MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?

Savitri: సెట్‌లో సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్.. కారణం ఏంటి? మహానటి ఏం చేసింది?

Savitri: మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె సినీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటికీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. మురళీ మోహన్ సావిత్రి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లడించారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 11 2026, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెండితెరపై వెలుగు వెలిగిన మహారాణి..
Image Credit : Asianet News

వెండితెరపై వెలుగు వెలిగిన మహారాణి..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'మహానటి'గా చెరగని ముద్ర వేసిన సావిత్రి.. ఒక మహారాణిలా వెలుగు వెలిగారు. తన అద్భుత నటనా ప్రతిభతోనే కాకుండా, మంచి మనసుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆరంభంలో స్టార్ హీరోల సరసన కథానాయికగా అలరించిన ఆమె, ఆ తర్వాత శోభన్ బాబు, మురళీ మోహన్ వంటి నాటి యంగ్ స్టార్స్‌కు తల్లి పాత్రల్లో నటించి మెప్పించారు. సెట్‌లో ఆమె పలికించే అభినయంలోని నైపుణ్యాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ గారు పలు సందర్భాల్లో ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డైలాగ్ చెప్పడానికి గ్యాప్ తీసుకున్న సావిత్రి..
Image Credit : Asianet News

డైలాగ్ చెప్పడానికి గ్యాప్ తీసుకున్న సావిత్రి..

దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతంలో ఒక అమ్మాయి’ చిత్రంలో సావిత్రమ్మ, మురళీ మోహన్ గారికి తల్లి పాత్రలో నటించారు. ఆ షూటింగ్ సెట్‌లో జరిగిన ఒక సంఘటనను, సావిత్రి గారి హావభావాల ప్రత్యేకతను మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సెట్‌లో సావిత్రి నటనను ప్రత్యక్షంగా చూసి ఆయన ఆశ్చర్యపోయేవారు. ఒక సన్నివేశంలో ఆమె డైలాగ్ చెప్పే విధానం, దానికి అనుగుణంగా కళ్లలో పలికించే హావభావాలు ఎంతో సహజంగా ఉండేవి.

ఒక సందర్భంలో మురళీ మోహన్ తన డైలాగ్ చెప్పడం పూర్తయింది. ఆ తర్వాత సావిత్రి ముందుకు వచ్చి డైలాగ్ చెప్పాల్సి ఉంది. కానీ అప్పటికే చాలా సమయం పడుతోంది. మురళీ మోహన్ వెనక్కి తిరిగి చూడకూడదు, దర్శకుడు 'కట్' చెప్పడం లేదు. "ఏమైంది?" అని ఆయనకు సందేహం వచ్చింది. "ఇంత ఆలస్యం (లాగ్) అయితే బాగోదు కదా, దర్శకుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? సావిత్రి గారు సీనియర్, నేను ఏమీ అనకూడదు.. కానీ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది?" అని ఆయన అనుకుంటుండగా కొద్దిసేపటికి సావిత్రి డైలాగ్ చెప్పారు. అయితే ఆ డైలాగ్ చెప్పడానికి ఆమె అంత సమయం ఎందుకు తీసుకున్నారో అనే సందేహం మురళీ మోహన్‌లో అలాగే ఉండిపోయింది.

34
సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్..
Image Credit : Asianet News

సావిత్రి కాళ్ల మీద పడి దండం పెట్టిన మురళీ మోహన్..

దర్శకుడు 'కట్' చెప్పిన తర్వాత మురళీ మోహన్ దాసరి గారి దగ్గరకు వెళ్లి, "ఏంటండీ, డైలాగ్‌కు అంత లాగ్ వచ్చింది?" అని అడిగారట. దానికి దాసరి గారు స్పందిస్తూ.. "ఒక్కసారి రష్ (చిత్రీకరించిన సన్నివేశం) చూడు, నీకే అర్థమవుతుంది" అని చెప్పారు. ఆయన అన్నట్లే రష్ చూసిన మురళీ మోహన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

తను డైలాగ్ చెప్పి అటువైపు తిరిగిన తర్వాత, సావిత్రి డైలాగ్ చెప్పేముందు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మైండ్ బ్లోయింగ్! కళ్లతోనే ఆ సెంటిమెంట్‌ను పలికిస్తూ, అద్భుతమైన ముఖకవళికలు ఇచ్చిన తర్వాతే ఆమె డైలాగ్ చెప్పారు. అందుకే అక్కడ అంత గ్యాప్ వచ్చిందని ఆయనకు అర్థమైంది. అది చూసిన మురళీ మోహన్ వెంటనే వెళ్లి సావిత్రి కాళ్లకు దండం పెట్టారట. "మీరు నిజంగా మహానటి.. ఎంత బాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు!" అని కొనియాడారట. మురళీ మోహన్ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. "నిజంగా ఆమె అంత అద్భుతంగా నటించారు కాబట్టే ఆమెను మహానటి అన్నారు" అని చెప్పారు.

44
కెమెరా ముందుకు రాగానే మారిపోతారు..
Image Credit : facebook

కెమెరా ముందుకు రాగానే మారిపోతారు..

సెట్‌లో సాధారణంగా ఎంతో సరదాగా, అమాయకత్వంతో ముచ్చటించే సావిత్రి.. కెమెరా రోల్ కాగానే ఒక్కసారిగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేవారు. సంభాషణల్లోని భావోద్వేగాలు, కరుణ, కోపం లేదా వాత్సల్యం ఏదైనా సరే.. కేవలం ముఖకవళికలతోనే స్పష్టంగా చూపించేవారు. ఆమె నటనలోని ఆ సహజత్వం, పాత్రలో లీనమయ్యే తీరు తోటి నటులకు ఎంతో స్ఫూర్తినిచ్చేది.

అంతేకాకుండా, సావిత్రి కి సెట్‌లో సమయపాలన, సరదా మనస్తత్వం రెండూ ఉండేవి. సాధారణంగా సాయంత్రం ఆరు గంటల వరకు షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత తోటి నటీనటులతో కలిసి రిలాక్స్ అవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. సెట్‌లో అంతటి పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఎలాంటి అహంకారం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని మురళీ మోహన్ గారు గుర్తుచేసుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సావిత్రి (నటి)
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
నగ్మా నుంచి టబు వరకు.. 50 ఏళ్లు దాటినా పెళ్లి లేకుండా, సింగిల్‌గా ఉంటున్న టాప్ 6 హీరోయిన్లు
Recommended image2
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved