- Home
- Entertainment
- ఆ సాంగ్ వల్ల తన సినిమా నుంచి రోజాని తొలగించిన చిరంజీవి.. ఇండస్ట్రీ హిట్ అయిన ఆ మూవీ ఏంటో తెలుసా ?
ఆ సాంగ్ వల్ల తన సినిమా నుంచి రోజాని తొలగించిన చిరంజీవి.. ఇండస్ట్రీ హిట్ అయిన ఆ మూవీ ఏంటో తెలుసా ?
చిరంజీవితో రోజా ఒక ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని మిస్ అయింది. ఒక్క సాంగ్ వల్ల చిరంజీవి రోజాని తప్పించి మరో హీరోయిన్ ను తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి, రోజా కాంబినేషన్
మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రోజా కాంబినేషన్ లో కొన్ని చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, రోజా లది సూపర్ హిట్ కాంబినేషన్ ఏమీ కాదు. వీరి కాంబోలో వచ్చింది బిగ్ బాస్ తీవ్రంగా నిరాశపరిచింది. ముగ్గురు మొనగాళ్లు, ముఠామేస్త్రి చిత్రాలు పర్వాలేదనిపించాయి. వీరిద్దరి కాంబోలో ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ మిస్ అయింది. అసలు ఈ చిత్రం ఏంటి ? ఎందుకు మిస్ అయింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రికార్డులు తిరగరాసిన ఘరానా మొగుడు
చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఘరానా మొగుడు మూవీ 1992లో విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్, నగ్మా హీరోయిన్లుగా నటించారు.
ఘరానా మొగుడులో ముందుగా రోజాకి ఛాన్స్
వాస్తవానికి వాణి విశ్వనాథ్ స్థానంలో ఈ మూవీలో రోజా నటించాల్సింది. రోజాని ఎంపిక చేశారట కూడా. కానీ ఘరానా మొగుడు మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి వాణి విశ్వనాథ్ నటించిన సర్పయాగం అనే చిత్రం విడుదలైంది. పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో రాజా రవీంద్ర, వాణి విశ్వనాథ్ మధ్య దిగు దిగు నాగ అనే బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటుంది.
ఒక్క సాంగ్ తో రోజా కొంప ముంచిన వాణి విశ్వనాథ్
ఈ సాంగ్ లో వాణి విశ్వనాథ్ గ్లామర్ ఒలకబోస్తూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులు మాత్రమే కాదు వాణి విశ్వనాథ్ పెర్ఫార్మెన్స్ కి చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. దీనితో రోజాని తొలగించి ఆమె స్థానంలో వాణి విశ్వనాథ్ ని ఘరానా మొగుడు చిత్రంలో తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సర్పయాగంలో వాణి విశ్వనాథ్ తో నటించింది అతడే.
రోజాకి ఇండస్ట్రీ హిట్ మిస్
వాణి విశ్వనాథ్, చిరంజీవి మధ్య ఘరానా మొగుడు చిత్రంలో వచ్చే రైన్ సాంగ్ కిటుకులు తెలిసిన అనే పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో ది బెస్ట్ సాంగ్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సాంగ్ లో వాణి విశ్వనాథ్ గ్లామర్, చిరంజీవి డ్యాన్స్.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి. మొత్తంగా వాణి విశ్వనాథ్ సర్పయాగం మూవీలో ఒక్క సాంగ్ తో రోజా స్థానానికి ఎసరు పెట్టింది. ఆ విధంగా రోజా చిరంజీవితో ఇండస్ట్రీ హిట్ మూవీ మిస్ అయింది.