MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నదియా, ఖుష్బూ 'ఏ' కేటగిరీ.. మేము 'బి' కేటగిరీ.. డైరెక్టర్లు అలా అంటున్నారు, నటి రజిత ఆవేదన

నదియా, ఖుష్బూ 'ఏ' కేటగిరీ.. మేము 'బి' కేటగిరీ.. డైరెక్టర్లు అలా అంటున్నారు, నటి రజిత ఆవేదన

సీనియర్ నటి రజిత 'దొంగనా కొడుకు' మూవీ టీజర్ లాంచ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్లని అవకాశాలు అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే సమాధానం బాధించే విధంగా ఉంది అని తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 21 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Actress Rajitha
Image Credit : Asianet News

Actress Rajitha

ప్రముఖ నటి రజిత టాలీవుడ్ లో దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. వందల సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. తల్లి, అత్త, వదిన తరహా పాత్రల్లో ఆమె ఎక్కువగా నటించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, ఎఫ్ 2, ప్రతిరోజూ పండగే, సంక్రాంతికి వస్తున్నాం ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. రజిత నటించిన లేటెస్ట్ మూవీ దొంగ నా కొడుకు. ఈ చిత్రంలో యుంగ్ సెన్సేషన్ మౌళి తనూజ్ హీరో.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మీరు రెగ్యులర్ అంటున్నారు
Image Credit : Asianet News

మీరు రెగ్యులర్ అంటున్నారు

ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ మూవీలో రజిత, కమెడియన్ అలీ.. మౌళి కి తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ రజిత ఆసక్తికర వ్యాఖలు చేశారు. తమలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇటీవల అవకాశాలు తగ్గిపోయిన అంశాన్ని ఆమె ప్రస్తావించారు. 96, 97 నాకు గోల్డెన్ పీరియడ్. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేశా. ఇటీవల ఛాన్సులు తగ్గాయి. దర్శకులని అవకాశాలు అడుగుతుంటే మీరు రెగ్యులర్ అయిపోయారు అనే మాట అంటున్నారు. అది చాలా బాధగా ఉంది.

35
ఇది నాకు కంబ్యాక్
Image Credit : Asianet News

ఇది నాకు కంబ్యాక్

ఆడియన్స్ కొత్త వాళ్ళని కోరుకుంటున్నారు అట. కానీ మేల్ ఆర్టిస్టుల విషయంలో మాత్రం రెగ్యులర్, రొటీన్ అనే మాట రాదు. బయట ఆడియన్స్ మాత్రం మీరు మరిన్ని సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నారు. ఇది దర్శకులే ఆలోచించుకోవాలి. ఈ సినిమా నాకు ఒక కంబ్యాక్ అని భావిస్తున్నా.

45
అది బాధగా ఉంది
Image Credit : Asianet News

అది బాధగా ఉంది

ఇటీవల కూడా కొన్ని సినిమాలు చేశాను. కానీ ఎక్కడెక్కడ నుంచో కొత్త వాళ్ళని తీసుకువచ్చి వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బాధగా అనిపించింది. మా డైరెక్టర్ శ్రీను కంబాల గారు ఈ మూవీలో అవకాశం ఇచ్చారు. ఆయన ఆలోచించినట్లే మిగిలిన దర్శకులు కూడా అలోచించి ఫీమేల్ ఆర్టిస్ట్ లకు అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నా.

55
వాళ్ళు 'ఏ' కేటగిరీ
Image Credit : Asianet News

వాళ్ళు 'ఏ' కేటగిరీ

నదియా, కుష్బూ లాంటి వాళ్ళు చేసే పాత్రలకు నన్ను తీసుకోమని నేను అడగను. వాళ్ళు 'ఏ' కేటగిరి. మేము 'బి' కేటగిరి కిందికి వస్తాము. కానీ మరీ దారుణంగా 'సి' కేటగిరి రేంజ్ కాదు. బి కేటగిరి రేంజ్ లో అవకాశాలు ఇవ్వమని దర్సకులు ఈ స్టేజీ మీది నుంచి రిక్వస్ట్ చేస్తున్నా అని రజిత అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rithvik Jothi Raj: రజనీకాంత్ ఆన్ స్క్రీన్ మనవడు, 13 ఏళ్లకే ఏం చేస్తున్నాడో తెలుసా..వీడు మామూలోడు కాదే
Recommended image2
Nithiin Super Hit Movie: నితిన్ సూపర్ హిట్ మూవీకి రచయిత, తీవ్ర అవమానం.. సారీ కూడా చెప్పకుండా ఏం చేశారంటే
Recommended image3
Youtuber Nandu: 4 వేల వీడియోతో, 120 ఛానెల్స్ మాపై దాడి చేశాయి, ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన నందూస్ వరల్డ్ రమా నందన
Related Stories
Recommended image1
Nithiin Super Hit Movie: నితిన్ సూపర్ హిట్ మూవీకి రచయిత, తీవ్ర అవమానం.. సారీ కూడా చెప్పకుండా ఏం చేశారంటే
Recommended image2
Rithvik Jothi Raj: రజనీకాంత్ ఆన్ స్క్రీన్ మనవడు, 13 ఏళ్లకే ఏం చేస్తున్నాడో తెలుసా..వీడు మామూలోడు కాదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved