- Home
- Entertainment
- అల్లు అర్జున్ నే అల్లాడించారు, అమెరికా టాలెంట్ షోలో పుష్ప అరాచకం, ఏంటి సామీ ఇది, మామూలుగా లేదుగా
అల్లు అర్జున్ నే అల్లాడించారు, అమెరికా టాలెంట్ షోలో పుష్ప అరాచకం, ఏంటి సామీ ఇది, మామూలుగా లేదుగా
పుష్పరాజ్ ప్రభావం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. పుష్ప మ్యానియా చాలామందికి ఇంకా వదలడంలేదు. ఈసినిమాకు సబంధించిన తాజాగా వైరల్ అయిన వీడియో చూసి అల్లు అర్జున్ షాక్ అయ్యాడు.

ప్రపంచ వ్యాప్తంగా పుష్ప మ్యానియా
ప్రపంచ వ్యాప్తంగా పుష్ప మ్యానియా ఇంకా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, డైలాగులు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ క్రేజ్ మరోసారి ప్రూ అయ్యింది. ఈసారి ఇండియాలో కాదు ఏకంగా అమెరికాలో మన పుష్పరాజ్ రచ్చ రచ్చ చేశాడు. అటు అల్లు అర్జున్ కూడా షాక్ అయ్యేలా వారు ఏం చేశారంటే?
KNOW
అమెరికాలో రచ్చ చేసిన పుష్ప థీమ్
అమెరికాలో ప్రసారం అయ్యే పాపులర్ ట్యాలెంట్ షో ‘అమెరికా గాట్ ట్యాలెంట్’ వేదికగా పుష్ఫ సినిమా పాటకు ఘనంగా స్పందన లభించింది. అయితే ఆ షోలో పెర్ఫామ్ చేసింది మాత్రం మన ఇండియన్ వారే కావడం విశేషం. ఇండియాలోని జోధ్‌పూర్‌కు చెందిన డ్యాన్స్ గ్రూప్ B Unique Crew ఈ షోలో ‘దాక్కో దాక్కో మేక’ పాటకు అత్యంత ఎనర్జీతో కూడిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జిమ్నాస్టిక్స్, మోషన్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్రెజెంటేషన్‌తో ఈ గ్రూప్ ఇచ్చిన ప్రదర్శన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ నటించిన చిత్రంలోని పాటకు ఇచ్చిన ఈ గుర్తింపు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Icon Star @alluarjun's #Pushpa is a global phenomena 💥💥
The 'B Unique Crew' performed for the #Pushpa song on @AGT Season 20 stage and the response was sensational 🤩
The judges hailed it as 'THE BEST PERFORMANCE OF THE SEASON' 🌟🇮🇳❤️🔥pic.twitter.com/Nx1Zcfpyfw— Pushpa (@PushpaMovie) August 4, 2025
అదిరిపోయిందంటూ అల్లు అర్జున్ కామెంట్స్
ఈ పర్ఫార్మెన్స్ వీడియోను పుష్పమూవీ టీమ్ అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేయగా, అల్లు అర్జున్ స్వయంగా స్పందించారు. “Absolutely mind blowing performance అంటూ ఆయన కామెంట్ చేశారు. బన్నీ మెచ్చిన ఈ వీడియోను అల్లు ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. తమ హీరోకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆనందంతో సోషల్ మీడియాలో ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గ్రూప్స్ అన్నింటిల్ ఈ వీడియో మారుమోగుతోంది.
Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD
— Allu Arjun (@alluarjun) August 4, 2025
పాకిస్తాన్ లోను పుష్పకు భారీగా ఫ్యాన్స్
పుష్ప, పుష్ప2 సినిమాలకు, ఇందులో డైలాగ్స్ కు, బన్నీ మ్యానరిజానికి, ప్రపంచ వ్యాప్తంగా స్పందన వచ్చింది. ఈ సినిమాకు గతంలో డేవిడ్ వార్నర్, డీజే బ్రావో వంటి సెలబ్రిటీలు డ్యాన్స్ చేస్తూ స్పందించిన సంగతి తెలిసిందే. జపాన్ కపుల్ డాన్స్, కొరియన్ స్టార్ బన్నీని ఇమిటేట్ చేయడం లాంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాయి. పుష్ప రెండు సినిమాలతో జపాన్, కొరియా, చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. విచిత్రం ఏంటంటే పుష్ప సినిమా వల్ల పాకిస్తాన్ లో కూడా అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇప్పుడు అంతర్జాతీయ టీవీ షోలో ఈ పాట వినిపించడంతో, అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో మాస్ లెవెల్ స్టార్‌గా గుర్తింపు పొందుతున్నందుకు సంతోషిస్తున్నారు అభిమానులు.
అల్లు అర్జున్ భారీ బడ్జెట్ సినిమా
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ మూవీ మేకర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుండగా, ఇటీవల ముంబైలో వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈసినిమా కోసం హాలీవుడ్ అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని కోసం ఫారెన్ వెళ్లి స్పెషల్ సిట్టింగ్స్ కూడా వేశారు బన్నీ, అట్లీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈసినిమా కోసం దాదాపు 800 కోట్లు ఖర్చు చేయబోతున్నరని తెలుస్తోంది. ఈసినిమాలో అల్లు అర్జున్ డ్యూయ ల్ రోల్ లేద ట్రిపుల్ రోల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక సినిమా వర్క్ అంతా ముంబయ్ లో ఎక్కువగా జరుగుతుండటంతో.. అక్కడ అల్లు అర్జున్ ఫ్లాట్ తీసుకుని షిప్ట్ అయినట్టు తెలుస్తోంది.