MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్

Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్

Ram Charan: రాంచరణ్ మూవీ వల్ల తన సినిమా ఫ్లాప్ అయింది అని డైరెక్టర్ పరశురామ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా బావున్నప్పటికీ తన భార్యకు కూడా నచ్చలేదు అని అన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 05 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan
Image Credit : Asianet News

Ram Charan

కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ సినిమాల తాకిడి వల్ల ఇతర సినిమాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. టాలీవుడ్ లో అలా ఎఫెక్ట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఏదైనా మూవీ థియేటర్స్ లో ప్రభంజనం సృష్టిస్తుంటే దానికి పోటీగా వెళ్ళినప్పుడు మంచి సినిమాలు కూడా నష్టపోతుంటాయి. అలాంటి అనుభవం తనకు ఎదురైంది అని డైరెక్టర్ పరశురామ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పరశురామ్ తొలి చిత్రం ఇదే
Image Credit : Asianet News

పరశురామ్ తొలి చిత్రం ఇదే

పరశురామ్ దశరథ్, పూరి జగన్నాధ్ లాంటి క్రేజీ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి దర్శకుడిగా ఎదిగారు. రవితేజ హీరోగా తెరకెక్కించిన ఆంజనేయులు మూవీతో పరశురామ్ దర్శకుడిగా మారారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. సోనూసూద్, ప్రకాష్ రాజ్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.

35
మగధీర వల్లే ఫ్లాప్
Image Credit : Asianet News

మగధీర వల్లే ఫ్లాప్

పరశురామ్ మాట్లాడుతూ.. ఆంజనేయులు మూవీ పరాజయానికి కారణం కంటెంట్ కాదు.. రిలీజ్ టైమింగే కారణం. సినిమా బాగలేక ఫ్లాప్ అవ్వలేదు.. ఆ మూవీ పరాజయానికి కారణం రాంచరణ్ మగధీర అని పరశురామ్ తెలిపారు. మగధీర విడుదలైన 10 రోజుల వ్యవధిలో ఆంజనేయులు సినిమాని రిలీజ్ చేశారు. అప్పటికి ఇంకా మగధీర వేడి తగ్గలేదు.

45
నా భార్య తిట్టేసింది
Image Credit : Asianet News

నా భార్య తిట్టేసింది

దీనికి తోడు సినిమా ఓవరాల్ గా బాగానే ఉన్నా.. అక్కడక్కడా కొన్ని తప్పులు చేశా. నేను యంగ్ ఏజ్ లో ఉండడంతో శ్రుతి మించి కొన్ని డైలాగులు రాశా. వాటిలో కొన్ని అసభ్యంగా ఉన్నవి ఉన్నాయి. సినిమా చూసి నా భార్య కూడా తిట్టేసింది. ఏంటి ఆ డైలాగులు అని అడిగింది. హ్యూమర్ కోసం ఆ డైలాగులు రాశాను. కానీ నా ఇంట్లో వాళ్లే నన్ను తిడతారని అనుకోలేదు.

55
రియలైజ్ అయ్యా, రూట్ మార్చా
Image Credit : IMDB

రియలైజ్ అయ్యా, రూట్ మార్చా

ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. నేను చేయాల్సిన సినిమాలు ఇలాంటివి కాదు. ఒక హీరో.. ఒక విలన్, నాలుగు ఫైట్స్ చేయడానికి అప్పటికే ఇండస్ట్రీలో 15 మంది దాకా దర్శకులు ఉన్నారు. కాబట్టి నేను కూడా అలాంటివే చేస్తే వర్కౌట్ కాదు అని భావించి సాఫ్ట్ లవ్ స్టోరీ జోనర్ లోకి వచ్చాను అని పరశురామ్ తెలిపారు. ఆ తర్వాత పరశురామ్ సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: అక్కినేనిది నాగుపాము పగ, ఆ హీరోపై ప్రతీకారం.. ఏఎన్నార్‌ నిజస్వరూపం బయటపెట్టిన రైటర్‌
Recommended image2
Rakul Preet Singh: ఐటీ దాడుల విషయంలో నోరు విప్పిన రకుల్ ప్రీత్ సింగ్, ఇచ్చిపడేసిందిగా..
Recommended image3
Crime Thriller: 3 కోట్ల బడ్జెట్... 60 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Related Stories
Recommended image1
OTT: ఓటీటీలో ఈ వారం మతిపోగొట్టే సినిమాలు రెడీ, సుహాస్ మూవీకి ఐఎండీబీలో 9 రేటింగ్.. అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved