- Home
- Entertainment
- కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?
Dhurandhar Collection: రణవీర్ సింగ్ సినిమా ధూరందర్ విడుదలై 19 రోజుల్లో 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ధూరందర్ రిషబ్ శెట్టి సినిమా కాంతార చాప్టర్ 1 రికార్డును కూడా బద్దలు కొట్టింది.

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా..
రణవీర్ సింగ్ సినిమా ధూరందర్ ప్రతిరోజూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజూ కలెక్షన్ల అంకెలతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదలైన 19వ రోజులు అవుతోంది. మరి ఈసినిమా ఇప్పటి వరకూ ఎలాంటి మ్యాజిక్ చేసిందో తెలుసా
2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా
మీడియా కథనాల ప్రకారం, రణవీర్ సింగ్ ధూరందర్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 925.28 కోట్లు వసూలు చేసింది. అప్పటి వరకూ రిలీజ్ అయిన చాలా సినిమాల రికార్డులను ధురంధర్ నిలిచింది.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంత?
sacnilk.com ప్రకారం, ధూరందర్ సినిమా విడుదలైన 19వ రోజున రూ. 17.25 కోట్ల వ్యాపారం చేసింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెట్ రూ. 589.50 కోట్లు సంపాదించింది.
కాంతార 1 రికార్డు బ్రేక్ చేసిన సినిమా..
ఈ ఏడాది అంటే 2025లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సౌత్ యాక్టర్ రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇప్పటి వరకు ఉంది. ఇది రూ. 900 కోట్ల వ్యాపారం చేసింది. ఇప్పుడు ధూరందర్ రూ. 925.28 కోట్లు సంపాదించి.. కాంతార రికార్డును బ్రేక్ చేసింది. టాప్ మూవీగా నిలిచింది.
బాక్సాఫీస్ దగ్గర ఛావా కలెక్షన్లు..
విక్కీ కౌశల్ సినిమా 2025లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 797.34 కోట్ల వ్యాపారం చేసింది. కాంతార చాప్టర్ 1 కంటే ముందు ఛావా కలెక్షన్ల విషయంలో టాప్‌లో ఉండేది.
రజినీకాంత్ కూలీ
రజనీకాంత్ కూలీ కూడా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 675 కోట్ల వ్యాపారం చేసింది. ఇది 2025లో నాలుగో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. .
చిన్నసినిమా పెద్ద విజయం..
అహాన్ పాండే ఈ ఏడాదే అరంగేట్రం చేశాడు. అతని మొదటి సినిమా సైయారా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సైయారా 2025లో ఐదో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ. 579.23 కోట్లు సంపాదించింది.

