- Home
- Entertainment
- సంక్రాంతికి వస్తున్న ఏడుగురు హీరోలు, ఎవరికి హిట్టు ఎక్కువ అవసరం.. దారుణమైన ట్రోలింగ్ తర్వాత చిరు, రవితేజ
సంక్రాంతికి వస్తున్న ఏడుగురు హీరోలు, ఎవరికి హిట్టు ఎక్కువ అవసరం.. దారుణమైన ట్రోలింగ్ తర్వాత చిరు, రవితేజ
Sankranti Movies: సంక్రాంతికి చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు ఏడుగురు హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీరిలో ఏ హీరోకి హిట్టు ఎక్కువ అవసరమో ఈ కథనంలో తెలుసుకుందాం.

సంక్రాంతి సినిమాలు
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. జనవరి 9 నుంచే సంక్రాంతి సినిమాల సందడి షురూ కానుంది. జనవరి 9న ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రం రిలీజ్ కానుంది. జనవరి 8 రాత్రి నుంచే ప్రీమియర్ల సందడి షురూ అవుతుంది. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు చిత్రాలు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు తమిళం నుంచి కూడా దళపతి విజయ్ జన నాయకుడు, శివకార్తికేయన్ పరాశక్తి అనే డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అవుతాయి. ఈ ఏడు సినిమాలలో ఏ హీరోకి హిట్టు ఎంత అవసరమో ఈ కథనంలో తెలుసుకుందాం.
ది రాజా సాబ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. సలార్, కల్కి 2898ఎడి లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి ఈ చిత్రం వస్తోంది. ఈ మూవీ హిట్ కావడం ప్రభాస్ కంటే దర్శకుడు మారుతికి చాలా అవసరం. మారుతి తన కెరీర్ లో ఇంత భారీ ప్రాజెక్టుని తొలిసారి తెరకెక్కిస్తున్నారు. పైగా మారుతి చివరి చిత్రం పక్కా కమర్షియల్ నిరాశ పరిచింది.
మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి నటించిన చివరి చిత్రం భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది. చిరంజీవిపై ట్రోలింగ్ కూడా జరిగింది. సో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద కంబ్యాక్ ఇవ్వాలి అంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ హిట్ కావాలి. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహారాజ రవితేజ కెరీర్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. రవితేజ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వీటి నుంచి బయట పడాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం హిట్ కావడం రవితేజకి చాలా అవసరం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి 13న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.
అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. హీరో కంటే ఈ సినిమా హిట్ కావడం నిర్మాత నాగవంశీకి ఎక్కువ అవసరం. ఆయన నిర్మించిన చివరి చిత్రాలు కింగ్డమ్, మాస్ జాతర నిరాశ పరిచాయి. డిస్ట్రిబ్యూట్ చేసిన వార్ 2 నష్టాలు మిగిల్చింది. సో ఈ సినిమా పై నాగవంశీ ఆశలు పెట్టుకుని ఉన్నారు.
నారీ నారీ నడుమ మురారి
శర్వానంద్ కి ఇటీవల సరైన హిట్ లేదు. సంక్రాంతి రిలీజ్ అవుతున్న ఈ సినిమాపైనే శర్వానంద్ ఆశలు ఉన్నాయి. ఈ మూవీలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
డబ్బింగ్ సినిమాలు
సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న డబ్బింగ్ సినిమాలు జన నాయగన్, పరాశక్తి. దళపతి విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ అని ప్రకటించారు. దీనితో దళపతి విజయ్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు హిందీ వెర్సస్ తమిళ అనే కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ తో శివకార్తికేయన్ వస్తున్నాడు.

