- Home
- Entertainment
- తొడగొట్టాడని కైకాల సత్యనారాయణపై ప్రతీకారం తీర్చుకున్న ఎన్టీఆర్.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
తొడగొట్టాడని కైకాల సత్యనారాయణపై ప్రతీకారం తీర్చుకున్న ఎన్టీఆర్.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
ఎన్టీఆర్ భోళాశంకరుడు, ఏదీ మనసులో ఉంచుకోరు, ఏదున్నా మొహం మీదనే చెబుతారు అని అంటుంటారు. కానీ కైకాల సత్యనారాయణ విషయంలో మాత్రం ఓర్వలేకపోయారట.
- FB
- TW
- Linkdin
Follow Us

తెలుగు సినిమాకి యుగ పురుషుడు ఎన్టీఆర్
ఎవరు ఏమనుకున్నా నందమూరి తారక రామారావు ఒక యుగపురుషుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటుడిగా ఎవరికి సాధ్యం కానీ పాత్రలతో అలరించారు. కృష్ణుడిగా, రాముడిగా మెప్పించారు.
తెలుగు వారికి రాముడు అయ్యాడు, కృష్ణుడిగా కీర్తించబడ్డారు. ఇప్పటికీ ఎంతో మంది రాముడు అంటే, కృష్ణుడు అంటే ఆయన్నే గుర్తు చేసుకుంటారు. అలా పాత్రల్లో జీవించి తెలుగు వారిని ఆకట్టుకున్నారు. నటనా సార్వభౌముడిగా రాణించారు.
కైకాల సత్యనారాయణపై ఓర్వలేకపోయిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ వ్యక్తిత్వం విషయంలో తప్పు చూపేవారు చాలా తక్కువ. ఆయనది గొప్ప మనస్తత్వం అని, అందరిని గౌరవిస్తారని, చిన్న పిల్లలను కూడా `అండీ` అని పిలుస్తారని చాలా మంది ఆర్టిస్ట్ లు, తోటీ నటీనటులు తెలిపారు.
ఈగో అసలే ఉండదని అంటుంటారు. కానీ తోటి నటుడు కైకాల సత్యనారాయణ విషయంలో మాత్రం తన ఈగో చూపించారట. తన ముందు తొడగొట్టాడని ఓర్వలేకపోయాడట.
తనపై ప్రతీకారం తీర్చుకున్నాడట. నటుడు కైకాల సత్యనారాయణ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కైకాలపై అలా ప్రతీకారం తీర్చుకున్న రామారావు
అప్పట్లో ఎన్టీఆర్‌కి, ఎస్వీఆర్‌కి మధ్య తీవ్ర పోటీ ఉండేది. నువ్వా నేనా అనేలా నటించేవారు. ఆ తర్వాత రామారావుకి కైకాల సత్యనారాయణ కూడా బాగా పోటీ ఇచ్చారు.
అప్పట్లో ఎన్టీఆర్.. చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించి నిర్మించిన మూవీస్ చాలా ఉన్నాయి.
ఈ క్రమంలో ఓ సినిమా(పేరు చెప్పలేదు) షూటింగ్‌లో ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ మధ్య చిత్రీకరణ జరుగుతుంది. ఇద్దరూ పోటీ పడే సీన్లు తీస్తున్నారు.
ఎన్టీఆర్‌కి సవాల్ విసిరే సీన్‌లో కైకాల సత్యనారాయణ ఆవేశంలో తొడ కొడతాడట. అయితే అది ఎన్టీఆర్‌కి నచ్చలేదు. ఆయన ఈగో దెబ్బతిన్నది.
ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని సీన్ బాగా రాలేదని చెప్పి పది పదిహేను టేక్‌లు తీసుకున్నాడట రామారావు.
బాగా చేశావంటూ కవర్ చేసుకున్న ఎన్టీఆర్
ఇలా తీస్తుంటే విసిగిపోయిన కైకాల `ఏంటి అండీ ఇన్ని టేకులు తీసుకున్నారు` అని ప్రశ్నించాడట. `లేకపోతే ఏంటి నా ముందే తొడగొడతావా` అని అన్నాడట ఎన్టీఆర్.
దీనికి కైకాల షాక్ అయి.. అయ్యో తన ఉద్దేశ్యం అది కాదండీ, మీకు లీడ్ ఇవ్వడం కోసం అలా చేశాను` అని చెబితే తర్వాత కూల్ అయిన ఎన్టీఆర్.. చాలా బాగా చేశారని, ఆ ఆలోచన ఎలా వచ్చిందో మీకు కానీ, సీను అద్భుతంగా వచ్చిందని ప్రశంసించాడట.
మొత్తానికి అలా కవర్ చేసుకున్నాడట. అలా రామారావు ఈగోతో తనని ఇబ్బంది పెట్టాడని తెలిపారు కైకాల సత్యనారాయణ.
ఎన్టీఆర్, కైకాల కాంబినేషన్‌లో సినిమాలు
ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ కలిసి అనేక చిత్రాలు చేశారు. జానపద, పౌరాణిక చిత్రాల్లో ఇద్దరు ఉండాల్సిందే. `దాన వీర శూరకర్ణ`, `లవకుశ`, `శ్రీరామ పట్టాభిషేకం`, `వేటగాడు`, `పాండవ వనవాసం`, `బొబ్బిలి పులి`, `కొండవీటి సింహం`,
`శ్రీకృష్ణపాండవీయం`, `జస్టీస్ చౌదరీ`, `డ్రైవర్ రాముడు`, `యుగంధర్` ఇలా అనేక సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఎస్వీఆర్ తర్వాత మరో ఎస్వీఆర్‌గా పేరుతెచ్చుకున్న కైకాల మూడేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే.