చిరంజీవికి ఉన్న ఏకైక క్రేజీ హ్యాబిట్ ఏంటో తెలుసా.? అది మనవరాలు నేర్పించిందట..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

సినీ బ్యాగ్రౌండ్ లేకుండా..
సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పలు ఫెయిల్యూర్స్ వచ్చినా.. వరుసపెట్టి సక్సెస్‌లు అందుకుని.. స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. తాజాగా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నారు. అటు 'విశ్వంభర' గానూ తన సత్తా చాటనున్నారు.
ఆ కామెంట్స్ వైరల్..
అటు హీరోగా ఒకవైపు సినిమాలు.. ఇటు పలు సేవా కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా విచ్చేస్తూ యువతకు కావాల్సిన గైడెన్స్ ఇస్తున్న చిరంజీవి.. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. తనకున్న క్రేజీ హ్యాబిట్ గురించి ఆయన చెప్పారు.
యూట్యూబ్‌లో ఏం చూస్తారంటే.?
ఇప్పుడు ప్రతీఒక్కరూ సోషల్ మీడియాలోనే తమ సమయాన్ని గడుపుతున్నారు. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ ఏదొకటి ఓపెన్ చేసి కాలక్షేపం చేస్తున్నారు. చిరంజీవికి కూడా యూట్యూబ్ చూసే అలవాటు ఉందట. ఆయన యూట్యూబ్ లో ఏం చూస్తారు అనే విషయాల గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ క్రేజీ అలవాటు చిరంజీవికి ఉందా అని ఆశ్చర్యపోతారు.
యూట్యూబ్‌లోచూసేది ఇదే..
చిరంజీవి యూట్యూబ్‌లో తమిళ విలేజ్ కుకింగ్ షో వీడియోలు చూస్తుంటారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను విలేజ్ కుకింగ్ వీడియోస్ చూస్తానని.. ఇవి చూడటం మా మనవరాలు నేర్పించిందని చెప్పుకొచ్చారు. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇండస్ట్రీలోనే స్టార్ హీరో.. వీకెండ్ వచ్చిందంటే చాలు యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోస్ చూసి ప్రతీది ఇంట్లో ట్రై చేస్తారేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమాలు ఇవే..
చిరంజీవి నటించిన 'మనశంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

