MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Tharun Bhaskar: ఈ రెండేళ్లు ఆమెనే సర్వస్వం.. ఈషా రెబ్బాతో పెళ్లిపై తరుణ్‌ స్టేట్‌మెంట్‌.. త్వరలో ప్రకటన

Tharun Bhaskar: ఈ రెండేళ్లు ఆమెనే సర్వస్వం.. ఈషా రెబ్బాతో పెళ్లిపై తరుణ్‌ స్టేట్‌మెంట్‌.. త్వరలో ప్రకటన

హీరోయిన్‌ ఈషా రెబ్బాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో హీరో తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు. త్వరలోనే ప్రకటించబోతున్నట్టు తెలిపారు. రెండేళ్లు ఆమెనే తన సర్వస్వం అని చెప్పాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 27 2026, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్వరలో తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా పెళ్లి
Image Credit : Asianet News

త్వరలో తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా పెళ్లి

హీరోయిన్‌ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే దీనిపై ఈషా రెబ్బా స్పందించింది. తాను ఒకరితో డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పింది. పెళ్లి గురించే చూస్తున్నట్టు వెల్లడించింది. తరుణ్‌ భాస్కర్‌తో పెళ్లి వార్తలను ఆమె చెప్పకనే చెప్పేసింది. త్వరలోనే గుడ్ న్యూస్‌ చెప్పబోతున్నట్టు హింట్‌ ఇచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈషా రెబ్బాతో పెళ్లిపై తరుణ్‌ భాస్కర్‌ కామెంట్‌
Image Credit : youtube/@@youwemedia

ఈషా రెబ్బాతో పెళ్లిపై తరుణ్‌ భాస్కర్‌ కామెంట్‌

ఈ క్రమంలో ఇప్పుడు తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు. ఈషా రెబ్బాతో పెళ్లి వార్తలు వస్తున్నాయి, దీనికి ఎండ్‌ కార్డ్ పెట్టే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకి తరుణ్‌ భాస్కర్‌ రియాక్ట్ అయ్యాడు. రైట్‌ టైమ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నానని, ఈషా తనకు బెస్ట్ ఫ్రెండ్‌, ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అని, గత రెండేళ్లుగా ఆమెనే సర్వస్వం అయ్యిందని, దాంట్లో చెప్పడానికి, దాచడానికి ఏం లేదుగానీ, అనౌన్స్ చేయడానికి రైట్‌ టైమ్ కోసం వెయిట్‌ చేస్తున్నానని తెలిపారు. 

Related Articles

Related image1
Jr Ntr Devara 2 నుంచి మైండ్ బ్లోయింగ్‌ అప్‌ డేట్‌.. చిరంజీవికి సమాధానం చెప్పే టైమ్‌ వచ్చినట్టేనా?
Related image2
Superstar Krishna సంక్రాంతి మొనగాడుగా నిలవడానికి భీజం వేసిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌, శోభన్‌ బాబుకి ఝలక్
35
ఈషాతో పెళ్లి త్వరలోనే ఎండ్‌ కార్డ్
Image Credit : youtube/@@youwemedia

ఈషాతో పెళ్లి త్వరలోనే ఎండ్‌ కార్డ్

`ఇది పర్సనల్‌ విషయం కాబట్టి, నేను ఏదైనా చెబితే అది వేరే వాళ్లని ఎఫెక్ట్ చేసే ఆస్కారం ఉంటుంది, ఈ విషయంలో కాలిక్యూలేటెడ్‌గా ముందడుగు వేయాలనుకుంటాను. నాది బర్రెతోలు, గట్టిగానే ఉంటుంది, కానీ వాళ్లపై ప్రభావం పడుతుందేమో అని ఆలోచిస్తున్నాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఎండ్‌ కార్డ్ వేస్తాం` అని తెలిపారు తరుణ్‌ భాస్కర్‌.

45
సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్న తరుణ్‌ భాస్కర్‌
Image Credit : youtube/@@youwemedia

సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్న తరుణ్‌ భాస్కర్‌

మొత్తంగా ఈషా రెబ్బాతో రిలేషన్‌ నిజమే అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తరుణ్‌ భాస్కర్‌ చెప్పకనే చెప్పారు. సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఆయన చెబుతున్నదాన్ని బట్టి ఈ సమ్మర్‌లోనే ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్లానింగ్‌ కూడా చేసుకుంటున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని సమాచారం.

55
ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంతో రాబోతున్న తరుణ్‌, ఈషా రెబ్బా
Image Credit : youtube/@@youwemedia

ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంతో రాబోతున్న తరుణ్‌, ఈషా రెబ్బా

ఇదిలా ఉంటే తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా కలిసి ప్రస్తుతం `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటించారు. ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తరుణ్‌ భాస్కర్‌ తెలుగు 360తో మాట్లాడుతూ ఈషా రెబ్బాతో పెళ్లి మ్యాటర్‌పై ఓపెన్‌ అయ్యారు. అయితే గత రెండేళ్లుగా ఈ ఇద్దరు రిలేషన్‌లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఈషాని కావాలనే తరుణ్‌ తీసుకున్నాడట. మొదట అనుపమా పరమేశ్వరన్‌ని అనుకున్నప్పటికీ తరుణ్‌ పట్టుబట్టి ఈషాని ఎంపిక చేసినట్టు ఆ మధ్య నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా జర్నీలో ఈ ఇద్దరి మధ్య రిలేషన్‌ మరింత బలపడిందని, ఇప్పుడు పెళ్లికి దారి తీస్తుందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Related Stories
Recommended image1
Jr Ntr Devara 2 నుంచి మైండ్ బ్లోయింగ్‌ అప్‌ డేట్‌.. చిరంజీవికి సమాధానం చెప్పే టైమ్‌ వచ్చినట్టేనా?
Recommended image2
Superstar Krishna సంక్రాంతి మొనగాడుగా నిలవడానికి భీజం వేసిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌, శోభన్‌ బాబుకి ఝలక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved