Illu Illalu Pillalu Today Episode Jan 12: అమూల్య నిశ్చితార్థం చెడగొట్టమని విశ్వ వల్లికి కొత్త ప్లాన్ ఇస్తాడు. ఆ ప్లాన్ లో భాగంగా అమూల్యతో కలిసి ఉన్న ఫోటోలు ఇస్తాడు. ఇక వల్లి ఆ బాధ్యతను తన తల్లికి ఇస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.
Illu Illalu Pillalu Today Episode Jan 12: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య పెళ్లి చెడగొట్టేందుకు విశ్వ కొత్త ప్లాన్ తో వస్తాడు. ఆ కొత్త ప్లాన్ ను వల్లికి చెపుతాడు. వల్లి చేతికి అమూల్య, విశ్వ.. క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఇస్తాడు. వాటిని చూసి వల్లి షాక్ అవుతుంది. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి పరుగులు తీస్తుంది. ఇడ్లీ బాబాయి, భాగ్యం కూడా ఆ ఫోటోలు చూసి షాక్ అయిపోతారు. వల్లి విశ్వక్ ఈ ఫోటోలను ఇచ్చి అమూల్య పెళ్లిని చెడగొట్టమని చెప్పాడని.. లేకుంటే ఈ ప్రేమ వ్యవహారానికి నేనే కారణం అని మా మామయ్యకి చెప్పేస్తానని బెదిరించాడని చెబుతుంది. దీంతో భాగ్యం ఆ ఫోటోలు చూసి పెళ్లి చెడగొట్టే బాధ్యత నాది.. ఆ నిశ్చితార్ధాన్ని చెడగొడతాను అని కూతురికి మాట ఇస్తుంది. దాంతో వల్లి ప్రశాంతంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
విశ్వను తిట్టిన వల్లి
ఇక ప్రేమ.. ధీరజ్ ను ఎలాగైనా కూల్ చేయాలని ప్రయత్నిస్తుంది. అందుకోసం డిపి అని ఒక లవ్ సింబల్ వేసి రాస్తుంది. తలుపుపై ఆ లవ్ సింబల్ ను రాయడం వల్ల ధీరజ్ చూస్తాడని అనుకుంటుంది. ధీరజ్ తలుపుపై రాసిన లవ్ సింబల్ ను చూసి ఆ కాగితాన్ని చింపి కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు. ఇక ఇక్కడి నుంచి సీను వల్లి దగ్గరికి మారుతుంది. వల్లి రాత్రి బయట తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వ వాళ్ళ ఇంటి వైపు చూస్తూ వాడిని తిడుతుంది. నువ్వేం మనిషివిరా, కాపురాలు కూల్చేలా ఉన్నావు, ఇదేనా చివరి తప్పు, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను.. నీవల్ల నా జీవితం నాశనం అయిపోతుంది, నా బావకి నన్ను దూరం చేస్తే ఎవరిని వదిలిపెట్టను అని తిడుతూ ఉంటుంది. ఈ లోపు నర్మద, ప్రేమ చూసి అక్కడికి వస్తారు.
నర్మద వల్లికి వార్నింగ్
ప్రేమ ‘ఏంటి.. మా ఇంటి వైపు చూసి మంత్రాలు చదువుతున్నావ్’ అని అంటుంది. దానికి వల్లి నేనేం మంత్రాలు చదవడం లేదు చలికి వణుకుతున్నాను అంతే అంటుంది. ఈ లోపు నర్మద వచ్చి నిన్ను చూస్తుంటే ఏదో తప్పు చేసినట్లు అనిపిస్తోంది అదేంటో చెప్పు అని అడుగుతుంది. దానికి వల్లి తనే తప్పు చేయలేదని, ఏ పని చేసినా మంచి కోసమే చేస్తానని అంటుంది. దాంతో నర్మద ‘ఇప్పటికే నువ్వు ఎన్నో తప్పులు చేసావు.. కానీ నువ్వు మా మనిషివే, ఇంట్లో మనిషివే అని క్షమించి వదిలేసాము. ఈసారి ఇంట్లో జరిగే శుభకార్యానికి నీవల్ల ఏదైనా జరిగితే మాత్రం ఇంట్లో మనిషి అని కూడా చూడను. ఏ పాపం చేసినా ఇకపై క్షమించడం అనేది ఉండదు. ఎవరైనా కూడా మావయ్య విషయంలో ఏమైనా చేస్తే మీ పని అయిపోతుంది’ అని ఇద్దరు తోటి కోడళ్లు వల్లికి వార్నింగ్ ఇస్తారు. ఇక ప్రేమ, నర్మద అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది విన్నాక వల్లికి ఏడుపొచ్చి ముందు చూస్తే నా ఈ వెనుక చూస్తే గొయ్యి అని బాధపడుతూ ఉంటుంది.
ఇక ధీరజ్ ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు. అక్కడికి ప్రేమ వచ్చి ధీరజ్ తెల్లటి టీ షర్ట్ పై లవ్ సింబల్ వేసి ఆ లవ్ సింబల్ లో డిపి అని అక్షరాలు ఆంగ్లంలో రాస్తుంది. ఇక ఉదయం లేచాక ధీరజ్ ఇంటి బయటకి వస్తాడు. లవ్ సింబల్ చూసి సాగర్ కూడా తనకు అలా రాయమని అడుగుతాడు. ఏమీ అర్థం కాక ఊరుకుంటాడు ధీరజ్. తర్వాత చందు కూడా చూసి అదిరిపోయింది రా అని అంటాడు. నర్మద కూడా సూపర్ ధీరజ్ అనేసి వెళ్ళిపోతుంది. తిరుపతి వచ్చి ధీరస్ ప్రేమ డిపి సూపర్ అని అంటాడు. తిరుపతిని పట్టించుకోకుండా ధీరజ్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత వల్లి ఆ టీషర్ట్ ను చూస్తుంది. ఇక ధీరజ్తో నీకు మీ భార్యపై ప్రేమ ఉందని అందరికీ తెలియాలా? నీకు తెలిస్తే సరిపోదా అంటుంది. అప్పుడు ధీరజ్ ఏంటి వదిన అని అడుగుతాడు. అప్పుడు టీ షర్టు మీద డిపి అని రాసి ఉన్నట్టు చెబుతుంది. వల్లి దాంతో ధీరజ్ టీషర్ట్ తీసి చూస్తాడు. ఆ పని చేసింది ప్రేమే అని అర్థం అయిపోతుంది. ఇక అందరూ ధీరజ్ ఆ డీపీ విషయంలో ఏడిపిస్తారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.


