రష్మిక మందన్న షూటింగ్స్ లేకుంటే, ఖాళీ టైమ్ లో ఏం చేస్తుందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న షూటింగ్స్ లేకుంటే ఏం చేస్తుందో తెలుసా? ఖాళీ సమయం ఆమె చేసే పని ఏంటి?

సెలబ్రిటీల లైఫ్ పై సోషల్ మీడియా ప్రభావం
సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ గురించి కామన్ ఆడియన్స్ లో ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది. స్టార్స్ ఏం చేస్తుంటారు. ఇంట్లో ఎలా ఉంటారు, ఎలాంటి తిండి తింటారు, ఇలా ఎన్నో విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో అయితే ఈ విషయాలు ఎవరికి పెద్దగా తెలిసేవి కావు. కాని సోషల్ మీడియా ప్రభావం పెరిగినప్పటి నుంచి స్టార్స్ తో డైరెక్ట్ గా లైవ్ చార్ట్స్ కూడా చేసే అవకాశం ఆడియన్స్ కు లభిస్తోంది. అంతే కాదు సెలబ్రిటీలు కూడా ఎప్పుడు ఏం చేసిన.. సాధ్యమైనంత వరకూ వారి అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు. ఈక్రమంలోనే ఖాళీ టైమ్ లో సెలబ్రిటీలు ఏం చేస్తుంటారు అనే విషయంపై చాలామంది ఇప్పటికే వారి వివరాలను ఫ్యాన్స్ తో పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా తాను కాస్త టైమ్ దొరికితే ఏం చేస్తుందో వివరించింది
KNOW
పాన్ ఇండియాలో దూసుకుపోతున్న రష్మిక
పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలతో తెరపై సుడిగాలిలా దూసుకుపోతుంది. వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అటు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది బ్యూటీ. రీసెంట్ గా ఆమె నటించిన తెలుగు,తమిళ, హిందీ మూవీ కుబేర హిట్ అవ్వడంతో మరోసారి హల్ చల్ చేసింది రష్మిక. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండే రష్మిక షూటింగ్ లేని టైమ్ లో ఏం చేస్తుందన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఖాళీ టైమ్ లో రష్మిక చేసే పని ఏంటి?
గతంలో ఓ సందర్భంలో ఈ విషయంపై స్పందించిన రష్మిక ఒక్కోసారి బిజీ షెడ్యూళ్ల మధ్య విరామం దొరికితే, తన పెంపుడు కుక్కతో టైమ్ స్పెండ్ చేయడం తనుకు ఇష్టమని ఆమె వెల్లడించింది. వాకింగ్‌కు వెళ్లడం, పుస్తకాలు చదవడం లేదా వీడియా షోలు చూసే పని చేస్తుందట స్టార్ హీరోయిన్ . “నేను చాలా సాధారణ వ్యక్తిని. పని నుంచి బ్రేక్ దొరికినప్పుడు చిన్న విషయాలలో సంతోషాన్ని వెతుక్కుంటాను. నా పెంపుడు కుక్కతో ఆడుకోవడం నాకు ఎంతో ఇష్టం,” అని రష్మిక అన్నారు.
బిజినెస్ లతో బిజీ బిజీగా నేషనల్ క్రష్
ఒకప్పుడు అలా చేసేది కాని.. ఇఫ్పుడు ఆ టైమ్ దొరకడంలేదట. ఎందుకంటే రష్మిక స్టార్ అయిన తరువాత కొన్ని బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టింది. తన తండ్రి వ్యాపార వేత్త కావడంతో షూటింగ్స్ లేనప్పుడు రష్మిక తన వ్యాపారపరమైన పనులను కూడా సమర్థంగా నిర్వహిస్తోంది. ఈ విషయంలో ఆమె మాట్లాడుతూ.. "కొన్నిసార్లు బ్రాండ్ క్లయింట్స్‌తో ఫోన్ కాల్స్ ఉంటాయి. అలాగే కాస్త ఖాళీ దొరికినా.. నా 'Dear Diary' ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమవుతాను. ఫౌండర్‌గా అన్ని విషయాలపై నిఘా ఉంచాల్సిన బాధ్యత ఉంది," అని రష్మిక వివరించారు.
ఫిట్ నెస్ విషయంలో తగ్గేదే లే
ఫిట్‌నెస్ విషయంలో ఎంతో దృష్టి పెడతానని చెప్పిన రష్మిక, యోగా, వెయిట్ ట్రైనింగ్, ఇతర వ్యాయామాలను నియమితంగా చేస్తానని చెప్పింది. ఇది శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ప్రశాంతతకూ అవసరమని అభిప్రాయపడింది. "ప్రకృతితో సమయం గడపడం, కుటుంబంతో కలిసి ఉండటం లేదా నన్ను నేనే అర్థం చేసుకోవడం కూడా నా జీవనశైలిలో భాగమే. మంచి ఆహారం, సరైన స్కిన్ కేర్ రొటీన్ పాటించటం ద్వారా ఒత్తిడిని దూరం ఉంచుకుంటాను." అని ఆమె వెల్లడించారు.
చిరంజీవి, నాగార్జున క్రష్ గా రష్మిక మందన్న
ఇటీవల కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో రష్మిక మళ్ళీ టాప్ గేర్‌లోకి వెళ్లిన నేపథ్యంలో, ఆమె ఆఫ్ స్క్రీన్ జీవితం అభిమానుల ఆసక్తికి కారణమవుతోంది. ఈమధ్యనే ఆమె కుబేరా సినిమాలో నటించింది. ఈసినిమా సక్సెస్ మీట్ లో రష్మికపై ప్రశంసల వర్షం కురిసింది. ఆమెను పొగుడుతూ కింగ్ నాగార్జున తో పాటు మెగాస్టార్ చిరంజీవ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్మిక నా క్రష్ అని నాగార్జున అంటే.. కాదు కాదు నా క్రష్ కూడా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రష్మికను నాగార్జున శ్రీదేవితో పోల్చారు, చిరంజీవి మాత్రం ఆమెను సౌందర్యతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇలా స్టార్ హీరోయిన్ గా పాన్ఇండియా స్టార్స్ నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది రష్మిక మందన్న.
#RashmikaMandanna is my Crush also - #Chiranjeevi#Nagarjuna#Kuberaa#TeluguFilmNagarhttps://t.co/0RF4lXngsrpic.twitter.com/CmiIQleqdX
— Telugu FilmNagar (@telugufilmnagar) June 22, 2025

