MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: నేను ఆమెకి రెండో అమ్మని.. చెల్లిపై రష్మిక ఎమోషనల్‌ కామెంట్‌

Rashmika Mandanna: నేను ఆమెకి రెండో అమ్మని.. చెల్లిపై రష్మిక ఎమోషనల్‌ కామెంట్‌

సౌత్, బాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న, ఇటీవల టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. తన చెల్లి గురించి ఆమె ఎమోషనల్‌ కామెంట్‌ చేశారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నేషనల్‌ క్రస్‌గా పాపులర్‌ అయిన రష్మిక
Image Credit : Instagram

నేషనల్‌ క్రస్‌గా పాపులర్‌ అయిన రష్మిక

రష్మిక మందన్న పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తోంది. నేషనల్‌ క్రష్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. అలాగే 2026 ఫిబ్రవరి 28న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చెల్లిని చూసి రష్మిక ఎమోషనల్‌
Image Credit : Instagram

చెల్లిని చూసి రష్మిక ఎమోషనల్‌

రష్మిక పాత ఇంటర్వ్యూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి షిమాన్ ఫోటోలు చూపించగా, రష్మిక భావోద్వేగానికి గురయ్యారు. ఒకటి, చెల్లి పుట్టినప్పుడు ఎత్తుకున్న ఫోటో. మరొకటి, షూటింగ్ స్పాట్‌లో తనతో ఉన్న ఫోటో.
36
చెల్లికి రెండో అమ్మని
Image Credit : Instagram

చెల్లికి రెండో అమ్మని

ఆ రెండు ఫోటోలను చూసి రష్మిక ఎమోషనల్ అయ్యారు. `అవును, నా చెల్లి షిమాన్ నాకంటే 16 ఏళ్లకు పైగా చిన్నది. నేను తనకి రెండో అమ్మని. షిమాన్‌ను నా చెల్లి అనడం కన్నా, నా మొదటి బిడ్డ అని పిలవడానికే నేను ఇష్టపడతాను` అని రష్మిక అన్నారు. ఇంటర్వ్యూలో చెల్లి ఫోటో చూడగానే ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూస్తే, తన చెల్లెలు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.

46
రష్మిక చెల్లికి ఏజ్‌ గ్యాప్‌
Image Credit : Instagram

రష్మిక చెల్లికి ఏజ్‌ గ్యాప్‌

సాధారణంగా అక్కాచెల్లెళ్ల మధ్య కొన్నేళ్ల వయసు తేడా ఉంటుంది. కానీ రష్మిక, షిమాన్ విషయంలో ఇది వేరు. ఏప్రిల్ 5 నాటికి 29 ఏళ్లు నిండిన రష్మికకు, ఆమె చెల్లి షిమాన్‌కు ఇప్పుడు 13-14 ఏళ్లు. రష్మిక సినిమాల్లో సక్సెస్ అవుతున్న టైంలో, షిమాన్ ఇంకా స్కూల్ విద్యార్థిని. ఈ వయసు తేడాయే వాళ్లిద్దరి బంధాన్ని మరింత బలంగా మార్చింది. అందుకే రష్మిక తన చెల్లిని 'నా మొదటి బిడ్డ' అని పిలుచుకుంటుంది.

56
చెల్లిని సరిగా చూసుకోలేదని రష్మిక ఆవేదన
Image Credit : Instagram

చెల్లిని సరిగా చూసుకోలేదని రష్మిక ఆవేదన

కెరీర్‌లో సక్సెస్ అయినా, పర్సనల్ లైఫ్‌లో కొన్ని అందమైన క్షణాలను మిస్ అయ్యానని రష్మిక బాధపడ్డారు.`నా చెల్లి నాకంటే 16 ఏళ్లు చిన్నది. తను పెరిగి పెద్దవ్వడాన్ని నేను సరిగ్గా చూడలేదు` అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

66
రష్మిక చెల్లి విషయంలో ఆవేదన
Image Credit : Instagram

రష్మిక చెల్లి విషయంలో ఆవేదన

`గత ఎనిమిదేళ్లుగా పని వల్ల ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉన్నాను. తను చిన్నప్పటి నుంచి టీనేజ్‌లోకి అడుగుపెట్టడాన్ని నేను కళ్లారా చూడలేకపోయాను. ఇప్పుడు తను దాదాపు నాంత ఎత్తు పెరిగింది` అని రష్మిక బాధపడ్డారు. షూటింగ్ బ్రేక్స్‌లో చెల్లితో గడపడమే రష్మికకు పెద్ద పండగ అని కూడా తెలిసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రష్మిక మందన్న
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Related Stories
Recommended image1
Sai Pallavi: ఎయిర్‌పోర్ట్ లో సాయిపల్లవిని పట్టుకుని నిలదీసిన మహిళ.. ఆ వివాదాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌
Recommended image2
Varun Sandesh: వరుస ఫ్లాపులు, సినిమాలకు వరుణ్‌సందేశ్‌ గుడ్‌ బై.. భార్య వితిక షేరు ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved