- Home
- Entertainment
- 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రివ్యూ..జనరేటర్ లో షుగర్ వివాదం, చాలా కాలం తర్వాత నవ్వులు పూయించిన రవితేజ
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ రివ్యూ..జనరేటర్ లో షుగర్ వివాదం, చాలా కాలం తర్వాత నవ్వులు పూయించిన రవితేజ
రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉంది ? రవితేజ ఈ సారైనా హిట్ కొడతారా ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి
మాస్ మహారాజ రవితేజ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రంతో వస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ వచ్చేసింది
చాలా కాలం తర్వాత రవితేజ నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటి వరకు రవితేజ వరుసగా మాస్ సినిమాలు చేశారు. కానీ అన్నీ డిజాస్టర్ అవుతూ వచ్చాయి. ఈ చిత్రంలో ప్రేయసి, భార్య మధ్య నలిగిపోయే వ్యక్తిగా నటిస్తున్నాడు. ట్రైలర్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీతో సాగుతుంది. ట్రైలర్ ప్రారంభంలో రవితేజ తన ఫ్లాప్ సినిమాలపై సెటైర్లు వేసుకున్నారు.
తనపై తానే సెటైర్లు వేసుకున్న రవితేజ
ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్నులు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్ ఇలా తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పారు అంటూ రవితేజ తనపై తానే సెటైర్లు వేసుకున్నారు. ట్రైలర్ లో రవితేజ హీరోయిన్లతో పడే అవస్థలు, కమెడియన్ సత్య చేసే హంగామా నవ్వులు పూయించేలా ఉంది.
కథ ఇదేనా
కొన్ని సన్నివేశాలు కొందరు వ్యక్తుల పై సెటైర్లు వేసినట్లు ఉంటాయి. తన భర్త శ్రీరామ చంద్రుడు అనుకునే హీరోయిన్ డింపుల్ హయతి.. ప్రేమించడానికి, రిలేషన్ షిప్ కి సరైన వ్యక్తి ఇతడే అని భావించే ఆషిక.. వీరి మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథగా కనిపిస్తోంది.
కామెడీ హైలైట్
ట్రైలర్ లో కొన్ని కాంట్రవర్షియల్ అంశాలని కూడా టచ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒక సెలెబ్రిటీ ఫ్యామిలీ జనరేటర్ లో షుగర్ పోసిన వివాదం బాగా హైలైట్ అయింది. దానిని ఈ మూవీలో వాడుకున్నట్లు అనిపిస్తోంది. భీమ్స్ అందించిన బీజియం సినిమా టోన్ కి తగ్గట్లుగా ఉంది. ఆషిక రంగనాథ్ బాగానే గ్లామర్ ఒలకబోసినట్లు ఉంది. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, సునీల్ సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ అయినట్లు ఉన్నాయి. మొత్తంగా మాస్ మాహారాజ్ మాస్ ని పక్కన పెట్టి చాలా కాలం తర్వాత కామెడీతో అలరించబోతున్నారు. ఈ ట్రైలర్ పండక్కి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించేలా ఉంది.

