- Home
- Entertainment
- రేణు దేశాయ్ లైఫ్‌లో సునామీ సృష్టించిన నాగార్జున నిర్ణయం.. ఆయన ఓకే చెబితే ఊహించడం కష్టమే
రేణు దేశాయ్ లైఫ్‌లో సునామీ సృష్టించిన నాగార్జున నిర్ణయం.. ఆయన ఓకే చెబితే ఊహించడం కష్టమే
రేణు దేశాయ్ లైఫ్‌ని పెద్ద టర్నింగ్ పాయింట్ కి, ఆమె జీవితంలోకి ఒక సునామీ రావడానికి కారణం నాగార్జున. అదెలా అనేది ఇందులో తెలుసుకుందాం.

రేణు దేశాయ్‌లో సునామీకి కారణమైన `బద్రి` మూవీ
రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. వీరిద్దరు `బద్రి` సినిమా సమయంలో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు.
పెళ్లికి ముందే సహజీవనం చేశారు. కొన్నాళ్లపాటు కలిసి ఉన్న వీరు పెద్దకొడుకు అకీరాకి జన్మనిచ్చారు. అనంతరం మ్యారేజ్ చేసుకుని ఆధ్యాకి జన్మనిచ్చారు. ఆ తర్వాత విడిపోయారు.
పవన్ మరో అమ్మాయితో ప్రేమలో పడటంతోనే రేణుకి విడాకులు ఇచ్చినట్టు సమాచారం. అదేనా, ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది తెలియదు.
`బద్రి` సినిమాతో ప్రేమలో పడ్డ రేణు దేశాయ్, పవన్
పవన్ కళ్యాణ్‌కి రేణు దేశాయ్ రెండో భార్య. అప్పటికే ఆయన నందినిని వివాహం చేసుకుంటున్నారు. వీరిది అరెంజ్ మ్యారేజ్. కానీ ఇద్దరికీ పడలేదు. దీంతో మ్యారేజ్ అయిన రెండేళ్లకి దూరమయ్యారు.
విడాకులు రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. అయితే నందిని దూరంగా ఉన్నప్పుడు రేణు దేశాయ్ పరిచయం అయ్యింది. `బద్రి` సినిమా సమయంలో వీరిద్దరు కలిశారు. కలిసి నటించారు.
ఆ సమయంలో ఏర్పడిన స్నేహం, ప్రేమ వైపుటర్న్ తీసుకుంది. దీంతో కలిసి సహజీవనం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికి తెలిసిందే.
నాగార్జున రిజెక్ట్ చేయడంతో పవన్ వద్దకు
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లైఫ్‌లోకి రేణు దేశాయ్ రావడం, రేణు దేశాయ్ జీవితంలోకి పవన్ రావడం ఒక విచిత్రంగా జరిగింది. దీనికి కారణం హీరో నాగార్జున అని చెప్పొచ్చు.
ఎందుకంటే `బద్రి` కథ మొదట నాగార్జున వద్దకు వెళ్లింది. అప్పట్లో ఇలాంటి లవ్ స్టోరీలకు నాగ్ కేరాఫ్‌గా ఉన్నాడు. మన్మథుడు ఇమేజ్ ఆయన్ని అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా మార్చేసింది.
దీంతో పూరీ జగన్నాథ్.. నాగార్జునతో సినిమా చేయాలనుకున్నారు. నాగ్ కూడా ఓకే చెప్పారు. కానీ డేట్స్ కుదరని కారణంగా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.
పవన్‌కే ఝలక్ ఇచ్చిన పూరీ జగన్నాథ్
అనంతరం ఈ సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చింది. కెమెరామెన్ ఛోటా కె నాయుడు ద్వారా పవన్‌ని కలిశాడు పూరీ జగన్నాథ్. ఈ కథ చెప్పగానే పవన్ కి నచ్చింది. ఓకే చేశాడు, కాకపోతే క్లైమాక్స్ మార్చమని చెప్పాడట.
సరే సర్ అని వెళ్లిన పూరీ మళ్లీ రెండు రోజుల తర్వాత వచ్చి కథ చెప్పాడు. సేమ్ మొదటి రోజు చెప్పిందే చెప్పాడు, క్లైమాక్స్ లో ఎలాంటి మార్పు చేయలేదు.
ఏంటి సేమ్ చెప్పావు అని అడగ్గా, మీరు స్టోరీ సరిగా వినలేదేమో అని చెప్పాను సర్, క్లైమాక్స్ మార్చడం ఇష్టంలేదు అన్నాడట పూరీ.
పూరీకి పవన్ కళ్యాణ్ టెస్ట్
పూరీలోని గట్స్ కి ఫిదా అయిన పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పాడు. నిజానికి ఆ క్లైమాక్స్ మార్చడం నాకు ఇష్టం లేదు, హీరో కోసం క్లైమాక్స్ మారుస్తావా? లేదా? ఏం చేస్తాడో చూద్దామని టెస్ట్ చేయడం కోసం చెప్పాను అన్నాడట పవన్.
దీంతో పూరీ ముఖంలో ఆనందం వెలిగిపోయింది. సినిమా సెట్ అయ్యింది. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. `బద్రి బద్రినాథ్` అంటూ పవన్ చెప్పే డైలాగ్ కి థియేటర్లలో ఆడియెన్స్ ఊగిపోయారు.
నాగార్జున వల్లే పవన్, రేణు దేశాయ్ కలిశారు
ఈ మూవీ నాగ్ రిజెక్ట్ చేయడం వల్లే పవన్ కి రావడం, ఆయనకు హిట్ ఇవ్వడం ఓ విశేషమైతే, ఈ మూవీతో అటు రేణు దేశాయ్, ఇటు పవన్ కళ్యాణ్ జీవితం మారిపోయింది.
వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే అది అదృష్టమా? దురదృష్టమో వీరిద్దరు విడిపోవడం విచారకరం. కానీ నాగార్జున ఈ మూవీ చేసి ఉంటే
పవన్, రేణు కలిసేవారు కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో పలు సంచలన విషయాలను మనం చూసేవాళ్లం కాదేమో.
పవన్, రేణు విడిపోయాక పవన్ అన్నా లెజినోవాని మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంది. అకీరా, ఆధ్యాలను చూసుకుంటోంది. త్వరలో రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

