- Home
- Entertainment
- 1000 కోట్ల ఆస్తి, 2 కోట్ల కారు ఉన్నా, సింపుల్ గా 8 లక్షల స్విఫ్ట్ లో తిరుగుతున్న హీరోయిన్ ?
1000 కోట్ల ఆస్తి, 2 కోట్ల కారు ఉన్నా, సింపుల్ గా 8 లక్షల స్విఫ్ట్ లో తిరుగుతున్న హీరోయిన్ ?
ఆమె ఓ హీరోయిన్, దాదాపు 1000 కోట్ల ఆస్తి ఉంది, కోట్లు విలువచేసే కార్లు గ్యారేజ్ లో ఉన్నాయి. కాని చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది ఈ బ్యూటీ. చిన్న స్విఫ్ట్ కారులో తిరుగుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

కాస్త ఫేమస్ అయితే చాలు సంపాదనకు మించి ఖర్చు పెట్టాలని చూస్తుంటారు కొంత మంది సినిమాతారలు. గ్రాండ్ గా లైఫ్ ను లీడ్ చేయడం కోసం కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్లీ కార్లు, బట్టలు,ఇల్లు కొంటుంటారు. కాని ఓ హీరోయిన్ మాత్రం వందల కోట్ల ఆస్తి ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉన్నా సింపులు లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తోంది. ఎవరు ఎలా ఉన్నా సరే, నేను ఇంతే అంటూ.. సాధారణంగా ఉండటానికి ఇష్టపడుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్దా కపూర్.
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌లలో ఒకరైన శ్రద్ధా కపూర్ తన సింపుల్ లైఫ్‌స్టైల్‌తో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. భారీగా ఆస్తులు, కాస్ట్లీ కార్లు, కోట్లు విలువ చేసే వస్తువులెన్నో ఉన్నా.. ఆమె సాధారణ ప్రజల మాదిరిగా మారుతి సుజుకి స్విఫ్ట్ కారు వాడుతున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలు విలాసవంతమైన కార్లను, వాచ్‌లను, బంగ్లాలను ఉపయోగిస్తూ కనబడుతారు. కానీ శ్రద్ధా కపూర్ మాత్రం తన సాదా జీవన శైలితో చర్చనీయాంశంగా మారారు. శ్రద్దా కపూర్ మాత్రమే కాదు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ ను మాత్రమే ఇష్టపడతారు. ‘
కల్కి 2898 ఏ.డి’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టి, 1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లిన దర్శకుడు ఎంత లగ్జరీ లైఫ్ ను గడుపుతారో అని అందరు అనుకోవచ్చు. కాని నాగ్ అశ్విన్ మాత్రం చాలా సింపుల్ గా చిన్న కారు వాడుతున్న విషయం రీసెంట్ గా బయటకు వచ్చింది. ఈక్రమంలో శ్రద్ధా కపూర్ కూడా అదే దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది.
శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌లో ‘ఆషికి 2’, ‘బాఘి’, ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’, ‘స్త్రీ’, ‘తు ఝూతీ మై మక్కార్’ వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ ఇమేజ్ ను సంపాదించింది. ఇక తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’ చిత్రంలో నటించి టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ సినిమా ఓ మోస్తరు విజయ్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో సాహో పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం భారీగా కలెక్షన్లు వసూలు చేసి మంచి విజయాన్ని సాధించింది. ఇక శ్రద్దా నటించి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘స్త్రీ 2’ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించింది. 900 కోట్లు వసూలు చేసింది.
ఇక శ్రద్ధా కపూర్ గ్యారేజ్ లో లంబోర్గిని, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ (మూడు మోడళ్లలో), ఆడి క్యూ7, టయోటా ఫార్చ్యూనర్ వంటి కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నా, ఆమె ఇటీవల స్విఫ్ట్ కారులో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇది చూసిన అభిమానులు ఆమె ను అభిమనందిస్తున్నారు. ఇంత సింపుల్ గా ఎలా ఉండగలుతున్నారు అని అడుగుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్రద్దా కపూర్. సాహో సినిమా తరువాత తెలుగులో మరే ప్రాజెక్ట్ చేయలేదు ఈ హీరోయిన్.

