రాత్రి 9 తర్వాత కోట్లు ఇచ్చినా, సాయి పల్లవి మాత్రం ఆ పని చేయదని తెలుసా?
దాదాపు హీరోయిన్లు, యంగ్ యాక్ట్రస్ ఎవరైనా నైట్ అయితే పబ్ లు, క్లబ్ లు.. పార్టీలు అంటూ తెగ తిరుగుతుంటారు. నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సాయి పల్లవి మాత్రం రాత్రి 9 తరువాత ఏం చేస్తుందో తెలుసా? షాక్ అవుతారు?

సాయి పల్లవి రోజువారీ జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక డాక్టర్ అయ్యుండి సినిమాలపై ప్రేమను మాత్రం వదులుకోలేకపోతోంది సాయి పల్లవి. డాక్టర్ చదివినా... సినిమాల్లో రాణిస్తున్న సాయి పల్లవి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read: నయనతార తమ్ముడిగా పాన్ ఇండియా స్టార్ హీరో, సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్
సాయి పల్లవి
సాయి పల్లవి తన జీవనశైలి గురించి మాట్లాడుతూ, 'నేను రాత్రి 9 గంటలకు నిద్రపోయి, ఉదయం 4 గంటలకు మేల్కొంటాను. నేను ఎందుకు ఉదయం 4 గంటలకు మేల్కొంటానో నాకు తెలియదు, కానీ నేను చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు ఈ అలవాటు మొదలైంది' అన్నారు.
Also Read: షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.
సాయి పల్లవికి వచ్చిన అలవాటు
'నేను జార్జియాలో చదువుకుంటున్నప్పుడు, ఉదయం 3.30 గంటలకు నిద్రలేచి చదువుకునే అలవాటు ఉండేది. అందుకే నా శరీరం ఈ పద్ధతికి అలవాటు పడింది'.'కాలేజీ అయిపోయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా తొందరగా నిద్రలేస్తాను. పడుకోవడానికి ప్రయత్నించినా నిద్రపట్టదు. అందుకే ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి నా పనులు చేయడం మొదలుపెడతాను' అని చెప్పారు.
Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
ఉదయం 4 గంటలకే నిద్రలేచే సాయి పల్లవి
అలాగే 'చాలా సినిమాలు రాత్రంతా షూటింగ్ చేస్తారు, కానీ నేను 9 గంటల తర్వాత మేల్కొని ఉండలేను. నా ఈ అలవాటు చూసి డైరెక్టర్లు నేను చిన్నపిల్లలా ఉన్నానని అంటారు. ఎందుకంటే నేను రాత్రి 9 గంటలకు నిద్రపోతాను. ఇది రాత్రి షూటింగ్‌లో నాకు సమస్యగా ఉన్నా, దీన్ని మంచి అలవాటుగానే చూస్తాను' అని సాయి పల్లవి చెప్పారు.
Also Read: ప్రభాస్ కు అన్న గా స్టార్ హీరో, స్పిరిట్ మూవీ కోసం సందీప్ రెడ్డి ప్లాన్ మామూలుగా లేదుగా
సాయి పల్లవి
సాయి పల్లవి సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే ఎంచుకుని నటిస్తుంది. ఆమె నటించే సినిమాలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. గత సంవత్సరం ఆమె నటించిన అమరన్, ఈ సంవత్సరం విడుదలైన తండేల్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి.
Also Read: విజయ్ దళపతి Vs శివ కార్తికేయన్, బాక్సాఫీస్ పోరుకి సై అంటున్న స్టార్ హీరోలు
2025లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా సాయి పల్లవి
ప్రస్తుతం బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న సాయి పల్లవి రణబీర్ కపూర్ సరసన రామాయణం సినిమాలో, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. పారితోషికం విషయంలో కూడా నయనతార, సమంతాలను దాటేసి రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీని ద్వారా 2025లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా సాయి పల్లవి నిలిచారు.