MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్

Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్

80స్ హీరోయిన్లలో అందరు ఏదో ఒక సందర్భంలో కనిపిస్తున్నారు... కానీ భానుప్రియ మాత్రం ఎక్కడా కనిపించంలేదు ఎందుకు? భానుప్రియకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఆమె ఎవరితో కలిసుంటుంది. సీనియర్ హీరోయిన్ ఖుష్భూ చెసిన సంచలన కామెంట్స్ ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 06 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్..
Image Credit : stockPhoto

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్..

80, 90 దశకంలో చాలామంది తెలుగు హీరోయిన్లు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలారు. వారిలో భానుప్రియ కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రము ఏలిన హీరోయిన్లలో భానుప్రియ ఒకరు. అందానికి అందం.. నటనకు నటన, డాన్స్ తో.. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆమె.. టాలీవుడ్ లో చిరంజీవికి పోటీగా డ్యాన్స్ చేసిన హీరోయిన్లలో భానుప్రియ ముందుండేది. 

తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా ఆమె స్టార్ డమ్ కు క్లాసికల్ డాన్స్ బాగా ఉపమోగపడింది. దాదాపు 15 ఏళ్లకు పైగా టాలీవుడ్ లో హీరోయిన్ గా వెలుగు వెలిగింది భానుప్రియ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్, వెంకటేష, మోహన్ బాబు, సుమన్, శోభన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా భానుప్రియ బాగా పాపులర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భానుప్రియ కళ్లకు అభిమానులెందరో..
Image Credit : stockPhoto

భానుప్రియ కళ్లకు అభిమానులెందరో..

తెలుగు తెరపై క్లాసికల్ డాన్స్ తెలిసిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయినవారు చాలా తక్కువ మంది. కానీ భానుప్రియ మాత్రం క్లాసికల్ డ్యాన్స్ తోనే ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. స్వర్ణకమలం లాంటి కొన్ని సినిమాల్లో ఆమె చేసిన క్లాసికల్ డ్యాన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. శాస్త్రీయ నృత్యం మాత్రమే కాదు.. స్టార్ హీరోలతో కలిసి ఆమె చేసే మోడ్రన్ డ్యాన్స్ కూడా అభిమానులను ఉర్రూతలూగించింది. మరీ ముఖ్యంగా ఆమె కళ్లకు అభిమానులెందరో ఉన్నారు. భానుప్రియ కళ్లు కలువపువ్వుల్లా ఉండేవి. ఆమె సినిమాల్లో పక్కాగా కళ్లను క్లోజప్ లో చూపించేవారు.

36
భానుప్రియ మాత్రమే ఎందుకు ప్రత్యేకం..
Image Credit : our own

భానుప్రియ మాత్రమే ఎందుకు ప్రత్యేకం..

80 's బ్యాచ్ హీరోయిన్లలో.. దాదాపు అందరు రీ యూనియన్ పేరిట ప్రతీ ఏడాది కలుస్తున్నారు. కానీ భానుప్రియ మాత్రం అందులో కనిపించడంలేదు. కారణం ఏంటి? ఆమెను పిలవలేదా? లేక ఆమె రాలేదా.. ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. పైగా దో ఒక సందర్భంలో పాత హీరోయిన్లు కనిపిస్తుంటారు. కానీ భానుప్రియ మాత్రం ఎక్కడా కనిపించరు. ఏఈవెంట్ కు వెళ్లరు. ఈ విషయంపై సీనియర్ నటి, 80 's హీరోయిన్ ఖుష్బూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె రీ యూనియన్ గురించి మాట్లాడుతూ.. భానుప్రియ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె ఎందుకు ఎవరితో కలవరన్న విషయాన్ని కూడా వెల్లడించారు.

46
ఖుష్బూ భానుప్రియ గురించి మాట్లాడుతూ...
Image Credit : our own

ఖుష్బూ భానుప్రియ గురించి మాట్లాడుతూ...

''ప్రతీ ఏడాది రీ యూనియన్ లో మేము ఏజ్ మర్చిపోయి చిన్న పిల్లలమైపోతాము.. తెగ ఎంజాయ్ చేస్తాము.. స్టార్ డమ్ అనేది అప్పుడు గుర్తు రాదు. స్కూల్ ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేస్తాము.మాకు ఓ గ్రూప్ కూడా ఉంది. అందులో 36 మంది టీమ్ ఉన్నాము. ప్రతీ రోజు మెసేజ్ చేసుకుంటుంటాము. మా టీమ్ లో అందరు ఉన్నారు. భానుప్రియ 80 స్ రీ యూనియన్ కు రాకపోవడానికి మేము కారణం కాదు. 

భానుప్రియను రెండు మూడు సార్లు పిలిచి చూశాము. కానీ తాను సరిగ్గా ఉండదు. అందరిలో కలిసిపోలేదు... పిలిచినా ఆమె రీ యూనియన్ కు రాలేదు. అప్పటి నుంచి పిలవడం మానేశాము. అసలు మొదటి నుంచి షూటింగ్స్ లో కూడా భానుప్రియ ఎవరితో కలిసి ఉండదు. ఎవరినైనా అడగండి భానుప్రియకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎవరు అంటే ఎవరు లేదరే చెపుతారు. షూటింగ్స్ లో కూడా ఆమె ఒక్కతే ఉండేవారు. ఐసోలేట్ అయ్యి ఉంటారు, ఎవరితో కలవరు. అని కుష్బు అన్నారు.

56
ఎవరెవరు లేరంటే?
Image Credit : instagram

ఎవరెవరు లేరంటే?

80 's రీ యూనియన్ లో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ నుంచి చాలా మంది స్టార్స్ ఉన్నారు. కానీ మలయాళం నుంచి మమ్ముట్టి, తమిళం నుంచి కమల్ హాసన్ మాత్రం 80 స్ రీ యూనియన్ లో లేరు. బాలయ్య కూడా ఇందులో లేరు. మా టీమ్ లో అందరు ఏదైనా పార్టీకి, పెళ్లికి, దేనికి వెళ్లాలన్నా.. ప్లాన్ చేసుకుంటాము. ఎవరెవరు వెళ్తున్నారు అనేది కనుక్కొని అందరు కలిసి ప్లాన్ చేసుకుని వెళ్తాము. అని ఖుష్బూ అన్నారు.

66
భానుప్రియ జీవితంలో విషాదాలు..
Image Credit : youtube/@teluguone

భానుప్రియ జీవితంలో విషాదాలు..

భానుప్రియ గురించి గతంలో ఓ దర్శకుడు చాలా విషయాలు వెల్లడించారు. ఆమె మనసు చాలా మంచిది. కానీ ఆమె తల్లి స్వార్ధం, భర్త వ్యాసనాలు ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లో పడేశాయి. భర్తను వదిలేసి హ్యాపీగా బ్రతకాలి అనుకుంటే.. ఆమెను అనారోగ్యం వెంటాడింది. తల్లి స్వార్థపూరితంగా ఆలోచిస్తోందని గ్రహించిన భానుప్రియ, తాను సంపాదించిన ఆస్తిని తల్లికే వదిలేసి, కట్టు బట్టలతో ఆదర్శ్ తో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ భర్త వ్యసనాలు వల్ల ఇబ్బందులు పడింది. ఆయన్ను వదిలేసి చెన్నైకి తిరిగి వచ్చింది. కానీ ఆమె సంపాదించింది మాత్రం తనతో తీసురాలేదు. భర్త నుంచి కూడా ఆమెకు డబ్బులు రాలేదు. అయినా భానుప్రియ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదనిఓ దర్శకుడు ఇంటర్వ్యూలో అన్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
VK Naresh: చంద్రబాబే పిల్లల్ని కనమని చెప్పాడు, నా తప్పేం లేదు... ట్రోల్స్ పై నరేష్‌ రియాక్షన్‌
Recommended image2
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image3
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Related Stories
Recommended image1
Peddi Piracy: HD క్వాలిటీతో పెద్ది పైరసీ.. రిలీజ్ అయిన రెండో రోజే రామ్ చరణ్ టీమ్ కు భారీ షాక్..
Recommended image2
Trisha ‌- CM Vijay: త్రిషకు హ్యాండిచ్చిన విజయ్ దళపతి, సీన్ లోకి వచ్చిన మరో స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved