- Home
- Entertainment
- 28 ఏళ్ల వయస్సులో 65 కోట్ల ఇల్లు, వేల కోట్ల ఆస్తి, ఇండస్ట్రీలో మహారాణిలా వెలుగుతున్న యంగ్ హీరోయిన్ ఎవరు?
28 ఏళ్ల వయస్సులో 65 కోట్ల ఇల్లు, వేల కోట్ల ఆస్తి, ఇండస్ట్రీలో మహారాణిలా వెలుగుతున్న యంగ్ హీరోయిన్ ఎవరు?
ఆమె యంగ్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ వారసురాలు, స్టార్ ప్రొడ్యూసర్ కు ముద్దుల కూతురు, వేల కోట్ల ఆస్తులు ఉన్న బ్యూటీ, 65 కోట్ల సొంత ఇంటిని కలిగి ఉన్న తార. బాలీవుడ్, టాలీవుడ్ లో వెలుగు వెలుగుతున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ కిడ్స్ చాలామంది ఉన్నారు. వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టార్స్ ప్రస్తుతం తమను తాము నిరూపించుకునే పనిలో ఉన్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉంది. ఆమె తన తల్లి వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చి కమర్షియల్ హీరోయిన్ గా నిలబడటానికి ప్రయత్నం చేస్తోంది.
నటిగా తనను తాను నిరూపించుకున్న ఈ బ్యూటీ.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారాలని ప్లాన్ వేస్తోంది. వేల కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ ను ఏంజాయ్ చేస్తూనే.. ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.
వారసత్వంగా వచ్చి, స్వతహాగా నిలబడిన జాన్వీ
యంగ్ జనరేషన్ హీరోయిన్లలో ఎక్కు వపాపులారిటీ ఉన్న బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్. తన వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమే అయినా, ఆమె ఆస్తులు మాత్రం వేల కోట్లలో ఉన్నాయి. తల్లి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ, తన ప్రతిభతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను మెయింటేన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది బ్యూటీ.
2018లో తల్లి శ్రీదేవి హాఠాన్మరణంతో జాన్వీ కపూర్ జీవితంలో చీకటి అలముకుంది. ఆ ఏడాది జాన్వీని హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడ్డారు. ఇక తల్లి మరణం తో డిప్రెషన్ లోకి వెళ్లిన జాన్వీ.. తన తల్లి కోరిక మేరకు అదే ఏడాది ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ కపూర్ ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహి, Mr. & Mrs. మాహి వంటి పలు చిత్రాల్లో నటించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
జాన్వీ పేరు మీద కోట్ల విలువైన ఆస్తులు
జాన్వీ కపూర్ వయసు 28 ఏళ్లు కాని ఆమె ఆస్తులు మాత్రం వేల కోట్లు ఉంటాయి. ముంబై బాంద్రాలో జాన్వీ కపూర్‌కు ఉన్న విలాసవంతమైన ఇల్లు దాదాపు 65 కోట్ల విలువ కలిగి ఉంది. 8669 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఇంట్లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఇంటీరియర్ డిజైన్, అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.
ఇదే కాకుండా, చెన్నైలో కూడా జాన్వీ కుటుంబానికి మరో విలాసవంతమైన భవనం ఉంది. ఇది నాలుగు ఎకరాల్లో విస్తరించి, బీచ్ వ్యూ తో పాటు పచ్చని తోటలు, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్, కళాత్మక ఫర్నిచర్‌తో కూడిన ఇంటిరియర్ ఉన్నాయి. ఈ భవనం శ్రీదేవి అప్పట్లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు వందల కోట్ల విలువచేస్తుంది.
జాన్వీ కపూర్ లగ్జరీ కార్ల కలెక్షన్
సెలబ్రిటీలు అంటేనే లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. వారి ఇళ్లతో పాటు కార్లు కూడా కోట్ల విలువచేస్తుంటాయి. ఇక అందులో కార్లు అనగానే జాన్వీ కలెక్షన్ ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఆమెకు చెందిన కార్లలో ప్రధానంగా ఉన్నకార్ల గురించి చూసుకుంటే.
జన్వీ కపూర్ గ్యారేజ్ లో మెర్సిడెస్ మేబ్యాక్ S560 కారు ఉంది. దీని మార్కెట్ ధర సుమారు రూ.1.94 కోట్లు. ఇందులో సీట్ మసాజర్‌లు, మినీ ఫ్రిజ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బీఎండబ్ల్యూ X5 – రూ.95 లక్షల విలువ కలిగిన ఈ కారు TwinPower Turbo V8 ఇంజిన్‌తో 261 bhp పవర్ ను కలిగి ఉంటుంది.
లెక్సస్ ఎల్‌ఎక్స్ 570 – రూ.2.7 కోట్లు విలువైన ఈ SUV కూడా జాన్వీ కలెక్షన్‌లో ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ – దీని విలువ సుమారు రూ.1.62 కోట్లు.
మెర్సిడెస్ GLE 250d – దీని ధర దాదాపు రూ.67 లక్షలు.
తెలుగు సినిమాల్లో జాన్వీ కపూర్
ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న క్రమంలో ఇక్కడి సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు పరిశ్రమ వైపూ అడుగులు వేసింది.
వరుసగా తెలుగు సినిమాలకు సైన్ చేస్తోంది. దేవర సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది.
తల్లి శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి వచ్చినా, తన దారిని తానే ఖచ్చితంగా ఏర్పరచుకుంటూ లక్షలాది మంది అభిమానుల మనసు దోచుకుంటున్న జాన్వీ కపూర్, తన విలాసవంతమైన జీవనశైలితో మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. వయసు తక్కువే అయినా, సంపాదించిన ఆస్తులు, స్టైల్, ప్రాపర్టీలు మాత్రం సినీ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీలతో సమానంగా ఆమెను నిలబెట్టాయి .