నయనతార చెల్లెలు దగ్గర క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న హీరో శింబు
తమిళ స్టార్ హీరో శింబు నయనతారకు చెల్లెలు దగ్గర డాన్స్ నేర్చుకున్నాడని మీకు తెలుసా? అది కూడా శింబు లాంటి స్టైలిష్ స్టార్ భరతనాట్యం నేర్చుకున్నారనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి సౌత్ లో అందరికి తెలుసు. అయితే స్టైలీష్ గా ట్రెండ్ ను ఫాలో అవుతూ సినిమాలు చేసే శింబు భరతనాట్యం కూడా నేర్చుకున్నాడని మీకు తెలుసా? అది కూడా స్టార్ హీరోయిన్ నయనతార చెల్లెలి దగ్గర శింబు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాడట. అయితే నయనతార సొంత చెల్లెలి దగ్గర కాదు.. ఓ సినిమాలో నయనతార చెల్లెలి పాత్ర చేసిన ఓ నటి దగ్గర శింబు డాన్స్ నేర్చుకున్నారట. ఆమె ఎవరో కాదు శరణ్య మోహన్.
మలయాళంలో, దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించిన 'అనియాది ప్రవు' సినిమా ద్వారా బాలనటిగా పరిచయమైన నటి శరణ్య మోహన్. తర్వాత ఈ సినిమా తమిళంలో, తలపతి విజయ్ , శాలిని కాంబోలో రీమేక్ చేయబడింది. ఈసినిమాలో శరణ్య మోహన్ బాలనటిగా నటించారు.
మలయాళం, తమిళంలో కొన్ని సినిమాల్లో బాలనటిగా నటించిన ఆమె, 2005లో శ్రీకాంత్ - సోనియా అగర్వాల్ నటించిన ఓ సినిమాలో శ్రీకాంత్ చెల్లెలిగా నటించారు. అయితే ఆమెను ప్రేక్షకులకు బాగా పరిచయం చేసిన చిత్రం అంటే, 2008లో విడుదలైన ధనుష్ - నయనతార యారడి నీ మోహిని . మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన ఈసినిమా తెలుగులో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈసినిమాలో శరణ్య, నయనతార చెల్లెలిగా నటించారు.
ఈ సినిమా కాకుండా శరణ్య మోహన్ 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె కల్యాణ్ రామ్ కు చెల్లెలిగా కత్తి సినిమాలో నటించారు. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమెకు హీరోయిన్ అవకాశాలు రాలేదు. అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న శరణ్య.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సింబుకు తాను భరతనాట్యం నేర్పించినట్లు చెప్పారు.
శరణ్య నటి మాత్రమే కాదు భరతనాట్య కళాకారిణి కూడా. ఈ నేపథ్యంలోనే, నటుడు సింబు "మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కేరళ వచ్చినప్పుడు, అతని తలకు స్వల్ప గాయమై ఆసుపత్రిలో చేరారు. శరణ్య భర్త వైద్యుడు కావడంతో, ఈ విషయం తెలుసుకున్న శరణ్య సింబును చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారట.
గాయం స్వల్పంగా ఉండటంతో త్వరగా కోలుకున్న నటుడు సింబు, శరణ్యతో ఇక్కడ తనకు భరతనాట్యం నేర్పించడానికి మగ క్లాసికల్ డాన్సర్ గురించి అడిగారట. దాంతో శరణ్య అలాంటివారు ఇక్కడ ఎవరూ లేరు. మీకు అభ్యంతరం లేకపోతే నేనే నేర్పిస్తానని చెప్పి నటుడు సింబుకు భరతనాట్యం నేర్పించారట. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. నయనతార చెల్లెలిదగ్గర శింబు భరతనాట్యం నేర్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.