- Home
- Entertainment
- Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ హీరోయిన్లతో మాత్రం ఆయన తనయుడు బాలకృష్ణ సినిమాలు చేయలేదు. ఒకే ఒక్క హీరోయిన్ తో మాత్రం తండ్రీ కొడుకులిద్దరు రొమాన్స్ చేశారు. ఇంతకీ ఎవరా హీరోయిన్?

తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు..
టాలీవుడ్ అనే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తంలో.. తండ్రీ కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. హీరోయిన్లు కాస్త ఏజ్ పెరిగితే చాలు సీనియర్ హీరోలకు షిప్ట్ అవ్వక తప్పదు. టాలీవుడ్ లో కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగచైతన్య లాంటి యంగ్ హీరోలతో ఆతరువాత కాలంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో కూడా నటించారు. అంతే కాదు గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల జంటగా నటించిన శ్రీదేవితో నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి తరువాతి తరం హీరోలు రొమాన్స్ చేశారు.
బాలయ్య, ఎన్టీఆర్ కు జంటగా నటించిన ఏకైక హీరోయిన్..
ఇలా కొడుకులకు జోడీలతో తండ్రులు, తండ్రులతో నటించిన హీరోయిన్లతో కొడుకులు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీరిలో బాలకృష్ణ ఒక్కరే తన తండ్రితో నటించిన హీరోయిన్లతో సినిమాలు చేయలేదు. శ్రీదేవితో చిరు, నాగ్, వెంకీలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినా.. బాలయ్య మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. తండ్రితో నటించిందన్న కారణంతోనే ఆయన మూవీ చేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ఒక్క హీరోయిన్ తో మాత్రమే అటు సీనియర్ ఎన్టీఆర్, ఇటు బాలకృష్ణ జంటగా నటించారని చాలామందికి తెలియదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు రతీ అగ్నిహోత్రి.
ఎన్టీఆర్ - రతికి మధ్య 40 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్..
రతీ అగ్నిహోత్రి ఒక్కరే అటు సీనియర్ ఎన్టీఆర్ తో ఇటు బాలకృష్ణతో ఇద్దరితో జంటగా నటించింది. 1982 లో వచ్చిన కలియుగ రాముడు సినిమాలో రతీ ఎన్టీఆర్ జోడీగా నటించింది. అంతకు ముందు కూడా సత్యం శివం సుందరం, తిరుగులేని మనిషి సినిమాల్లో ఎన్టీఆర్,రతీ కలిసి నటించారు. ఈ ఇద్దరి మధ్య దాదాపు 40 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉంది. ఇక ఎన్టీఆర్ తో జంటగా నటించిన ఈ హీరోయిన్ ఆతరువాత కాలంలో ఓ సినిమాలో బాలయ్యతో కలిసి డ్యూయోట్లు పాడింది. విచిత్రం ఏంటంటే ఆ సినిమాను డైరెక్టర్ చేసింది పెద్దాయన ఎన్టీ రామారావే.
బాలకృష్ణ మరదలిగా నటించిన రతీ అగ్నిహోత్రి
1982 లో కలియుగ రాముడు సినిమాలో ఎన్టీఆర్ తో స్టెప్పులేసిన రతీ.. 83 లో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో సిద్దయ్యగా నటించి బాలకృష్ణకు మరదలి పాత్రలో నటించింది. వీరిద్దరి లవ్ స్టెరీని సెపరేట్ గా చూపించారు డైరెక్టర్ ఎన్టీ రామారావు. ఇందులో వీరికి రెండు డ్యూయెట్లు కూడా పెట్టారు. ఇలా బాలయ్య తన తండ్రికి జోడీగా నటించి ఒకే ఒక్క హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు. ఆతరువాత చాలా ఏళ్లకు డిక్టెటర్ సినిమాలో బాలకృష్ణకు విలన్ పాత్రలో రతీ అగ్నిహోత్రి నటించి మెప్పించింది.

