శోభితకు నచ్చని నాగచైతన్య సినిమా, మరి బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా
నాగచైతన్య సినిమాల్లో శోభిత ధూళిపాళకు అస్సలు నచ్చని సినిమా ఏదో తెలుసా..? ఈ సినిమా ఎందుకు చేశావంటుందట, మరి బాగా నచ్చిన సినిమా కూడా ఉంది అదేంటంటే..?

Naga Chaitanya
అక్కినేని మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగచైతన్య. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి హీరోగా స్టార్ డమ్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మంచి మంచి కాన్నెప్ట్లతో సినిమాలు చేసిన ఈ హీరో.. సాలిడ్ హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అయితే నటన విషయంలో కాని.. క్యారెక్టర్ విషయంలో కాని మంచి పేరు తెచ్చుకున్నాడు నాగచైతన్య.
Also Read: 3500 కోట్ల ఆస్తి ఉన్న తెలుగు హీరో, 99 సినిమాలు చేస్తే 40 కి పైగా ప్లాప్ లే, ఎవరా స్టార్.?
thandel movie opening box office collection Naga Chaitanya geetha arts
సాప్ట్ క్యారెక్టర్ అన్న పేరుతో పాటు.. పాత్ర కోసం ప్రాణం పెట్టగల నటుడిగా నాగచైతన్యకు పేరుంది. ఇక ఈ హీరో తాజాగా తండేల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు. ఇక నాగచైతన్య ఈమధ్య కాలంలో తండేల్ సినిమాతో పాటు.. పర్సనల్ విషయాలలో కూడా వార్తల్లో నిలిచాడు. శోభిత ధూళిపాళతో పెళ్లి జరిగినప్పటి నుంచి చైతూ వైరల్ న్యూస్ అవుతున్నారు.
Also Read:నిర్మాతలను భయపెడుతున్న ఐశ్వర్య రాజేష్, రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా
గతంలో సమంతతో 7 ఏళ్ల ప్రేమ.. ఆతరువాత పెళ్లి, మూడేళ్ల తరువాత విడాకులు ఇలా తన జీవితంలో సంచలనం నమోదు చేసుకున్న నాగచైతన్య.. ఆతరువాత శోభిత ప్రేమలో పడి.. రెండేళ్ళ తరువాత రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అని చాలా సార్లు చెప్పుకోచ్చిన నాగచైతన్య.. తాను ఏ పనిచేసినా..శోభిత సలహాలు తీసుకుంటాను అంటున్నాడు. అంతే కాదు నాగచైతన్య సినిమాల్లో శోభితకు నచ్చని సినిమా ఒకటి ఉందట.
Also Read: చిరంజీవి, బాలయ్య కాంబోలో భారీ మల్టీ స్టారర్? కథ రాస్తున్న దర్శకుడెవరంటే?
అదేంటంటే బెజవాడ. అవును నాగచైతన్య లవ్ స్టోరీస్ చాలా బాగుంటాయి. ఏం మాయ చేశావే, 100 పర్సంట్ లవ్, మజిలి, లవ్ స్టోరీ, రీసెంట్ గా వచ్చిన క్యూల్ లవ్ స్టోరీ తండేల్. ఇలా లవ్ స్టోరీస్ అద్భుతంగా ఉంటాయి. కాని మధ్యలో మాస్ ఇమేజ్ ను కూడా ట్రై చేశాడు చైతూ. అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్లు గా నిలిచాయి. వాటిలో బెజవాడ సినిమా కూడా ఒకటి. ఈసినిమా శోభితకు అస్సలు నచ్చదట.
అసలు ఈసినిమా ఎలా చేశావంటూ తిడుతుందట కూడా. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే.. నాగచైతన్య లవర్ బాయ్ గా నటించిన సినిమాలంటే శోభితకు చాలా ఇష్టమట. అందులోను ఆయన సమంతతో కలిసి నటించిన ఏం మాయచేశావే సినిమా అంటే చాలా ఇష్టమట. ఈసినిమా నుంచే చైతు సమంత ప్రేమ చిగురించిన సంగతి అందరికి తెలిసిందే. అయినా సరే..ఈ క్యూట్ లవ్ స్టోరీ అంటే శోభితకు చాలా ఇష్టమట.