- Home
- Entertainment
- BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్
BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్
రవితేజ హీరోగా నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం 14 రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసుకుందాం. రవితేజకి మరో డిజాస్టర్ లోడింగ్.

రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యింది. గతంలో వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో వచ్చిన రవితేజకి ఆయా చిత్రాలు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో ఆయన రూట్ మార్చారు. కామెడీ ఎంటర్‌టైనర్‌తో వచ్చారు. ఫ్యామిలీ అంశాలకు ప్రయారిటీ ఇస్తూ ఈ మూవీ చేశారు.
సక్సెస్ ఇవ్వని ఇద్దరమ్మాయిల కథ
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ పూర్తిగా ఫ్యామిలీ ఎలిమెంట్లతో సాగుతుంది. ఇంట్లో భార్య(డింపుల్ హయతి) ఉండగా, ఆయన ఫారెన్ వెళ్లి మరో అమ్మాయి(ఆషికా రంగనాథ్)కి కనెక్ట్ అవుతాడు. ఆమెతో కలుస్తాడు. కానీ తనకు పెళ్లి అయిన విషయాన్ని దాస్తాడు. కానీ ప్రియురాలు హైదరాబాద్ వస్తుంది. ఆయన్ని కలవాలనుకుంటుంది. ఆయనకు మరింత దగ్గరవ్వాలనుకుంటుంది. ఈ విషయం తన భార్యకి తెలిస్తే ఇబ్బంది అవుతుందని, తనకు పెళ్లి అయ్యిందని చెబుతాడు. దీంతో అటు ప్రియురాలికి, ఇటు భార్యకి మధ్య రవితేజ నలిగిపోవడమే ఈ మూవీ కథ. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. కానీ ఆశించిన స్థాయిలో ఫన్ వర్కౌట్ కాలేదు. రొటీన్ ఫీలింగ్ కలిగించింది. దీంతో ఈ మూవీకి పెద్దగా ఆదరణ దక్కలేదు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి కలెక్షన్లు
`భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఇప్పటి వరకు 14 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది? సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందా? హిట్టా, ఫట్టా అనేది చూస్తే, ఈ మూవీకి రెండు వారాలకుగానూ రూ.21.5కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. సుమారు రూ.12కోట్ల షేర్ సాధించింది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ రూ.19కోట్లు అని సమాచారం. ఈ లెక్కన ఇప్పుడు సుమారు రూ.8కోట్ల వరకు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ మూవీకి థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు రోజు వారి షేర్ లక్షల్లో ఉంటుంది. ఏం ఆడినా ఈ రెండు రోజులే. కనీసం కోటి కూడా చేయలేని పరిస్థితి. దీంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ దిశగానే వెళ్తుందని చెప్పొచ్చు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ
`భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీకి దాదాపు రూ.40కోట్ల బడ్జెట్ అయ్యింది. థియేట్రికల్‌గా దాదాపు ఇరవై కోట్ల వరకు వచ్చింది. ఇందులోనూ ఎనిమిది కోట్లు నష్టం వచ్చిందట. అదే సమయంలో జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. నామినల్ ప్రైజ్‌తోనే ఈ ఓటీటీకి అమ్మేసినట్టు సమాచారం. ఓవరాల్‌గా ఈ మూవీ పది నుంచి పదిహేను కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
కుర్ర హీరోలు హిట్, రవితేజకి షాక్
సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో అత్యల్ప కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు. `నారీ నారీ నడుమ మురారి` చిత్రానికి కూడా చాలా డల్‌గా వసూళ్లు ఉన్నాయి. థియేటర్లు లేకపోవడంతో కలెక్షన్లు రాలేదు. హిట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లు లేకపోవడం విచారకరం. అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు సమాచారం. అలాగే నవీన్ పొలిశెట్టి నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. అది కూడా బ్రేక్ ఈవెన్ అయ్యిందట. ఇలా కుర్ర హీరోలు కూడా హిట్ కొడుతున్నారు. కానీ రవితేజకి మాత్రం హిట్ దక్కకపోవడం విచారకరం. ఇకపై ఆయన సరైన స్క్రిప్ట్ లను ఎంచుకుని రావాలని కోరుకుందాం.

