శంకర్ కంటే ముందే, 30 ఏళ్ల క్రితమే రోబో సినిమా చేసిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా?
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ 15 ఏళ్ల క్రితం రోబో సినిమాతో సంచలనం సృష్టించాడు, ఆ టెక్నాలజీకి ఆడియన్స్ మంత్రముగ్ధులు అయ్యారు. కాని శంకర్ కంటే ముందు, 30 ఏళ్ళ క్రితమే తెలుగు దర్శకుడు రోబో టెక్నాలజీని తన సినిమాలో వాడాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా డైరెక్టర్?

ఇండియన్ సినిమాలో టెక్నాలజీ
ఇండియాన్ సినిమా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. అన్నిరంగాల్లోకి టెక్నాలజీ వచ్చి చేరినట్టే.. సినిమారంగంలో కూడా టెక్నాలజీ ప్రభావం గట్టిగా చూపించింది. దాంతో ఎప్పటికప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అప్ డేట్ అవుతూ వచ్చింది. దాని వల్ల షూటింగ్ టైమ్ తగ్గడం తో పాటు, గ్రాఫిక్స్ మాయాజాలంతో సినిమా మరింత ఎంటర్టైనింగ్ గా తయారయ్యింది. ముఖ్యంగా టాలీవుడ్ టెక్నాలజీని వాడుకోవడంతోనే పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. రాజమౌళి లాంటి దర్శకులు ఈ టెక్నాలజీకి తమ ఆలోచనలు జోడించి సినిమా టాలీవుడ్ ను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లారు. అయితే టాలీవుడ్ ను కొత్త పుంతలు తొక్కించి టెక్నాలజీ అలవాటు చేసింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి. ఫస్ట్ కలర్ సినిమా ఆయనదే. కలర్ ప్రింట్ కోసం అప్పుడు ఆయన లక్షల్లో ఖర్చు చేశారు. విదేశాల నుంచి కలర్ ప్రింట్ తెప్పించారు. ఇలా సినిమాల విషయంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు.
KNOW
ఆకాలంలోనే అద్భుతాలు చేశారు
అయితే టెక్నాలజీతో పనిలేకుండా టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు గతంలో వచ్చాయి. మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు, సింగీతం శ్రీనివాసరావు, కేవి రెడ్డి లాంటి దర్శకులు ఏం మాయ చేశారో కాని కొన్ని సినిమాలలో అద్భుతమైన విజ్యూవల్ ఎఫెక్ట్ చూపించగలిగారు. ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాలో మూడు పాత్రలు చేయడం. మయసభ సెట్టింగ్ అద్భుతం. ఇక మాయా బజార్ సినిమా అయితే ఆ గ్రాఫిక్స్ ఎలా చేశారో కూడా తెలియదు. ఘటోత్కచుడిమాయ, అర్జునుడు శశిరేఖకు పంపించిన ప్రియదర్శిని, సత్య పీఠిక ఇలా ఎన్నో అద్భుతాలు అప్పటి ప్రేక్షకులను మద్రముగ్ధులను చేశాయి. ఇప్పటికీ ఈఎఫెక్ట్స్ ను ఆ కాలంలో ఎలా చూపించగలిగారో చాలా మందికి అర్ధం కాని విషయమే. ఇక సింగీతం శ్రీనివాసరావు చేసిన అద్భుతాలు అయితే చెప్పలేము. ఆయన 100 ఏళ్ళకు పైగా అడ్వాన్స్ గా ఆలోచించి ఆదిత్య 369 సినిమా చేశారు. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ మిషన్ ను 35 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు సింగీతం. ఇలా ఆకాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు అప్పటి మూవీ మేకర్స్.
సంచలనం సృష్టించిన శంకర్ రోబో సినిమా
అయితే ఆతరువా కాలంలో శంకర్ లాంటి దర్శకులు టెక్నాలజీని బాగా ఉపమోగించుకుని రోబోలాంటి అద్బుతమైన సినిమాలు తెరకెక్కించారు. శంకర్ రోబో, సినిమా చేసిన కొన్నేళ్లకు రోబో 2. 0 మూవీని తెరకెక్కించారు. అయితే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రోబో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాని ఆతరువాత భారీ బడ్జెట్ తో, వరల్డ్ క్లాస్ టెక్నాలజీని ఉపయోగించి చేసిన రోబో 2. 0 మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మేకర్స్ కు భారీగా నష్టాలను మిగిల్చింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. శంకర్ కంటే ముందే 30 ఏళ్ల క్రితం మన తెలుగు దర్శకుడు రోబోను తన సినిమాలో భాగం చేశారు.
శంకర్ కంటే ముందే రోబో సినిమా చేసిన తెలుగు దర్శకుడు
శంకర్ కంటే ముందే రోబోతో సినిమాను రూపొందించి అడ్వాన్స్ గా ఆలోచించాడు. ఆయన మరెవరో కాదు ఎస్వీ కృష్ణారెడ్డి. 1995 లో వచ్చిన ఘటోత్కచుడు సినిమాలో రోబోతో రకరకాల విన్యాసాలు చేయించారుఎస్వీ కృష్ణారెడ్డి. ఈఏడాదికి ఆ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్లు అవుతోంది. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ ఘటోత్కచుడి క్యారెక్టర్ చేశారు. ఇక రోజా హీరోయిన్ గా నటించారు. ఆలీ హీరోగా నటించిన ఈసినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అడ్వాన్స్ టెక్నాలజీ గురించి చూపించారు. రోబోలు ఎలా పనిచేస్తాయి అన్నది వివరించాడు కృష్ణారెడ్డి. అటు భక్తి, ఇటు సైన్స్ రెంటింటిని కలిపి ఆయన చేసిన ప్రయోగం అప్పట్లోనే ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించింది.
అసలు విషయం గుర్తు చేసిన రోజా
ఇక శంకర్ కంటే ముందు ఎస్వీ కృష్ణా రెడ్డి ఈ ఘనత సాధించారన్న విషయాన్ని హీరోయిన్ రోజా గుర్తు చేశారు. రీసెంట్ గా జరిగిన ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా హీరోయిన్ రోజా గుర్తుచేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి టాలెంట్ గురించి ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయన సినిమాలు చేయడంలేదు. కొంత కాలం క్రితం వరకూ సినిమాలు తెరకెక్కించిన కృష్ణారెడ్డి.. ఆతరువాత సినిమాలు మానేశారు. 2023 లో వచ్చిన ఆర్గానిక్ మామా, హైబ్రీడ్ అల్లుడు సినిమా తరువాత ఆయన మరే సినిమా చేయలేదు. ఇండస్ట్రీలో ఇతర విషయాల్లో యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు.