MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mysaa: పూనకాలు తెప్పిస్తోన్న ఒసేయ్‌ రాములమ్మ పాట.. రష్మిక మందన్నా రచ్చ వేరే లెవల్‌

Mysaa: పూనకాలు తెప్పిస్తోన్న ఒసేయ్‌ రాములమ్మ పాట.. రష్మిక మందన్నా రచ్చ వేరే లెవల్‌

Mysaa Movie: రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న `మైసా` సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. `ఒసేయ్‌ రాములమ్మ` అంటూ సాగే ఈ పాట పూనకాలు తెప్పిస్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 20 2026, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మైసా నుంచి ఒసేయ్‌ రాములమ్మ పాట
Image Credit : Asianet News

మైసా నుంచి ఒసేయ్‌ రాములమ్మ పాట

`ఒసేయ్‌ రాములమ్మ` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ అప్పట్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేసిందో తెలిసిందే. విజయశాంతి పాత్రపై వచ్చే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంది. పూనకాలు తెప్పించింది. ఆ పాట సి నారాయణరెడ్డి రాయగా, వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. అప్పట్లో దుమ్ములేపిన ఈ పాటని ఇప్పుడు మళ్లీ వెండితెరపై సందడి చేయబోతుంది. ఇందులో రష్మిక మందన్నా కనిపిస్తుండటం విశేషం.

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `మైసా`. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌, ఒక పాట విడుదలైంది. ఇప్పుడు మరో పాట విడుదల చేశారు. `ఒసేయ్‌ రాములమ్మ` అంటూ సాగే పాటని విడుదల చేశారు.

విజయశాంతి నటించిన `ఒసేయ్‌ రాములమ్మ` చిత్రంలోని ఈ పాటని ఇప్పుడు మళ్లీ కొత్త లిరిక్‌తో రీ క్రియేట్‌ చేశారు. పల్లవిని వాడుకొని, చరణంలో బలమైన పదాలను వాడుతూ ఈ పాటని రాశారు ప్రముఖ రైటర్‌ సుద్దాల అశోక్‌ తేజ. ఈ పాటని వందేమాతరం ఆలపించడం విశేషం. జేక్స్ బిజోయ్‌ సంగీతం అందించారు. `మైసా` చిత్రంలోని రెండో పాటగా శుక్రవారం ఈ పాటని విడుదల చేయగా, ఇది పూనకాలు తెప్పిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గూస్‌బంమ్స్ తెప్పిస్తోన్న ఒసేయ్‌ రాములమ్మ పాట
Image Credit : Asianet News

గూస్‌బంమ్స్ తెప్పిస్తోన్న ఒసేయ్‌ రాములమ్మ పాట

ఇందులో రష్మిక మందన్నాపై వచ్చే సీన్లు అదిరిపోయాయి. ఆమె పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చేస్తుండగా, వచ్చే ఈ పాట మతిపోయేలా ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే గుస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. సినిమా చివర్లో బలమైన యాక్షన్‌ నేపథ్యంలో ఈ పాట వస్తుందని తాజాగా లిరిక్‌ రైటర్‌ సుద్ధాల అశోక్ తేజ తెలిపారు. రష్మిక మందన్నా వంటి స్టార్‌ హీరోయిన్‌పై వచ్చేలా ఈ పాటని రాయడం తమ అదృష్టమని ఆయన వెల్లడించారు. రష్మిక మందన్నాపై కూడా పాట పాడి ఆకట్టుకున్నారు. ఆయన స్పీచ్‌కి ఆడియెన్స్ తోపాటు రష్మిక మందన్నా కూడా ఫిదా కావడం విశేషం.

33
భయంగా ఉందంటూ రష్మిక మందన్నా కామెంట్‌
Image Credit : Asianet News

భయంగా ఉందంటూ రష్మిక మందన్నా కామెంట్‌

ఈ పాటలో తాను నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. విజయశాంతి నటించిన ఈ పాటని మళ్లీ తనపై రాస్తున్నారని తెలిసి మొదట భయపడ్డానని పేర్కొంది. ఇదొక ఐకానిక్‌ సాంగ్‌, ఐకానిక్‌ మూవీ నుంచి తీసి రీక్రియేట్‌ చేస్తున్నామని దర్శకుడు చెప్పగానే ఇదొక పెద్ద రెస్పాన్సిబులిటీగా భావించాను. ఒరిజినల్‌ మ్యాజిక్‌ని రీ క్రియేట్‌ చేయలేము, కానీ న్యాయం చేయగలిగితే చాలా అనుకున్నాం. వందేమాతరం శ్రీనివాస్‌ సర్‌ వాయిస్‌ మ్యాజిక్ చేసింది.

విజయశాంతి మేడమ్‌ ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే బాగుండేది, ఆమె బిజీగా ఉంటారు. కానీ ఆమెకిది ఒక ట్రిబ్యూట్‌ లాంటిది అని చెప్పింది రష్మిక. 1997లో చేసిన ఒసేయ్‌ రాములమ్మ సినిమానే ఒక ఫ్యూచరిస్టిక్‌ కాన్సెప్ట్. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఆ ప్రేమని ఇప్పుడు కూడా ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది రష్మిక. ఈ నెల 27న విడుదలవుతున్న సినిమాని ఆదరించాలని ఆమె వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
368
INDIND
(39.0 ov)159/1
Day 2
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
31st T20 • WBBLT20
BH-WBH-W
Sun, 22 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: వెంకటేష్, కళ్యాణ్ రామ్ 'జనవరి 12 విడుదల' ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్.. స్పీడు మామూలుగా లేదుగా
Recommended image2
Mammootty Luxury Home: మమ్ముట్టి కొచ్చి లగ్జరీ ఇల్లు ఎలా ఉందో చూశారా? సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్
Recommended image3
Rohit Naidu: మీ ఇంటికి వస్తా, మీ భార్యలకే ఆ ఆడియో క్లిప్ వినిపిస్తా.. త్రిగుణ్ పీఆర్ కి రోహిత్ వార్నింగ్
Related Stories
Recommended image1
Bigg Boss 10: ఈ వారం ఓటింగ్‌ రిజల్ట్, 11వ వారం బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు?
Recommended image2
OM Movie Review: ఓం మూవీ రివ్యూ.. ధనుష్‌, మమ్ముట్టి ల మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved