- Home
- Entertainment
- Silk Smitha: సిల్క్ స్మిత కూడా బయట ఎప్పుడూ ఎక్స్పోజింగ్ చేయలేదు..శివాజీ, అనసూయ గొడవపై హీరో సుమన్ ట్విస్ట్
Silk Smitha: సిల్క్ స్మిత కూడా బయట ఎప్పుడూ ఎక్స్పోజింగ్ చేయలేదు..శివాజీ, అనసూయ గొడవపై హీరో సుమన్ ట్విస్ట్
శివాజీ, అనసూయ వివాదంపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇటీవల రాశి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా సీనియర్ నటుడు సుమన్ ఈ వివాదంలో తన అభిప్రాయం చెప్పారు.

శివాజీ వ్యాఖ్యల వివాదం
హీరోయిన్లు ధరించే బట్టలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి కారణం అయ్యాయి. శివాజీకి కౌంటర్ ఇస్తూ అనసూయ కామెంట్స్ చేయడం, సోషల్ మీడియా పోస్ట్ లు చేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి రాశి.. అనసూయ తన బాడీ గురించి రాశి గారి ఫలాలు అంటూ వల్గర్ గా మాట్లాడింది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఏవేవో పోస్ట్ లు పెడుతోంది అంటూ కౌంటర్ ఇచ్చింది.
స్పందించిన సుమన్
దీనితో రాశి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శివాజీ, అనసూయ వివాదంపై తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా స్పందించారు. శివాజీ సామాన్లు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అది తప్పే. దానికి శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదాన్ని మరో కోణంలో కూడా చూడాలి. సినిమాల్లో వేసుకునే డ్రెస్సులు, అక్కడ కనిపించే విధానం వేరు. కానీ బయటకి వచ్చినప్పుడు మాత్రం డ్రెస్సింగ్ జాగ్రత్తగా ఉండాలి. అది రీల్ లైఫ్.. ఇది రియల్ లైఫ్.
సినిమాల్లో వేసుకునే బట్టలు బయట వేసుకోరు
అప్పట్లో జయమాలిని, విజయలలిత, సిల్క్ స్మిత లాంటి డ్యాన్సర్లు సినిమాల్లో నటించేటప్పుడు, డ్యాన్స్ చేసేటప్పుడు ఆ రకమైన కాస్ట్యూమ్స్, మేకప్ వేసుకునేవాళ్ళు. బయట మాత్రం చాలా నార్మల్ గా కనిపించేవారు. నేను జ్యోతి లక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత లతో నటించాను. వాళ్ళు వర్క్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక దేవాలయం లాగా భావించేవారు. చాలా ప్రొఫెషనల్ గా ఉండేవారు. అక్కడ ఎలా కనిపించాలో అలా కనిపించి, ఎలా డ్యాన్స్ చేయాలో అలా చేసి వెళ్లేవారు.
అది కరెక్ట్ కాదు
సినిమాలో ధరించే బట్టలని బయట అస్సలు ధరించేవారు కాదు. బయట నార్మల్ గా కనిపించేవారు. బయట వివిధ రకాలుగా ఉండే జనాలు ఉంటారు. ఏదైనా జరిగిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదు. అందుకే సినిమా వేరు, నిజ జీవితం వేరు. సినిమాలో ధరించే బట్టలని బయట ధరించడం కరెక్ట్ కాదు అని సుమన్ అన్నారు.
మెచ్యూరిటీ వచ్చాకే అర్థం అవుతుంది
ఇప్పుడున్న యంగ్ స్టర్స్ కి సరైన గైడెన్స్ లేదు. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ వాళ్లకు అర్థం అవుతాయి అని సుమన్ పేర్కొన్నారు. సుమన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

