విజయ్ చివరి సినిమాలో నాలుగో హీరోయిన్ గా కమల్ హాసన్ కూతురు
విజయ్ దళపతి చివరి సినిమా హెచ్ వినోద్ కుమార్ డైరెక్ష్ లో చేస్తున్నారు. ఈసినిమాలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు సెలక్ట్ అవ్వగా.. నాలుగో హీరోయిన్ గా కమల్ హాసన్ కూతురు చేయబోతుందట నిజమేనా..?

విజయ్ 'జన నాయగన్'
విజయ్ తన కెరీర్ లో చివరిగా నటుస్తున్న సినిమా 'జన నాయగన్' ఈ సినిమాకి ఎచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి నటిస్తున్న ఈ సినిమాని కెవిఎన్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?
జన నాయగన్ అప్డేట్
'జన నాయగన్' సినిమా షూటింగ్ సూపర్ ఫస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే ఓవర్ సిస్ లో 75 కోట్లకు అమ్ముడుపోయింది.
Also Read: నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా
నాలుగో హీరోయిన్ శృతి హాసన్
'జన నాయగన్' లో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రియమణి తర్వాత నాలుగో హీరోయిన్ గా శృతి హాసన్ చేరారు. 'జైలర్2' సినిమాలో నటిస్తున్న శృతి త్వరలోనే 'జన నాయగన్' షూటింగ్ లో పాల్గొంటారు.
Also Read: శోభితకు నచ్చని నాగచైతన్య సినిమా, మరి బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా
శృతి హాసన్ 'జన నాయగన్' లో
విజయ్, శృతి హాసన్ కలిసి నటించడం ఇది మొదటిసారి కాదు. 'పులి' సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తరువాత వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. శృతికి ఈ సినిమాలో కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read:రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?