- Home
- Entertainment
- చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే జనాలు నవ్వుతారు, నోరు జారిన సంచలన డైరెక్టర్.. చివరికి రాంచరణ్ కి క్షమాపణలు
చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే జనాలు నవ్వుతారు, నోరు జారిన సంచలన డైరెక్టర్.. చివరికి రాంచరణ్ కి క్షమాపణలు
ఓ స్టార్ డైరెక్టర్ చిరంజీవి సినిమాపై సెటైర్లు వేసిన సంఘటన గతంలో వివాదానికి దారి తీసింది. ఆ డైరెక్టర్ చిరంజీవి సినిమా గురించి ఏమన్నారు ? చివరికి రాంచరణ్ కి ఎందుకు క్షమాపణలు చెప్పారు ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చిరంజీవి సందేశాత్మక సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. డ్యాన్సులు, ఫైట్స్ తో అలరించారు. కామెడీ చేశారు. మాస్ మసాలా సినిమాలతో పాటు స్వయంకృషి లాంటి అద్భుతమైన చిత్రాల్లో కూడా నటించారు. అదే విధంగా ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సందేశాత్మక సినిమాల్లో కూడా నటించారు.
చిరంజీవి రీ ఎంట్రీ మూవీ
శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. దీనితో చిరంజీవి దాదాపు 8 ఏళ్ళు సినిమాలు చేయలేదు. రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలికి చిరంజీవి తిరిగి ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
రాంచరణ్ నిర్మాతగా
తన తండ్రి రీ ఎంట్రీ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా నిర్మించారు. వివి వినాయక్ దర్శకుడు. ఈ చిత్రం రిలీజ్ కాకముందు టాలీవుడ్ లో గొప్ప దర్శకులలో ఒకరైన కోదండ రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. చిరంజీవి 150 వ సినిమా గురించి కోదండరామిరెడ్డి సెటైరికల్ గా మాట్లాడిన మాటలు తీవ్ర వివాదం కావడంతో పాటు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.
చిరంజీవితో అలాంటి సినిమా చేస్తా
విజయవాడలో ఓ కార్యక్రమంలో కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది మీడియా ప్రతినిధులు నన్ను అడిగారు. చిరంజీవితో మీరు 150 వ సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అని అడుగుతున్నారు. నేను చేస్తే యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కామెడీ కూడా ఉంటుంది. చిరంజీవి బాడీ మొత్తం మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. చాలా బాగా చేస్తారు. కానీ చిరంజీవి ఇప్పుడు సందేశాత్మక సినిమాలు చేస్తే ఎవ్వరూ చూడరు.
చిరంజీవి సందేశాలు ఇస్తే నవ్వుతారు
నేను జనాలకు అది చేస్తా, ఇది చేస్తా, రైతులకు అండగా ఉంటా అని అని సినిమాలు చేస్తే నవ్వుతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోదండరామిరెడ్డి మాటలకు అక్కడున్న వారు కూడా నవ్వారు. ఇది వివాదం కావడంతో రియలైజ్ అయిన కోదండరామిరెడ్డి ఆ తర్వాత బహిరంగంగా చిరంజీవికి, రాంచరణ్ కి, మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. నేను అలా మాట్లాడినందుకు చింతిస్తున్నాను. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. అలా ఫ్లోలో పొరపాటున కొన్ని మాటలు మాట్లాడాను. నాకు చిరంజీవి మంచి స్నేహితుడు. అతనికి, చిత్ర నిర్మాత రాంచరణ్ కి, మెగా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా అని కోదండరామిరెడ్డి అప్పట్లో స్పందించారు. అంతటితో వివాదం ముగిసింది. ఖైదీ నెంబర్ 150 మూవీ సూపర్ హిట్ అయింది.

