800 సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు ఎన్ని కోట్లు సంపాదించారు, ఆయన వారసులెవరు?
45 ఏళ్లు 800 లకు పైగా సినిమాలు, ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన కోట శ్రీనివాసరావు ఎంత ఆస్తి సంపాదించారో తెలుసా? కోట శ్రీనివాసరావు వారసులు ఎవరు?

టాలీవుడ్ లెజండరీ యాక్టర్స్ లో కోట శ్రీనివాసరావు ఒకరు. తెలుగు సినిమా చరిత్రలో కోటది చెరగని ముద్ర. ఆయన నటన చూసి అలా విగ్రహంలా నిలబడిపోయాను.. అని ఓ సందర్భంలో ప్రకాశ్ రాజ్ స్వయంగా చెప్పారు. నటన విషయంలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు కోట శ్రీనివాసరావు. అందుకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక స్థానం. కోట ప్రస్తుతం ఈ లోకంలో లేకపోయినా.. చేసిన పాత్రలు ఆయన్ను బ్రతికిస్తూనే ఉంటాయి. ఆయన చేసిన సినిమాలు చూస్తున్నప్పుడల్లా కోటను గుర్తు చేస్తూనే ఉంటాయి.
నటనకు కట్టనికోటలా నిలిచిన మహానటుడు కోట శ్రీనివాసరావు. దాదాపు 45 సంవత్సరాలు, 800 సినిమాలకు పైగా నటించి మెప్పించిన కోట ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోట శ్రీనివాసరావు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాతోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్ గా, కమెడియన్ గా , తండ్రిగా, తాతగా, ఆకరికి చీరకట్టి ఆడవేశాలు కూడా వేసి నటనపై తన ప్రేమను చాటుకున్నారు కోట శ్రీనివాసరావు.
సినిమాలతో పాటు రాజకీయాలను కూడా అలా టచ్ చేసి వచ్చారు కోట. 1999- 2004 మధ్య విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక 9 నంది అవార్డ్ లను అందుకున్న కోట, తెలగు సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా పొందారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉన్న కోట శ్రీనివాసరావు ఒకరు భారీగానే ఆస్తులు కూడబెట్టారు. నటనతో పాటు రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన, సినిమాల నుంచి సంపాదించిన దానిలో కొంత రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తోంది. బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న కోట.. ఆర్ధికంగా జాగ్రత్తలు పడ్డారు. ఫిల్మ్ నగర్ లో ఆయనకు ఒక పెద్ద ఇల్లు ఉంది. దీని మార్కెట్ వ్యాల్యూ కోట్లలోనే ఉంటుంది. ఇక కోట స్థిర,చరాస్తులు అన్ని కలిపి దాదాపు 100 కోట్ల వరకూ ఉంటుందని అంచన.
ఇక కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు ఇద్దరు కూతుర్లతో పాటు కొడుకు ఆంజనేయ ప్రసాద్ ఉన్నారు. అయితే 2010 జూన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటా తనయుడు మరణించారు. కూతుర్లు పెళ్లిల్లు జరిగి సెటిల్ అయ్యారు. ఇక కోట కొడుకు ప్రసాదు కు ఇద్దరు తనయులు ఉన్నారు. వారు ప్రస్తుతం చదువుకుంటున్నారు. కొడుకు మరణం తరువాత మనవళ్ల బాధ్యతను కోట స్వయంగా చూసుకున్నారు. బాగా చదివించారు. ప్రస్తుతం ఆయన వారసులుగా ఆ ఇద్దరు మనవళ్లు ఉన్నారు. కోట అంత్యక్రియలు కూడా వారే నిర్వహించారు.

