MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అప్పులు, ఈఎంఐల నుంచి బయటపడాలనుకుంటున్నారా.. అయితే ఈ మూవీ చూడాల్సిందే, కార్మేని సెల్వం ట్రైలర్ రివ్యూ

అప్పులు, ఈఎంఐల నుంచి బయటపడాలనుకుంటున్నారా.. అయితే ఈ మూవీ చూడాల్సిందే, కార్మేని సెల్వం ట్రైలర్ రివ్యూ

తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 26 2026, 10:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్మేని సెల్వం
Image Credit : Asianet News

కార్మేని సెల్వం

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ట్రైలర్ లాంచ్ ఈవెంట్
Image Credit : Asianet News

ట్రైలర్ లాంచ్ ఈవెంట్

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సముద్రఖనితో వర్క్ చేసిన తెలుగు డైరెక్టర్స్ ‘విమానం’ ఫేమ్ శివ ప్రసాద్, ‘రామం రాఘవం’ ఫేమ్ ధనరాజ్, ‘సేవ్ ద టైగర్స్’ ఫేమ్ తేజ కాకుమాను అతిథులుగా హాజరయ్యారు. ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మిడిల్ క్లాస్ ఫాదర్‌‌ క్యారెక్టర్ అనగానే మొదట గుర్తొచ్చేది సముద్రఖని గారి పేరే. ఈ కథ చూస్తుంటే డబ్బు చుట్టూ తిరుగుతుందనిపిస్తోంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని అన్నారు.

35
ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే
Image Credit : Asianet News

ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే

తేజ కాకుమాను మాట్లాడుతూ ..‘‘భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అని అన్నారు. ధనరాజ్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేస్తేనే మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.

45
యాక్టర్ సముద్రఖని
Image Credit : Asianet News

యాక్టర్ సముద్రఖని

ఈ సందర్భంగా వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని మాట్లాడుతూ..‘‘మనం లైఫ్‌ను చూసే విధానాన్ని ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు. ఇందులో కూడా డిఫరెంట్‌గా చూపించబోతున్నాం. రామ్ చక్రి వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన తనకు థ్యాంక్స్. లక్ష్మి ప్రియా, అభినయ పెర్ఫార్మెన్స్‌లు అందరికీ నచ్చుతాయి . సినిమా చూసి థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎమ్‌ఐలను కూడా తక్కువ చేసుకోవాలనుకుంటారు. మనపై ఉన్న బరువులను తగ్గించుకుంటేనే.. మన డ్రీమ్స్‌ను నెరవేర్చుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ వెల్త్‌గా ఉంటే కచ్చితంగా గెలుస్తారు అని చెప్పే చిత్రమిది”అని అన్నారు.

55
దర్శకుడు రామ్ చక్రి
Image Credit : Asianet News

దర్శకుడు రామ్ చక్రి

చిత్ర దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ ‘‘సముద్రఖని గారు ఈ చిత్రంలో డిఫరెంట్ వేరియేషన్స్‌ చూపించబోతున్నారు. మ్యూజిక్ ను కూడా సర్వీస్‌గా భావించి ఈ చిత్రానికి సంగీతం అందించారు రామానుజం గారు. నిర్మాత అరుణ్ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ అప్పులను తగ్గించుకుని ఆనందంగా ఉండాలని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం”అని అన్నారు. నిర్మాత అరుణ్ రంగరాజులు మాట్లాడుతూ..‘‘ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. మా డిస్ట్రిబ్యూషన్ పార్టనర్‌‌గా వ్యవహరిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌కు స్పెషల్ థ్యాంక్స్’’ అని అన్నారు. నటి అభినయ మాట్లాడుతూ..‘‘ఈ క్యారెక్టర్ చేయడం ప్రౌడ్ గా ఉంది. సముద్రఖని గారితో వర్క్ చేయడం గ్రేట్ హానర్ గా భావిస్తున్నా. ఆయన ఎలాంటి రోల్ అయినా చేయగలరు. అందరినీ అవేర్నెస్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. నటి లక్ష్మిప్రియా మాట్లాడుతూ..‘‘ ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. నేను పోషించిన శాంతి పాత్ర అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ఫ్యామిలీస్ అంతా కలిసి చూసేలా ఉంటుంది”అని చెప్పారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image2
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image3
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Related Stories
Recommended image1
Ram Charan: కంటి సర్జరీ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన రాంచరణ్.. గాయంతోనే అభిమానులకు గిఫ్ట్
Recommended image2
చిరంజీవి కోసం అల్లు అర్జున్ ఎంతకి తెగించాడో తెలుసా..అందరి ముందు అతడికి దిమ్మతిరిగే కౌంటర్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved