌ కి నో చెప్పి తప్పు చేసిన తమన్నా
Image Credit : facebook/@prabhasfans

ప్రభాస్‌ కి నో చెప్పి తప్పు చేసిన తమన్నా

ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. గ్లోబల్‌ ఇమేజ్ కన్నేశారు. ఇప్పటికే ఆయన్ని ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్‌ విషయంలో తాను తప్పు చేసినట్టు బాధపడుతుంది తమన్నా. మిల్కీ బ్యూటీగా పాపులర్‌ అయిన ఆమె ఇప్పుడు తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్‌లోనే నటిస్తుంది. సినిమాల్లో కంటే ఐటెమ్‌ సాంగ్స్ తో ఎక్కువగా వైరల్‌గా మారుతుంది. ఆమె ప్రభాస్‌తో సినిమా మిస్‌ కావడంపై స్పందించింది. తన విచారం వ్యక్తం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా
Image Credit : our own

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో `శ్రీ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇందులో మంచు మనోజ్‌తో కలిసి నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రెండేళ్లకి `హ్యాపీడేస్‌` మూవీ పడింది. ఈ మూవీ తమన్నా లైఫ్‌నే మార్చేసింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. దీంతో తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. `కాళిదాసు`, `కొంచెం ఇష్టం కొంచెం కష్టం`, `100% లవ్‌`, `బద్రినాథ్‌`, `రచ్చ`, `ఊసరవెళ్లి`, `రెబల్‌`, `ఎందుకంటే ప్రేమంటా`, `కెమెరామెన్‌ గంగతో రాంబాబు`, `తఢఖా`, `ఆగడు`, `బాహుబలి`, `బెంగాల్‌ టైగర్‌`, `ఊపిరి`, `జాగ్వర్‌`, `అభినేత్రి`, `నా నువ్వే`, `నెక్ట్స్ ఏంటి?` `ఎఫ్‌2`, `ఎఫ్‌3`, `సైరా`, `సిటీమార్‌`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాకాలం`, `భోళా శంకర్‌`, `ఓడెల 2` చిత్రాల్లో నటించింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. మధ్యలో కొన్ని చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్ చేసింది. పాటల్లో అందాల కోసమే తమన్నాని తీసుకున్న సినిమాలు చాలా ఉన్నాయని చెబితే అతిశయోక్తి కాదు. 

34
ఈ సినిమాకి నో చెప్పి చాలా బాధపడ్డా- తమన్నా
Image Credit : facebook/@prabhasfans

ఈ సినిమాకి నో చెప్పి చాలా బాధపడ్డా- తమన్నా

అయితే తమన్నా కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న సమయంలో ప్రభాస్‌ని రిజెక్ట్ చేసింది. ఆమెకి డార్లింగ్‌తో `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` సినిమాలో నటించే ఆఫర్‌ వచ్చిందట. కానీ రిజెక్ట్ చేసింది. ఇందులో హీరోయిన్‌గా ఛాన్స్ ముందు తనకే వచ్చిందని, కానీ ఆ టైమ్‌ చేయడం కుదరలేదని, దీంతో ప్రభాస్‌కి నో చెప్పాల్సి వచ్చిందని పేర్కొంది. ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక చూసి చాలా బాధపడిందట. ఇలాంటి సినిమానా తాను మిస్‌ చేసుకున్నదని అని బాధపడిందట. తనకు నచ్చిన మూవీస్‌లో అదొకటి అని తెలిపింది తమన్నా. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.

44
మిస్టర్‌ పర్‌ఫెక్ట్ లో ఫస్ట్ ఛాయిస్‌ తమన్నానే
Image Credit : our own

మిస్టర్‌ పర్‌ఫెక్ట్ లో ఫస్ట్ ఛాయిస్‌ తమన్నానే

ప్రభాస్‌ హీరోగా రూపొందిన `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` మూవీకి దశరథ్‌ దర్శకుడు. ఇందులో డార్లింగ్‌కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ 2011 ఏప్రిల్‌ 22న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో కాజల్‌ పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఆమెపాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. కాజల్‌ కూడా బాగా చేసింది. ఇందులో కాజల్‌ చేసిన పాత్రనే తమన్నా మిస్‌ చేసుకుందని చెప్పొచ్చు. ఈ మూవీ ఆ మధ్య రీ రిలీజ్‌ అయ్యింది. విశేష ఆదరణ పొందింది.  ఇదిలా ఉంటే తమన్నా, ప్రభాస్‌ కలిసి `రెబల్‌`, `బాహుబలి` రెండు పార్ట్ ల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Dacoit 3 days Collections: ఇండస్ట్రీకి షాకిస్తోన్న అడవిశేష్‌, డెకాయిట్‌ 3 రోజుల కలెక్షన్లు.. అసలు పరీక్ష ఏంటంటే?
Recommended image2
Asha Bhosle last Wish: ఆశా భోస్లే చివరి కోరిక ఇదే.. లెజెండరీ సింగర్‌ లాస్ట్ విష్‌ నెరవేరిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved