MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • AK47: 20 ఏళ్ళ తర్వాత మ్యాజిక్, ఆదర్శ కుటుంబంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో

AK47: 20 ఏళ్ళ తర్వాత మ్యాజిక్, ఆదర్శ కుటుంబంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ..ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో

కుటుంబ బంధాలు, వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌తో కూడిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి పండుగ వాతావరణంలో థియేటర్లలో వినోదాల సందడి చేయనుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 21 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47
Image Credit : Asianet News

ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదం, హాస్యం, యాక్షన్‌తో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం సిద్ధమవుతోంది. దీపావళి పండుగకు ముందు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు పండుగ వినోదాన్ని అందించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో..
Image Credit : Asianet News

20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో..

దాదాపు 20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మధ్యతరగతి కుటుంబ జీవితంలోని సహజమైన సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, చమత్కారమైన సంభాషణలు, హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా ఈ చిత్రం ఉండబోతోందనే సంకేతాలను టీజర్ అందించింది.

35
వినోదాత్మక చిత్రంగా ఆదర్శ కుటుంబం
Image Credit : Asianet News

వినోదాత్మక చిత్రంగా ఆదర్శ కుటుంబం

కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథాంశంతో, అన్ని తరాల వారినీ ఆకట్టుకునే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ రూపొందుతోంది. పాటలు, టీజర్‌కు లభిస్తున్న స్పందనతో పాటు వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఉన్న ఆసక్తి సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

45
నటీనటులు
Image Credit : Asianet News

నటీనటులు

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

55
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై..
Image Credit : Asianet News

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై..

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ.ఎస్. ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కెవిన్ కుమార్ ఫైట్స్‌ను రూపొందించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నదియా, ఖుష్బూ 'ఏ' కేటగిరీ.. మేము 'బి' కేటగిరీ.. డైరెక్టర్లు అలా అంటున్నారు, నటి రజిత ఆవేదన
Recommended image2
Rithvik Jothi Raj: రజనీకాంత్ ఆన్ స్క్రీన్ మనవడు, 13 ఏళ్లకే ఏం చేస్తున్నాడో తెలుసా..వీడు మామూలోడు కాదే
Recommended image3
Nithiin Super Hit Movie: నితిన్ సూపర్ హిట్ మూవీకి రచయిత, తీవ్ర అవమానం.. సారీ కూడా చెప్పకుండా ఏం చేశారంటే
Related Stories
Recommended image1
నదియా, ఖుష్బూ 'ఏ' కేటగిరీ.. మేము 'బి' కేటగిరీ.. డైరెక్టర్లు అలా అంటున్నారు, నటి రజిత ఆవేదన
Recommended image2
Nithiin Super Hit Movie: నితిన్ సూపర్ హిట్ మూవీకి రచయిత, తీవ్ర అవమానం.. సారీ కూడా చెప్పకుండా ఏం చేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved