MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నందమూరి హీరోలు ఖాకీ చొక్కా వేస్తే మూవీ బ్లాక్ బస్టర్.. పెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ వరకు రఫ్ఫాడించారు

నందమూరి హీరోలు ఖాకీ చొక్కా వేస్తే మూవీ బ్లాక్ బస్టర్.. పెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ వరకు రఫ్ఫాడించారు

నందమూరి హీరోలు పోలీస్ పాత్రల్లో నటిస్తే ఆ చిత్రాలు సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు. నందమూరి హీరోలు ఖాకీ డ్రెస్ లో నటించిన సినిమాల జాబితా ఈ కథనంలో ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 18 2025, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
పోలీస్ పాత్రల్లో నందమూరి హీరోలు 
Image Credit : Asianet News

పోలీస్ పాత్రల్లో నందమూరి హీరోలు 

నందమూరి హీరోలు పోలీస్ పాత్రల్లో నటించిన ప్రతిసారీ మంచి ఫలితాలు వచ్చాయి. నందమూరి తారక రామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ ఖాకీ డ్రెస్ లో ఫైర్ చూపించారు. నందమూరి హీరోలు పోలీస్ అధికారులుగా నటించిన సినిమాలు, వాటి విజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
కొండవీటి సింహం 
Image Credit : Asianet News

కొండవీటి సింహం 

స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కెరీర్ లో ఎన్నోసార్లు పోలీస్ పాత్రల్లో నటించారు. వాటిలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన కొండవీటి సింహం మూవీ ఒకటి. ఈ మూవీలో ఎన్టీఆర్ ఎస్పీ రంజిత్ కుమార్ పాత్రలో విశ్వరూపం ప్రదర్శించారు. ఈ మూవీలో శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. 1981లో విడుదలైన కొండవీటి సింహం మూవీ సంచలన విజయం సాధించింది. 

38
రౌడీ ఇన్‌స్పెక్టర్
Image Credit : Asianet News

రౌడీ ఇన్‌స్పెక్టర్

ఎన్టీఆర్ తర్వాత వెండి తెరపై పోలీస్ పాత్రలకు కళ తీసుకువచ్చింది బాలకృష్ణే అని చెప్పాలి. రౌడీ ఇన్‌స్పెక్టర్ మూవీ బాలయ్య నట విశ్వరూపం ప్రదర్శించారు. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. 

48
సీతయ్య 
Image Credit : Asianet News

సీతయ్య 

నందమూరి హరికృష్ణ సీతయ్య చిత్రంలో పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో అదరగొట్టారు. ఈ మూవీలో సౌందర్య, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో హరికృష్ణ డైలాగ్స్, కీరవాణి అందించిన పాటలు ఒక ఊపు ఊపాయి.  

58
లక్ష్మీ నరసింహ 
Image Credit : Asianet News

లక్ష్మీ నరసింహ 

బాలకృష్ణ మరోసారి పోలీస్ అధికారిగా నటించిన మూవీ లక్ష్మీ నరసింహ. 2004లో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆసిన్ హీరోయిన్ గా నటించారు.

68
బాద్షా 
Image Credit : Asianet News

బాద్షా 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో అండర్ కవర్ లో ఉండే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నటించారు. ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్ లో కనిపించే సన్నివేశాలు ఫ్యాన్స్ ఫీస్ట్ లా ఉంటాయి. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన, బ్రహ్మానందం కామెడీ హైలైట్ గా నిలిచాయి. 

78
పటాస్ 
Image Credit : Asianet News

పటాస్ 

నందమూరి కళ్యాణ్ రామ్ పోలీస్ అధికారిగా నటించిన మూవీ పటాస్. అనిల్ రావిపూడి దర్శకుడిగా ఇది డెబ్యూ మూవీ. లంచగొండిగా ఉండే పోలీస్ అధికారి తిరిగి ఎలా మంచివాడిగా సీనియర్స్ గా మారాడు అనే కథాంశం తో ఈ చిత్రం రూపొందింది. కళ్యాణ్ రామ్ కి చాలా కాలం తర్వాత బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. 

88
టెంపర్ 
Image Credit : Asianet News

టెంపర్ 

జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన టెంపర్ మూవీ కథ కూడా దాదాపుగా పటాస్ లాగే ఉంటుంది. కానీ ఇది కంప్లీట్ గా పూరి జగన్నాధ్ స్టైల్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా నటన అదరగొట్టారు. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ పోలీస్ అయినప్పటికీ చివర్లో మాత్రమే ఖాకీ డ్రెస్ లో కనిపిస్తారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
'కె ర్యాంప్' ట్విట్టర్ రివ్యూ, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం.. కానీ, సినిమా హిట్టా ఫట్టా ?
Recommended image2
ఇది కదా అసలు సిసలైన కాంబో, సెట్ అయితే ఓజీకి 100 రెట్లు ఇంపాక్ట్..పవన్ నెక్స్ట్ మూవీ రేసులో లోకేష్ కనకరాజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved