- Home
- Entertainment
- రాఘవేంద్ర రావుని శ్రీదేవి కోరిన చివరి కోరిక ఏంటో తెలుసా.. ఆమెకి అలాంటి చావు రాకుండా ఉండాల్సింది
రాఘవేంద్ర రావుని శ్రీదేవి కోరిన చివరి కోరిక ఏంటో తెలుసా.. ఆమెకి అలాంటి చావు రాకుండా ఉండాల్సింది
Raghavendra Rao and Sridevi: శ్రీదేవి చివరి కోరిక ఏంటో రాఘవేంద్ర రావు బయటపెట్టారు. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించారు. రాఘవేంద్ర రావు అసలేం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం.

మూడు తరాల హీరోలతో వర్క్ చేసిన రాఘవేంద్ర రావు
తెలుగు సినిమా లెజెండ్రీ దర్శకులలో రాఘవేంద్ర రావు ఒకరు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు ఇలా మూడు తరాల హీరోలతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో, చిరంజీవితో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రాఘవేంద్ర రావు, శ్రీదేవి లది క్రేజీ కాంబినేషన్.
శ్రీదేవితో 24 సినిమాలు
శ్రీదేవి గ్లామరస్ గా చూపించిన దర్శకులలో రాఘవేంద్ర రావు ప్రధానంగా ఉంటారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీదేవి ఏకంగా 24 చిత్రాల్లో నటించింది. వీటిలో వేటగాడు, పదహారేళ్ళ వయసు, దేవత, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆఖరి పోరాటం ఇలా ఎన్నో మెమొరబుల్ ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని రాఘవేంద్ర రావు గుర్తు చేసుకున్నారు.
రాఘవేంద్రరావుని శ్రీదేవి కోరిన చివరి కోరిక
రాఘవేంద్ర రావు మాట్లాడుతూ .. 'శ్రీదేవి చివరగా నటించిన మామ్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో నన్ను కలిసింది. ఇప్పటికే మన కాంబినేషన్ లో 24 చిత్రాలు వచ్చాయి. మీ దర్శకత్వంలో 25వ చిత్రంలో నటించాలని ఉంది అని నా కాళ్లకు నమస్కారం పెట్టి అడిగింది. నేను కూడా శ్రీదేవితో 25వ సినిమా ప్లాన్ చేయాలి అని అనుకున్నా. కానీ ఇంతలోనే ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది.
అలాంటి చావు రాకుండా ఉండాల్సింది
చిత్ర పరిశ్రమకు అంత సేవ చేసిన నాటికి అలాంటి చావు రాకుండా ఉండాల్సింది' అని రాఘవేంద్ర రావు ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి భర్త బోనీ కపూర్ బాలీవుడ్ లో బడా నిర్మాత.
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్
ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ నటీమణులుగా రాణిస్తున్నారు. జాన్వీ కపూర్ అయితే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడిగా పెద్ది చిత్రంలో నటిస్తోంది.