MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్

Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్

Gunasekhar: గుణశేఖర్ తన కెరీర్ లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ దర్శకుడిగా గుర్తింపు పొందారు. చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలతో సూపర్ హిట్స్ అందుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 06 2026, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Anushka Shetty
Image Credit : Asianet News

Anushka Shetty

టాలీవుడ్ లో క్రేజీ దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఒకప్పుడు ఆయన క్రియేటివిటీ, సినిమాల్లో ఉపయోగించే సెట్స్, దర్శకత్వం ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉండేవి. కానీ ఇటీవల గుణశేఖర్ వరుస పరాజయాలతో వెనుకబడ్డారు. తన కెరీర్ మొత్తం వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు బాల రామాయణం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మహేష్ బాబుతో ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చేశారు. మహేష్ ని మాస్ హీరోగా మార్చిన సినిమా అదే. భారీ బడ్జెట్ లో రుద్రమ దేవి మూవీ చేసి మెప్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రుద్రమ దేవి మూవీ
Image Credit : our own

రుద్రమ దేవి మూవీ

తన కెరీర్ లో ఎదురైన ఛాలెంజ్ ల గురించి చెబుతూ ఓ ఇంటర్వ్యూలో గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు సక్సెస్ లో లేకపోయినా ఇంత భారీ బడ్జెట్ లో రుద్రమదేవి మూవీని ఏ ధైర్యంతో చేశారు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా గుణశేఖర్ సమాధానం ఇచ్చారు. రుద్రమదేవి ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ఐడియా కాదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఈ సినిమా చేయాలని అనుకున్నా.

35
అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు
Image Credit : our own

అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు

కానీ ఈ సినిమా చేయడానికి ముందుగా మనం కొంచెం మార్కెట్ సంపాదించుకోవాలి అని అర్థం అయింది. ఒక్కడు బ్లాక్ బస్టర్ అయ్యాక సౌత్ ఇండియాలోనే ఏ దర్శకుడికీ లేని విధంగా హైయెస్ట్ రెమ్యునరేషన్ నాకు ఆఫర్ చేశారు. అప్పుడు అనిపించింది.. రుద్రమ దేవి మూవీ చేయడానికి తగ్గ మార్కెట్ మనకు ఏర్పడింది అని. నాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన నిర్మాతలకు రుద్రమదేవి మూవీ గురించి చెప్పాను. అప్పుడు వాళ్ళు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఎందుకు సార్..అదే ఎవరైనా స్టార్ హీరోని పెట్టి ఇదే స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా చేయండి మేము డబ్బు పెడతాం అని అన్నారు.

45
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే హేళన చేశారు
Image Credit : Instagram/@anushkashettyofficial

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే హేళన చేశారు

హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో నాకు మార్కెట్ ఉన్నా ఎవరూ ఒప్పుకోలేదు. ఇది మనం సొంతం గా చేయాల్సిన సినిమా అని అప్పుడు నాకు అర్థం అయింది. నేను ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ ఇది సరైన టైం అని భావించి రుద్రమదేవి తెరకెక్కించినట్లు గుణశేఖర్ తెలిపారు. సొగసు చూడ తరమా మూవీ హిట్ తర్వాత కూడా నాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ మూవీ మంచి హిట్ అయింది. అది నరేష్ హీరోగా చేసిన సినిమా. ఆ టైంలో నరేష్, రాజేంద్ర ప్రసాద్ పోటా పోటీగా ఉన్నారు.

55
ఎన్టీఆర్ సినిమా వల్లే చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు
Image Credit : sun nxt

ఎన్టీఆర్ సినిమా వల్లే చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు

వెంటనే రాజేంద్రప్రసాద్ తో సినిమా చేయండి అంటూ నిర్మాతలు అడ్వాన్స్ తో నా వద్దకు వచ్చారు. కానీ నేను వాళ్లకు బాల రామాయణం ఐడియా చెప్పాను. మైథలాజి సినిమా అంటున్నారు పైగా చిన్న పిల్లలతో రిస్క్ ఎందుకు సార్.. సొగసు చూడ తరమా తరహాలో మంచి సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించుకోండి అని సలహా ఇచ్చారు. కానీ బాల రామాయణం సినిమాకి ఎంత పొటెన్షియల్ ఉందో వాళ్లకు అర్థం కాలేదు. ఆ సినిమా వల్లే నాకు చిరంజీవి గారితో చూడాలని ఉంది మూవీ చేసే ఛాన్స్ దక్కింది అని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరు? రాజమౌళి చెప్పిన రహస్యం..
Recommended image2
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image3
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Related Stories
Recommended image1
Naga Vamsi: ఆదర్శ కుటుంబం వాయిదా..చుట్టమల్లే సాంగ్ ఏఐ వీడియో వివాదం, ఇన్వాల్వ్ కాబోతున్న పవన్ కళ్యాణ్
Recommended image2
Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved