MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి

Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి

బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచే గాయత్రి గుప్తా తన జీవితంలో చోటు చేసుకున్న షాకింగ్‌ ఇన్సిడెంట్స్ ని పంచుకుంది. వంద సార్లకిపైగా తనపై రేప్‌ అటెంప్ట్ జరిగిందట. gayatri Gupta faced rape attempt more than 100 times own father beaten many times  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 30 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీలో అన్యాయాలపై ప్రశ్నిస్తున్న గాయత్రి గుప్తా
Image Credit : instagram@gayathrigupta

ఇండస్ట్రీలో అన్యాయాలపై ప్రశ్నిస్తున్న గాయత్రి గుప్తా

నటి గాయత్రి గుప్తా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. ఆమె క్యాస్టింగ్‌ కౌచ్‌ పై ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచింది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించింది. తనకే కాదు, ఇండస్ట్రీలో జరిగే అన్యాయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలో ఆమె కెరీర్‌ పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అవకాశాలను కోల్పోవల్సి వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం కమిట్‌ మెంట్‌ అడగడం, వేధింపులకు గురి చేయడం వల్ల తాను వాటిని బహిరంగంగా ప్రశ్నించింది. దీంతో ఇండస్ట్రీ దూరం పెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్
Image Credit : instagram@gayathrigupta

వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్

చాలా రోజుల తర్వాత ఆమె ఇటీవల `ఫస్ట్ టైమ్‌` అనే చిత్రంలో మెరిసింది. చిన్న పాత్రలో కాసేపు కనిపించింది. అయితే తాజాగా ఏసియానెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఇందులో ఆమె తన జీవితంలో జరిగిన దారుణాలను వెల్లడించింది. తనపై వందసార్లకుపై రేప్‌ అటెంప్ట్ జరిగిందని వెల్లడించింది. స్కూల్‌ దశలోనే తనని పెద్దవాళ్లు రేప్‌ చేయడానికి ప్రయత్నించారని వెల్లడించింది. ఆ భయంతో ఇంటికెళ్లి అమ్మానాన్నకి చెబితే వాళ్లు తిరిగి తననే కొట్టారని వెల్లడించింది. స్కూల్‌లోనే కాదు, ఇంటర్మీడియట్‌లోనూ మరోసారి రేప్‌ అటెంప్ట్ జరిగిందని వెల్లడించింది. అప్పుడు కూడా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా, తిరిగి తనపై దాడి చేశారని, సొంత తండ్రినే చితక్కొట్టినట్టు వెల్లడించింది గాయత్రి గుప్తా. ఆ తర్వాత హైయ్యర్‌ స్టడీస్‌ సమయంలో ఇలాంటిదే జరిగిందని,  నువ్వు రెచ్చగొట్టడం వల్లే అలా చేశారని రివర్స్ ఎటాక్‌ చేశారని చెప్పింది గాయత్రి.

Related Articles

Related image1
Mahesh Babu: జూ ఎన్టీఆర్‌ సజెస్ట్ చేశాడని సినిమా చేస్తే, కోలుకోలేని దెబ్బ తిన్న మహేష్‌ బాబు
Related image2
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
35
ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు
Image Credit : instagram@gayathrigupta

ఒంటరిగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు

ఇలా తన జీవితంలో ఇప్పటి వరకు వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్ జరిగిందని, ప్రతి దశలో వేధింపులకు గురవుతూనే ఉన్నానని, ఒంటరిగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి లోకువైపోయానని, ప్రతి ఒక్కడు తనని వాడుకోవాలనే చూశారని, ప్రేమని పంచలేకపోయారని తెలిపింది గాయత్రి గుప్తా. దీంతో తాను విసిగిపోయాయని, ఇలాంటివి జరిగితే ఇంట్లో చెప్పాలంటే వణికిపోయేదాన్ని అని ఆవేదన వ్యక్తం చేసింది గాయత్రి గుప్తా.

45
వివక్షపై పోరాడుతూనే ఉంటాను
Image Credit : instagram@gayathrigupta

వివక్షపై పోరాడుతూనే ఉంటాను

తమది చాలా సంపన్న కుటుంబం అని, తాతయ్య ఎమ్మెల్యేగా చేశాడని, కానీ ఆ రాజకీయాన్ని తండ్రి కొనసాగించలేకపోయాడని చెప్పింది. తాము ఐదుగురం అమ్మాయిలమని, అబ్బాయి పుట్టలేదనే బాధలో నాన్న తమని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టేవాడని, వేధించేవాడని తెలిపింది. కొందరిని బాగా చూసి, తనని తక్కువ చేసి చూసేవారని, దీంతో నరకం చూడాల్సి వచ్చిందని తెలిపింది గాయత్రి గుప్తా. ఇవన్నీ భరించలేక తాను ఇంటి నుంచి దూరమయ్యానని తెలిపింది. ఇప్పుడు ఇంటరిగానే పోరాడుతున్నానని, చిత్ర పరిశ్రమలో వివక్షపై పోరాడుతున్నానని, క్యాస్టింగ్‌ కౌచ్‌పై తన పోరాటం సాగుతుందని, తనకు ఇప్పుడు సపోర్ట్ పెరుగుతుందని, జెన్‌ జీ తనకు అండగా నిలుస్తున్నారని, భవిష్యత్‌లో తాను అనుకున్నది సాధిస్తానని తెలిపారు. మహిళలకు సమానత్వంపై మున్ముందు కూడా తన పోరాటం ఉంటుందని వెల్లడించింది గాయత్రి గుప్తా.

55
గాయత్రి గుప్తా చేసిన సినిమాలు
Image Credit : instagram@gayathrigupta

గాయత్రి గుప్తా చేసిన సినిమాలు

గాయత్రి గుప్తా `ఐస్‌ క్రీమ 2` తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఊహించని విధంగా ఇందులో నటిగా అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత `బందూక్‌`, `ఫిదా`, `జంధ్యాల రాసిన ప్రేమ కథ`, `కిస్‌ కిస్‌ బ్యాంగ్‌ బ్యాంగ్‌`, `మిఠాయి`, `అమర్‌ అక్బర్‌ ఆంటోని`, `కొబ్బరిమట్ట`, `సీత ఆన్‌ ది రోడ్‌` వంటి చిత్రాల్లో నటించింది. `సీత ఆన్‌ ది రోడ్‌` తన మనసుకు దగ్గరైన మూవీ అని చెప్పింది. అయితే తాను ఇప్పటి వరకు 30కిపైగా చిత్రాల్లో నటించానని, కానీ వాటిలో చాలా సినిమాలు విడుదల కాలేదని వెల్లడించింది గాయత్రి గుప్తా. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్టు ఏసియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌లో చాట్‌లో తెలిపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Mahesh Babu: జూ ఎన్టీఆర్‌ సజెస్ట్ చేశాడని సినిమా చేస్తే, కోలుకోలేని దెబ్బ తిన్న మహేష్‌ బాబు
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved