MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..

రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..

సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. వయసు పెరుగుతుంది కానీ.. సక్సెస్ మాత్రం వరించడంలేదు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రామ్ పెళ్లి చేసుకుంటాడా లేదా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 14 2026, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో..
Image Credit : Instagram / Ram Pothineni

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో..

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ పోతినేని టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోయిన రామ్.. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నాడు. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అయిన రామ్.. ఆతరువాత ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న రామ్.. పర్సనల్ విషయాలలో కూడా వైరల్ అవుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అభిమానులు ఏమంటున్నారంటే?
Image Credit : our own

అభిమానులు ఏమంటున్నారంటే?

మరీ ముఖ్యంగా రామ్ పెళ్లి గురించి అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ప్రతీసారి తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన రామ్ పోతినేని.. పెళ్ళిపై ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. మధ్యలో రామ్ పెళ్లంటూ.. కొన్ని రూమర్స్ వైరల్ అవుతూ వచ్చాయి. బిజినెస్ మెన్ కూతురితో పెళ్లింటూ ఓ న్యూస్ ఆమధ్య చక్కర్లు కొట్టాయి. కానీ ఆ విషయంలో రామ్ స్పందించలేదు.

36
హీరోయిన్ తో రామ్ రిలేషన్ లో ఉన్నాడా..?
Image Credit : instagram/ Ram Pothineni

హీరోయిన్ తో రామ్ రిలేషన్ లో ఉన్నాడా..?

ఆమధ్య రామ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తో ప్రేమలో ఉన్నాడు అని పుకార్లు చాలా వచ్చాయి. కాని అందులో నిజం లేదు అని ఆతరువాత తేలిపోయింది. అంతే కాదు ఈమధ్య కాలంలో మరో హీరోయిన్ తో మరోసారి రామ్ ప్రేమ వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరోయిన్ తో రామ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడ వార్తలు వైరల్ అయ్యాయి. 

ఆ హీరోయన్ ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. రామ్ రీసెంట్ గా నటించిన ఆంధ్రకింగ్ తాలుక సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ. ఈ బ్యూటీతో కనెక్ట్ అయ్యాడని, , ఘాడంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ముంబయ్ లో ఉంటూ తెగ డేటింగ్ చేసుకుంటున్నారని కూడా అన్నారు. కానీ ఈ విషయంలో నిజం లేదని రామ్ కామెంట్స్ ద్వారా అర్ధం అవుతోంది.

46
సింగిల్‌గా ఉండటమే ఇష్టం..
Image Credit : instagram/ Ram Pothineni

సింగిల్‌గా ఉండటమే ఇష్టం..

ఇక ప్రేమ పెళ్లి గురించి రామ్ ఇండైరెక్ట్ గా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్, తన సింగిల్ స్టేటస్ అనేది కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, అది తన వ్యక్తిత్వంలో భాగమని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఉండటానికి అలవాటు పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ అలవాటు తన జీవనశైలిలో భాగమైందని, దానివల్ల తాను ఎంతో సౌకర్యంగా ఉంటానని చెప్పారు.

56
రామ్ పోతినేని అసలు పెళ్లి చేసుకోడా..?
Image Credit : our own

రామ్ పోతినేని అసలు పెళ్లి చేసుకోడా..?

తన ఖాళీ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించడంలోనే తాను ఎక్కువ ఆనందం పొందుతానని రామ్ పేర్కొన్నారు. ఒంటరిగా గడిపే సమయం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆయన వివరించారు. అయితే, స్నేహితులతో గడపడం కూడా ఇష్టమేనని, కానీ తన కోసం తాను సమయం కేటాయించుకోవడంలోనే ప్రత్యేకమైన ఆనందం ఉందని అన్నారు. అంతే కాదు అసలు పెళ్లి చేసుకోరా అన్న డౌట్ చాలామందికి ఉండొచ్చు. తన జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా రామ్ చెప్పారు. ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగా ఉండటంలోనే తాను మరింత సంతోషంగా ఉంటానని స్పష్టం చేశారు.

66
కరోనా లాక్‌డౌన్ సమయంలో రామ్ ఏం చేశాడు?
Image Credit : our own

కరోనా లాక్‌డౌన్ సమయంలో రామ్ ఏం చేశాడు?

సినిమా రంగంలో పనిచేస్తూ ఎప్పుడూ వందలాది మందితో కలిసి ఉండాల్సి వస్తుందని ఆయన గుర్తుచేశారు. అలాంటి వాతావరణంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకున్నానని తెలిపారు. ఆ ప్రపంచం తనకు మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెప్పారు.ప్రత్యేకంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు ఒంటరిగా గడిపిన అనుభవాన్ని రామ్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనను తాను మరింతగా అర్థం చేసుకునే అవకాశం లభించిందని, ఒంటరితనం తనకు కొత్త కోణాన్ని చూపిందని పేర్కొన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image2
Nayanthara Movies: 41 ఏళ్ల వయసులో ఇన్ని సినిమాలా? లేడీ సూపర్‌స్టార్ అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved